OG Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈమధ్య నటించిన లేటెస్ట్ చిత్రం హరిహర వీరమల్లు.. డిప్యూటీ సీఎం అయిన తర్వాత వచ్చిన మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.. అయితే ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రాలేదు.. సినిమా టాక్ కూడా యావరేజ్ గా ఉండడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ మూవీ తర్వాత ఓజీ సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు.. భారీ యాక్షన్ సీక్వెన్స్ గా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఈ మూవీ కచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని అటు పవన్ అభిమానులతో పాటు సినీ అభిమానులు కూడా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.. అయితే ఈ సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు కానీ ఈ మూవీ రెండు పార్ట్ లుగా రాబోతుందని ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.
‘ఓజీ 2’ ఉందా..?
టాలీవుడ్ నుంచి భారీ హైప్ ఉన్న బిగ్గెస్ట్ చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగ్ దర్శకుడు సుజిత్ కలయికలో చేస్తున్న సాలిడ్ చిత్రం ‘ఓజి’ కూడా ఒకటి.. ఈ మూవీ రెండు పార్ట్ లుగా రాబోతుందంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ విషయంపై ఓజీ టీం క్లారిటీ ఇవ్వలేదు కానీ ఇప్పుడు మరో వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. ఓజి పార్ట్ 2 డెఫినెట్ గా ఉంటుందట. అయితే నాచురల్ స్టార్ నాని సుజిత్ ప్రాజెక్ట్ పూర్తయ్యాక ఉంటుంది అని తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.. ఈ మూవీకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.
Also Read : శ్రీవల్లి బండారం బయటపెట్టబోతున్న నర్మద.. ధీరజ్ కు షాక్.. నగల గుట్టు బయట పడుతుందా..?
పవన్ కళ్యాణ్ సినిమాలు..
పవన్ కళ్యాణ్ ఒక వైపు సినిమాలు మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉంటున్న విషయం తెలిసిందే. ఏపీ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన ఈయన.. గత కొన్నినెలలుగా రాజకీయాల్లో బిజీగా ఉంటున్నాడు. ఇది వలె ఆయన గతంలో ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేశాడు. ఈ మధ్య రిలీజ్ అయిన హరిహర వీరమల్లు సినిమా యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇప్పుడు అందరు దృష్టి ఓజీ పైనే ఉంది. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి బయటికి వచ్చిన అప్డేట్స్ అన్ని ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరి సినిమా ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ హరిష్ శంకర్ కాంబినేషన్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తున్నారు.. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది.. ఓజీ రిలీజ్ అయిన కొద్ది నెలల్లోనే విడుదల కాబోతుందని టాక్..