E-Paper
Advertisement

Pelli Cheskundham : మళ్లీ పెళ్లి చేసుకుందాం అంటున్న వెంకీ మావా.. మూహుర్తం డిసెంబర్ 13

Pelli Cheskundham : మళ్లీ పెళ్లి చేసుకుందాం అంటున్న వెంకీ మావా.. మూహుర్తం డిసెంబర్ 13
Advertisement

Pelli Cheskundham Re Release : వెక్టరీ వెంకటేష్ మళ్లీ పెళ్లి చేసుకుందాం అని అంటున్నారా..? ఇది నిజమేనా అని ఆలోచిస్తున్నారా… అవును అండి ఇది నిజమే. విక్టరీ వెంకటేష్ మళ్లీ ‘పెళ్లి చేసుకుందాం’ అని అంటున్నారు. అయితే నిజంగా పెళ్లి చేసుకోవడం కాదు… ఆయన నటించిన ‘పెళ్లి చేసుకుందాం’ మూవీని రీ రిలీజ్ చేయబోతున్నారు.

విక్టరీ వెంకటేష్ హీరోగా చేసిన అన్ని సినిమాల్లో అసాధారణ విజయం సాధించింన లిస్ట్‌లో ‘పెళ్ళి చేసుకుందాం’ మూవీ ముందు వరుసలో ఉంటుంది. ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య తెరకెక్కించిన ఆ సినిమా అప్పట్లో ట్రెండ్ సెట్ చేసింది. అలాగే అందం – అభినయాల కలబోతగా ఉన్న సౌందర్య ఈ సినిమాలో హీరోయిన్ గా ఉండటం మరో ప్లస్ పాయింట్. ఇప్పుడు ఎప్పుడూ వార్తల్లో ఉండే పోసాని కృష్ణ మురళి ఈ సినిమాకు డైలాగ్స్ ఇవ్వగా, సి.వెంకట్రాజు – శివరాజు సంయుక్తంగా ఈ ‘పెళ్లి చేసుకుందాం’ సినిమాను నిర్మించారు. పోసాని కృష్ణమురళి సంభాషణలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ.

Advertisement

1997 అక్టోబర్ 9న రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో మంచి హిట్ గా నిలిచింది. విక్టరీ వెంకటేష్‌ కెరీర్‌లో గుర్తిండిపోయే సినిమాలా నిలిచిపోయింది. అలాంటి సినిమాను ఇప్పుడు మళ్లీ థియేటర్స్‌కు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాను సాయిలక్ష్మీ ఫిలిమ్స్ పతాకంపై వరప్రసాద్ రెండు తెలుగు రాష్ట్రాల్లో 4K లో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. విక్టరీ వెంకటేష్ జన్మదిన సందర్భంగా డిసెంబర్ 13న
ట్రెండ్ సెట్టింగ్ బ్లాక్ బస్టర్ “పెళ్ళి చేసుకుందాం” రీ-రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు అన్నీ చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో తెలుగులో 300 కోట్ల క్లబ్‌లో చేరి చరిత్ర సృష్టించిన వెంకటేష్ నటించిన ఆణిముత్యాల్లో ఒకటైన “పెళ్ళి చేసుకుందాం” చిత్రాన్ని 4 కె రిజల్యూషన్ లో డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు ఫ్రెష్ గా తీసుకువచ్చే అవకాశం లభించడం గర్వంగా ఉంది. మన రెండు రాష్ట్రాల్లో ఉన్న విక్టరీ ఫ్యాన్స్ తోపాటు… సిసలైన సినీ ప్రేమికులంతా “పెళ్ళి చేసుకుందాం” చిత్రాన్ని ఆదరిస్తారనే నమ్మకం ఉంది” అని అన్నారు.

Related News

ఇరుముడి సినిమాకు భారీ షాక్…ప్రొజెక్టర్ ద్వారా వీధుల్లో ప్రదర్శనలు!

భార్యను కలవబోతున్న సీఎం విజయ్…త్రిష సైడ్ అవ్వాల్సిందేనా?

రజినీ జైలర్ 2 కథ ఇదేనా? ఈసారి టార్గెట్ ఎవరో తెలిస్తే షాక్!

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Big Stories

Advertisement
×