Bigg Boss 9 Promo: తెలుగు బిగ్ బాస్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ఎప్పటికప్పుడు వినూత్నమైన వ్యక్తులు, టాస్కులతో ఆడియన్స్ ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా 44వ రోజుకు సంబంధించిన మొదటి ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. అందులో తనూజ (Thanuja ), ఇమ్మానుయేల్ (Emmanuel)మధ్య గొడవలే కాదు అమ్మ అని పిలుస్తున్న మాధురికి కూడా తనూజ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అసలు ఏం జరిగింది? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
నామినేషన్స్ లో భాగంగా కళ్యాణ్ తన వద్ద పాయింట్స్ ఉన్నాయని ఇమ్మానియేల్ తో చెప్పాడు. మళ్ళీ నన్ను నామినేట్ చేయలేదని తెలిసి ఇమ్మానియేల్ లేచి మరీ కళ్యాణ్ తో గొడవ పెట్టుకున్నాడు. అసలు అక్కడ ఏం జరుగుతోంది అనే విషయం కూడా నాకు అర్థం కాలేదు అంటూ దివ్య నిఖిత (Divya Nikita)తో తనూజ(Thanuja ) చెబుతుండగా.. వెనకాల నుంచి ఇమ్మానుయేల్ వచ్చి.. మాట్లాడడానికి ప్రయత్నం చేసినా.. లేదురా నాకు నీతో మాట్లాడటం ఇష్టం లేదు అంటూ తెలిపింది. ఇమ్మానుయేల్ మాట్లాడుతూ.. కళ్యాణ్ అనేవాడు నా దగ్గరకు వచ్చి తనూజను నామినేట్ చేయడానికి నా దగ్గర పాయింట్స్ ఉన్నాయని చెప్పాడు. అని చెబుతుండగానే తనూజ వచ్చి అది కూడా ఒకరికి కాదు ఇద్దరికీ అంటూ తెలిపింది.. ఇక ఇద్దరూ గొడవపడుతూ.. సేఫ్ గేమ్ ఆడుతున్నారు అని అనిపిస్తోంది అంటూ ఒకరికొకరు వాదించుకున్నారు. అటు ఇమ్మానుయేల్ రమ్యకి తనుజ గురించి కామెంట్ పాయింట్స్ ఉన్నాయి.. తనుజ దగ్గర రమ్యకి పాయింట్స్ ఉన్నాయి. వాళ్ల వాళ్లకి ఇచ్చేస్తే వాళ్ళు చూసుకుంటారు కదా మధ్యలో నాకెందుకు అని చెప్పగా.. ఇది నీ అసలు రంగు అంటూ తనూజ ఫైర్ అయిపోయింది. అలా ఇద్దరి మధ్య కూడా గొడవలు తారస్థాయికి చేరుకున్నాయి.
ఇక తర్వాత ఫైర్ లో ఉన్న తనుజా దగ్గరికి దివ్వెల మాధురి ప్లేట్ తీసుకొని వచ్చి తినమని బ్రతిమలాడింది. దీంతో తనూజ బాధలో కోపం వ్యక్తం చేస్తూ.. ఈమె వల్లే వెళ్లే ఆయన వెళ్లిపోయారు అని కామెంట్లు చేస్తున్నారు. నువ్వేమో మళ్ళీ వచ్చి నా దగ్గరే కూర్చున్నావు. పాంపర్ చేయడానికి, తినిపించడానికి , పట్టించుకోవడానికి అనేసి.. పక్కనుంచి వెళ్ళమ్మా అని తోసినా కూడా నువ్వు ఇక్కడే కూర్చుంటున్నావు. అని చెబుతుండగా.. ఎవరన్నారు అని దివ్వెల మాధురి అడిగింది.. దానికి తనూజ వద్దమ్మా తల్లి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో.. నాకు ఎవరి కేరింగ్ అవసరం లేదు.. ఎవరి సపోర్ట్ అవసరం లేదు.. నేను ఒంటరిగానే ఉంటాను.. వద్దమ్మ తల్లి నన్ను వదిలేయి. నన్ను పట్టించుకోకు. అంటూ రమ్య మాటలను గుర్తు చేసుకొని మరీ ఎమోషనల్ అయింది తనూజ.
ఇక నువ్వు అరిస్తే అయిపోదు అంటూ మాధురి చెబుతుండగానే.. ఎవరైనా వచ్చి నాతో మాట్లాడిన ప్రాబ్లమే.. నన్ను పట్టించుకున్నా ప్రాబ్లమే.. ఎవరైనా వచ్చి నాపై ప్రేమ చూపించిన ప్రాబ్లమే అంటూ తన బాధను వ్యక్తపరిచింది తనూజ. ఇది చూసిన నెటిజన్స్ తనూజ ఆవేదనలో అర్థం ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు.
also read:Emmanuel vs Thanuja: ఇది సార్ మీ అసలు రంగు.. ఇప్పటివరకు మీరు చేసిందంతా నాటకం
#Tanuja vs #Emmanuel 👁🔥
From friends to foes! whose side are you on? ⚡🏡Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar#BiggBossTelugu9 #StreamingNow #StarMaaPromo pic.twitter.com/lbzA0X5JJb
— Starmaa (@StarMaa) October 21, 2025
To all Haters
Evaru antunnaroo nanna poyi mummy vacchindi aniSlipper shot to them
Madhuri ne venaka tirugutundhi #Thanuja#biggbossTelugu9 pic.twitter.com/hJSQjNdske— Dhana karanam (@imdhana_karanam) October 20, 2025