Huzurnagar News: జాబ్ మేళా అంటే కేవలం సిటీలకు మాత్రమే పరిమితం అయ్యేవి. ఇదంతా ఒకప్పుడు మాట. ఒకప్పుడు వివిధ జిల్లాలకు ప్లాన్ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. తాజాగా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ఉమ్మడి నల్గొండ జిల్లా హుజూర్‌నగర్‌లో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.
హుజూర్‌నగర్‌లో మెగా జాబ్ మేళా
అక్టోబర్ 25న ఉమ్మడి నల్గొండ జిల్లా హుజూర్‌నగర్‌లో మెగా జాబ్ మేళా జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా జరగనుంది. దాదాపు 200 కంపెనీలు నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులను ఎంపిక చేసుకోనున్నాయి. ఈ కార్యక్రమాన్ని నిరుద్యోగులు వినియోగించుకోవాలని రాష్ట్ర నీటి పారుదల మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు.
పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమో, డిగ్రీ, ఎంబీఏ, బీటెక్, ఫార్మసీ, పీజీ చేసిన యువతీయువకులకు ఇదొక సువర్ణ అవకాశం. ఫైనాన్స్, హెచ్ఆర్, ఐటీ, బయోటెక్, డిజిటల్ మీడియా, మానుఫ్యాక్చరింగ్, బిజినెస్ సేల్స్, టెలీ కాలర్స్, పరిపాలన, కస్టమర్స్ సపోర్టు వంటి వివిధ విభాగాలు ఉన్నాయి. దాదాపు 12 వేల మంది నుంచి 13 వేల మందికి ఉపాది కల్పించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది ప్రభుత్వం.
యువతీయువకులకు బంపరాఫర్
2 లక్షల నుంచి 8 లక్షల వరకు ప్యాకేజ్‌ని సొంతం చేసుకోవచ్చు. ఉద్యోగం బట్టి వయస్సు పరిమితి ఉండనుంది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతీయువకులు హాజరుకావాలని సూచించారు అధికారులు. అలాగే రెజ్యూమ్ కూడా తీసుకురావాలని చెబుతున్నారు.
వేదిక ఎక్కడనుకుంటున్నారా? హుజూర్ నగర్‌లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వెనుక ఉన్న పెర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్ లో జరగనుంది. అక్టోబర్ 25న అనగా శనివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగైదు గంటల వరకు జాబ్ మేళా జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమం మెగా జాబ్ మేళా. ఉమ్మడి జిల్లాల నిరుద్యోగులు, ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు బంపరాఫర్.
ALSO READ: కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ప్రభుత్వం అండ-సీఎం రేవంత్
మెగా జాబ్ మేళాలో యువతీ యువకులు ఈ విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలి. ఇంటర్వ్యూలో సంబంధిత కంపెనీ వ్యక్తికి నమస్కారం చెప్పాలి. వాళ్లు కూర్చోమని చెప్పేవరకు కూర్చోకూడదు. వారు అడిగే ప్రశ్నలకు ఆత్మవిశ్వాసంతో సమాధానాలు చెప్పాలి. ఒకవేళ తెలియని అంశాల గురించి ప్రస్తావిస్తే తెలియదని చెప్పాలి. నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పడం ఇంకా మంచింది. నవ్వుతూ కళ్లల్లోకి చూసి మాట్లాడగలగాలి. ఇంటర్వ్యూ సమయంలో మొబైల్ ఫోన్‌ను సైలెంట్ మోడ్‌లో ఉంచుకోవాలి.
We will be holding the biggest ever mega job mela in the state in Huzurnagar on Saturday, 25 October. We are expecting approximately 200 companies/ employers and over 12-13,000 unemployed youth to participate in the job mela.
Myself, District Collector, SP and Commissioner of… pic.twitter.com/GqtcrOUzwX
— Uttam Kumar Reddy (@UttamINC) October 21, 2025