E-Paper
Advertisement

Coolie Collections : బాక్సాఫీస్ వద్ద ‘కూలీ ‘ జోరు.. ఫస్ట్ డే ఎన్ని కోట్లంటే..?

Coolie Collections : బాక్సాఫీస్ వద్ద ‘కూలీ ‘ జోరు.. ఫస్ట్ డే ఎన్ని కోట్లంటే..?
Advertisement

Coolie Collections :  సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, కింగ్ నాగార్జున నెగెటీవ్ రోల్ చేసిన సినిమా కూలీ. ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా ఆడియన్స్ ను అలరించడానికి వచ్చేసింది.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రజినీకాంత్ నుంచి వచ్చిన మరో యాక్షన్ మూవీ కూలీ. కింగ్ అక్కినేని నాగార్జున నెగిటివ్ రోల్‌ చేసిన ఈసినిమాలో శృతి హాసన్, సత్య రాజ్, బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్, కన్నడ స్టార్ ఉపేంద్ర, మలయాళ స్టార్ యాక్టర్ సౌబిన్ షాహిర్ వంటి స్టార్స్ ఉండటంతో ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతానికైతే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లు ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

‘కూలీ’ ఫస్ట్ డే కలెక్షన్స్.. 

Advertisement

కూలీ మూవీ పై ఇటు తెలుగులోనూ అటు కోలీవుడ్ లోనూ మంచి అంచనాలే క్రియేట్ అయ్యాయి.. ఎట్టకేలకు ఇవాళ థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా మొదటి షో తోనే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.. మొదటి బొమ్మ థియేటర్లలో పడగానే పాజిటివ్ టాక్ తో దద్దరిల్లిపోయాయి.. రజనీ సినిమా అంతా వన్ మ్యాన్ షో చేశాడని చెపుతూనే… సైమన్ పాత్రలో నాగార్జున విలన్‌గా గూస్ బంప్స్ తెప్పించాడు, గెస్ట్ రోల్ లో అమీర్ ఖాన్ అదరగొట్టాడు. అనిరుధ్ బీజీఎం మామూలుగా లేదు.. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ అయితే చెప్పడానికి రావడంలేదు. మొత్తానికి సినిమా మంచి టాక్ అయితే సొంతం చేస్తుంది. మొదటి రోజు కళ్లు చెదిరే కలెక్షన్స్ వచ్చాయని తెలుస్తుంది. వరల్డ్ వైడ్ గా ఈ మూవీకి 68 కోట్లు వచ్చినట్లు తెలుస్తుంది. మొదటిరోజు ఇంత వసూలు రాబట్టడం మామూలు విషయం కాదు.. ఇక ఈ వీకెండు ఈ సినిమాకు కాసులు వర్షం కురిసే అవకాశం.. ఈ వీకెండ్ లోనే 200 కోట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుందిఅవకాశం ఉన్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది..

Also Read :‘ఓజీ ‘ పార్ట్ 2 ఉందా..? సుజిత్ ను నమ్మొచ్చా..?

Advertisement

కూలీ బడ్జెట్& బ్రేక్ ఈవెన్.. 

రజినీ కాంత్ నటించిన కూలీకి తెలుగులో మంచి డిమాండ్ ఉంది. ఈ చిత్రం చూసిన వారు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మొదటి సారి విలన్ రోల్‌లో నాగార్జున అదరగొట్టాడని అంటున్నారు. అమిర్ ఖాన్ గెస్ట్ రోల్ బాగుందని చెబుతున్నారు. అనిరుద్ బీజీఎం నెక్ట్స్ లెవెల్ అని అంటున్నారు. రజినీకాంత్ నటన అదిరిపోయిందని రెస్పాన్స్ వస్తుంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈసినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ఎంతగానో వెయిట్ చేశారు. తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా వైడ్‌గా థియేటర్స్‌లో సందడి మొదలు పెట్టింది కూలీ.. దాదాపు 350 కోట్లతో తెరకెక్కిందని చెబుతున్నారు.. 600 కోట్లు కచ్చితంగా రాబడుతుందని రజిని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ మూవీ ఏ రేంజ్ లో కలెక్షన్లను కురిపిస్తుందో చూడాలి…

Related News

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

Big Stories

Advertisement
×