E-Paper
Advertisement

ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?

ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?
Advertisement

Comedian Ali Injured: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు అలీ(Ali) ఒకరు. కొన్ని వందల సినిమాలలో తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన అలీ ఇటీవల కాలంలో సినిమాలను కాస్త తగ్గించారని చెప్పాలి. కేవలం కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో మాత్రమే ఈయన నటిస్తున్నారు. ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో అలీకి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా ఈయన కాలికి గాయమైనట్టు తెలుస్తోంది.

ప్రమాదానికి గురైన అలీ…

అలీ ఎడమ కాలికి గాయం కావడంతో పెద్ద ఎత్తున బ్యాండేజ్ తో కట్టు కట్టినటువంటి ఈ వీడియో చూసిన అభిమానులు అసలు అలీకి ఏమైంది? ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఏదైనా సినిమా షూటింగ్లో గాయపడ్డారా? లేదంటే నిజంగానే ఏదైనా ప్రమాదం జరిగిందా? అంటూ ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సందేహాలు అన్నింటికి అలీ భార్య జుబేదా(Zubeda) ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అలీ కాలికి నిజంగా గాయం కాలేదని ఒక సినిమా షూటింగ్లో భాగంగా ఇలా నటిస్తున్నారు అంటూ ఈమె క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.

అలీకి కాలు విరిచేసి లంచ్ పెట్టిన యూనిట్ ..

Advertisement

అలీ ప్రస్తుతం దాదీకి షాదీ అనే సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమా షూటింగ్లో భాగంగా ఆయన పాత్రకు సంబంధించి ఒక కీలక ఎపిసోడ్ షూట్ చేస్తున్నారని, అయితే షూటింగ్ టైంలో భాగంగా ఆలీ భార్య జుబేదా వీడియోని తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఈ వీడియో చూసిన అభిమానులు ఒక క్షణం అలీ నిజంగానే ప్రమాదానికి గురయ్యారా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వీడియోను చిత్ర యూనిట్ అలీ కోసం ఏర్పాటు చేసిన సమయంలో చిత్రీకరిస్తూ అలికి కాలు విరిచేసి లంచ్ పెట్టిన యూనిట్ అంటూ సరదాగా చెప్పుకు వచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

?igsi=ajQ2M2tueGozY2s%3D

Advertisement

ఇకపోతే అలీ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలకు హోస్ట్ గా కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కుక్ విత్ జాతి రత్నాలు(Cook with Jathiratnalu) అనే షోలో పాల్గొని సందడి చేశారు. ఇలా బుల్లితెర కార్యక్రమాలతో పాటు ఈయన తన భార్య జుబేదాతో కలిసి కూడా యూట్యూబ్ వీడియోలలో కనిపిస్తూ సందడి చేస్తున్నారు. ఇక ఆలీ భార్య జుబేదా పెద్ద ఎత్తున యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఫేమస్ అయ్యారు. ఈమె నిత్యం వంటలకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ వచ్చారు. యూట్యూబ్ ,ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న జుబేదా క్లాత్ బిజినెస్ లోకి కూడా అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.

Also Read: యశ్ ‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్కడైనా సక్సెస్ అయ్యేనా?

Related News

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

యశ్ ‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్కడైనా సక్సెస్ అయ్యేనా?

అరుదైన ఘనత సాధించిన రష్మిక మందన్న!

అన్నపూర్ణ స్టూడియోస్ పై అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్!

రామాయణంలోకి అమీర్ ఖాన్ కూతురు.. ఆ 5 నిమిషాలే కీలకమట!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఆ రూమర్స్ కు చెక్..

మమిత బైజుకు ఏమైంది..? సినిమాలకు గుడ్ బై..?

Big Stories

Advertisement
×