E-Paper
Advertisement

Minister Ram Prasad Reddy: చంద్రబాబు ముందు కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్.. రాయచోటి ప్రజలకు క్షమాపణలు

Minister Ram Prasad Reddy: చంద్రబాబు ముందు కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్.. రాయచోటి ప్రజలకు క్షమాపణలు
Advertisement

Minster Ram Prasad Reddy: ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటి మార్పుపై ఆయన ఆవేదన చెందారు. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకు మార్చారు. దీంతో మంత్రి రాంప్రసాద్‌ కన్నీళ్లు పెట్టుకోవడంతో.. సీఎం చంద్రబాబు ఆయనను ఓదార్చారు. జిల్లా కేంద్రం మార్చకపోతే వచ్చే సాంకేతికపరమైన ఇబ్బందులను మంత్రికి వివరించారు. రాయచోటి అభివృద్ధి విషయాన్ని తాను చూసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాంప్రసాద్‌ రెడ్డి ప్రస్తుతం రాయచోటి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.

నాకు చాలా బాధగా ఉంది

“కళ్ల ముందే కడప జిల్లాను 3 ముక్కలు చేయడం చాలా బాధగా ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల కేబినెట్ లో అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటికి బదులుగా మదనపల్లెను చేశారు. గెజిట్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి రాయచోటి ప్రజల మనోభావాలను కేబినెట్ ఉపసంఘానికి, సీఎం చంద్రబాబుకు తెలియజేశాను. కోడూరు నియోజకవర్గం ప్రజలు తిరుపతి జిల్లాలో కలపాలని కోరారు. రాజంపేట నియోజకవర్గం వాళ్లు కడప జిల్లాలో కలపాలని కోరడం… నాకు బాధ కలిగించింది.

Advertisement

కేబినెట్ తర్వాత కూడా సీఎం చంద్రబాబు పిలిపించినప్పుడు కూడా.. ఇదే చెప్పాను. రాయచోటి ప్రజల అభీష్టం మేరకు.. జిల్లా కేంద్రాన్ని తరలించొద్దని కోరాను. కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. కొన్ని అనివార్య కారణాలు, నియోజకవర్గాల ప్రజల సూచనలు, ఇతర సాంకేతిక కారణాలతో అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చారు. నాకు బాధాకరంగా ఉంది. రాయచోటిపై సీఎంకు చిత్తశుద్ధి ఉంది. అందుకే మొదటిసారి ఎమ్మెల్యే అయిన రాంప్రసాద్ రెడ్డికి కేబినెట్ స్థానం కల్పించారు. మేం బాధలో ఉంటే కొంత మంది వక్రీకరిస్తున్నారు” –మంత్రి రాంప్రసాద్ రెడ్డి 

రాయచోటి ప్రజలకు క్షమాపణలు

Advertisement

“జగన్ మోహాన్ రెడ్డి జిల్లాల విభజన చేసినప్పుడు ఇతర జిల్లాల ప్రజలు ఇదే తరహాలో ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో ఇలాగా ప్రచారం చేశారా? అని వక్రీకరిస్తున్న మీడియాలను ప్రశ్నిస్తున్నాను. ఒకరు బాధలో ఉంటే ఓదార్చకుండా.. జటిలం చేయాలని చేస్తున్నారు. నాకు మంత్రి పదవి కంటే రాయచోటి నియోజకవర్గమే ముఖ్యం. నా తండ్రి, సోదరుడిని రెండేసి పర్యాయాలు ఎమ్మెల్యేలుగా గెలిపించిన నియోజకవర్గం. 30 ఏళ్ల తర్వాత కూడా రాయచోటిలో టీడీపీ గెలిపించారు. ఇంకా నాకు ఆశ ఉంది. రాయచోటి ప్రజలకు క్షమాపణలు చెబుతున్నాను. ఎప్పటికీ నియోజకవర్గ ప్రజలకు వెన్నంటే ఉంటాను”- మంత్రి రాంప్రసాద్ రెడ్డి 

Also Read: AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Related News

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Big Stories

Advertisement
×