E-Paper
Advertisement

RRB NTPC: నిరుద్యోగులకు శుభవార్త.. 3058 రైల్వే ఎన్టీపీసీ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు

RRB NTPC: నిరుద్యోగులకు శుభవార్త.. 3058 రైల్వే ఎన్టీపీసీ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు
Advertisement

RRB NTPC: భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (అండర్‌గ్రాడ్యుయేట్) పోస్టుల దరఖాస్తు గడువు పొడిగించింది. ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తు స్వీకరణ నవంబర్ 27తో ముగియాల్సి ఉంది. అయితే.. అభ్యర్థుల సౌలభ్యం దృష్ట్యా గడువును డిసెంబర్ 4 వరకు పొడిగించినట్లు ఆర్ఆర్‌బీ అధికారిక ప్రకటనలో తెలిపింది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు 2025 సంవత్సరానికి 3,058 అండర్‌గ్రాడ్యుయేట్ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ పోస్టుల భర్తీకి సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ ను అక్టోబర్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు ఇంటర్మీడియట్ విద్యార్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

పోస్టుల వివరాలు..

కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్: 2,424 పోస్టులు

Advertisement

అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 394 పోస్టులు

జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 163 పోస్టులు

ట్రైన్స్ క్లర్క్: 77 పోస్టులు

మొత్తం 3,058 అండర్‌గ్రాడ్యుయేట్ కేటగిరీ పోస్టులు భర్తీ కానున్నాయి. అభ్యర్థుల వయోపరిమితి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వం నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు కూడా ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: 

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ బహుళ దశల్లో ఉంటుంది. ప్రతిభ, పరీక్షా ఫలితాల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

స్టేజ్ 1 కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT-1): ప్రాథమిక పరీక్ష.

స్టేజ్ 2 కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT-2): ప్రధాన పరీక్ష.

కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ టెస్ట్: అవసరమైన పోస్టులకు టైపింగ్ నైపుణ్యాన్ని పరీక్షించడానికి ఈ పరీక్ష నిర్వహిస్తారు.

సర్టిఫికెట్ వెరిఫికేషన్: అర్హత ప్రమాణాలను ధ్రువీకరించడానికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.

మెడికల్ ఎగ్జామినేషన్: అభ్యర్థులు శారీరకంగా, వైద్యపరంగా ఫిట్‌గా ఉన్నారని నిర్ధారించుకోవడానికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

దరఖాస్తు గడువు పొడిగించినందున, అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 4లోగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని ఆర్ఆర్‌బీ సూచించింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ పరిశీలించవచ్చు.

ALSO READ: Winter Skin Care: చలికాలంలో చర్మం రంగు మారుతుందా ? ఈ టిప్స్‌ పాటిస్తే ప్రాబ్లమ్ సాల్వ్

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×