Madhavi Latha: ఇటీవల కాలంలో ఎంతోమంది సెలబ్రిటీలు నిర్మొహమాటంగా మాట్లాడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున వివాదంలో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న నటుడు శివాజీ హీరోయిన్ల వస్త్రధారణ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపాయి. ఇప్పటికీ ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇక ఈ వివాదం సర్దుమనగకముందే సినీ నటి మాధవి లత(Madhavi Latha) పట్ల కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. మాధవి లత హీరోయిన్గా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు అయితే ఈమె ఇండస్ట్రీలో అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారు.
ఇలా సినిమాలలో సక్సెస్ రాని నేపథ్యంలో మాధవి లత రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఈమె బీజేపీ పార్టీకి మద్దతు తెలియజేస్తూ రాజకీయాలలో కొనసాగుతున్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటున్న మాధవి లత సినిమాలకు సంబంధించి,సెలబ్రిటీలకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతూ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఏ విషయం అయినా నిర్మొహమాటంగా ముక్కుసూటిగా మాట్లాడటంతో ఈమె తరుచు వార్తలు నిలుస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో మాధవి లత సాయిబాబా(Sai Baba) గురించి దుష్ప్రచారం చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తూ వచ్చారు.
షిరిడి సాయిబాబా హిందూ దేవుడు కాదని వాదన మాధవి లత చేశారు. ఈ నేపథ్యంలోనే సాయిబాబా గురించి పలు వివాదాసుల పోస్టులు చేయడంతో సాయిబాబా భక్తులు ఈ విషయంపై పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాధవి లత పై కేసు నమోదు చేశారు. సాయిబాబా పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్న యాక్ట్రెస్ మాధవీలతతో పాటు పలువురు యూట్యూబర్లపై సరూర్ నగర్ పీఎస్ లో కేస్ నమోదు చేశారు.మంగళవారం ఉదయం 10గంటలకు సరూర్ నగర్ స్టేషన్ రావాలని పోలీసులు సమాచారం అందజేశారు.సాయి బాబా దేవుడు కాదు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు నటి మాధవీలత పోస్టులు చేయడంతో ఇది కాస్త వివాదాస్పదంగా మారింది.
సినీ నటి మాధవీలతపై కేసు నమోదు
రేపు ఉదయం 10 గంటలకు హాజరు కావాలని సరూర్ నగర్ పోలీసుల పిలుపు
సాయిబాబాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్న మాధవీలతతో పాటు పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు pic.twitter.com/VeXcOQptQ1
— BIG TV Breaking News (@bigtvtelugu) December 29, 2025
వీళ్లు పెట్టిన పోస్టుల వల్ల సాయిబాబా భక్తుల మనోభావాలు భావోద్వేగాలు దెబ్బతినడంతో మాధవీలతతో పాటు పలువురు సోషల్ మీడియా ఇన్‌ప్లుయెన్సర్స్, యూట్యూబర్స్ పై ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేశారు. మరి ఈ విషయంపై నటి మాధవి లత స్పందన ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇటీవల ఈమె సమంత రెండో పెళ్లి గురించి, అలాగే నటుడు శివాజీ వివాదం గురించి కూడా స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా వీడియోలను షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరోసారి సాయిబాబా వివాదంలో ఈమె చిక్కుకోవడం గమనార్హం.
Also Read: Naga Vamsi: అన్నిట్లో వేలు పెట్టొద్దు…త్రివిక్రమ్ ఇచ్చిన సలహా ఇదే..