E-Paper
Advertisement

శాంసంగ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఆ పాపులర్ ఫోన్ల ధరలు విపరీతంగా పెంపు!

శాంసంగ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఆ పాపులర్ ఫోన్ల ధరలు విపరీతంగా పెంపు!
Advertisement

Samsung Price Hike: త్వరలో కొత్త ఫోన్ కొందామని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకొక బ్యాడ్ న్యూస్. ప్రముఖ మొబైల్ బ్రాండ్ శాంసంగ్ తమ పాపులర్ మోడళ్ల ధరలను భారీగా పెంచేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో సతమతమవుతున్న సామాన్యులకు ఇది నిజంగా పెద్ద షాకే. ఇటీవల మార్కెట్‌లో మెమరీ చిప్స్, ఇతర విడిభాగాల తయారీ ఖర్చులు విపరీతంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని టెక్ వర్గాలు చెబుతున్నాయి. లీకైన సమాచారం ప్రకారం ఈ కొత్త ధరలు సెప్టెంబర్ 2 నుంచే అమల్లోకి వచ్చినట్లు టాక్.

ఏయే మోడళ్ల ధరలు పెరిగాయంటే?

శాంసంగ్ బడ్జెట్, మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో మంచి డిమాండ్ ఉన్న Galaxy A17, Galaxy A27, Galaxy F17, ఏ07 5G మోడళ్లపై ఈ ధరల పెంపు ప్రభావం పడింది. మోడల్, వేరియంట్‌ను బట్టి కొన్నింటిపై రూ.1,000 నుంచి మరికొన్నింటిపై ఏకంగా రూ.10,000 వరకు ధర పెరిగినట్లు లీకైన లీక్డ్ డాక్యుమెంట్స్ ద్వారా తెలుస్తోంది.

Advertisement

Also Read: లెనోవో నుంచి కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్.. 165Hz స్క్రీన్, RTX 3050తో అదరగొట్టే ఫీచర్లు!

గెలాక్సీ A17 పైనే భారీ ప్రభావం:

తాజాగా లీకైన జాబితాలో అత్యధికంగా పెరిగిన ఫోన్ Galaxy A17. ట్రేడ్‌ఇన్ ఆఫర్లతో లభించే ఈ ఫోన్ వేరియంట్లపై దాదాపు రూ.10,000 కంటే ఎక్కువే పెరిగినట్లు సమాచారం. సాధారణ వేరియంట్ల విషయానికొస్తే.. 6GB RAM వెర్షన్ ధర రూ.24,499 నుండి రూ.27,999కి, అలాగే 8GB RAM మోడళ్లు వరుసగా రూ.30,999, రూ.36,499కి చేరినట్లు తెలుస్తోంది.

A27, F17, A07 5G కొత్త ధరలు:

Advertisement

మిగతా మోడళ్లలో Galaxy A27పై దాదాపు రూ.2,000 నుంచి రూ.5,000 వరకు పెంపు కనిపిస్తోంది. ఇక Galaxy F17 మోడల్ అన్ని వేరియంట్లపై సమానంగా రూ.3,500 పెరగ్గా.. ఎంట్రీ లెవెల్ 5G ఫోన్ అయిన Galaxy A07 5Gపై రూ.1,000 నుండి రూ.2,000 వరకు ధరలు పెరిగాయి. దీంతో బడ్జెట్ ఫోన్ కొందామనుకునే వారికి కాస్త భారం తప్పదు.

కంపెనీ నుంచి స్పష్టత రాలేదు:

అయితే ఈ ధరల పెంపు వార్తలపై శాంసంగ్ కంపెనీ ఇంకా అధికారికంగా స్పందించలేదు. శాంం‌సంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో గానీ, ఈ-కామర్స్ స్టోర్లలో గానీ ఇప్పటివరకు పాత ధరలే కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు ఈ ఫోన్లలో ఏదో ఒకటి కొనాలని ప్లాన్ చేస్తుంటే మాత్రం.. ధరలు పూర్తిగా మారకముందే పాత ధరలకే సొంతం చేసుకోవడం మంచిది.

Also Read: iPhone 18 Proలో బ్లాక్ కలర్ ఉండదా? తాజా లీక్‌తో యాపిల్ ప్రియుల్లో పెరిగిన టెన్షన్!

Tags

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×