CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో 79వ స్వాతంత్య్ర దినోత్సవాలు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా జరిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సైనిక గౌరవ స్వీకరణలో పాల్గొన్నారు. ఆయన రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర దిన శుభాకాంక్షలు తెలిపి, ఎన్‌డీఏ ప్రభుత్వ విజయాలు, రాష్ట్ర అభివృద్ధి పథకాలను వివరిస్తూ ప్రసంగించారు. సీఎం ఈ సందర్భంగా ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తారు. వేడుకలకు విద్యార్థులు, అధికారులు, ప్రజలు హాజరవుతారు. రాజ్‌భవన్‌లో సాయంత్రం ‘ఎట్ హోమ్’ కార్యక్రమం జరుగుతుంది.
Also Read: లారీని ఢీ కొన్న బస్సు .. స్పాట్‌లో కూకట్‌పల్లి వాసులు..
అలాగే ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఉన్నతాధికారులు పాల్గోన్నారు. ఈ వేడుకల్లో వాహనంపై నుంచి అందరికీ అభివాదం చేస్తూ స్టేడియంలో తిరిగారు. అంతేకాకుండా ఈ వేడుకల్లో వివిధ ప్రదర్శనలు ఆకట్లుకున్నాయి.