E-Paper
Advertisement

Viral News: పాము కాటేసిందని వేలు కట్ చేసుకున్నాడు.. డాక్టర్ చెప్పింది విని బుర్ర బాదుకున్నాడు!

Viral News: పాము కాటేసిందని వేలు కట్ చేసుకున్నాడు.. డాక్టర్ చెప్పింది విని బుర్ర బాదుకున్నాడు!
Advertisement

చైనాకు చెందిన జాంగ్ అనే 60 వేళ్ల వ్యక్తి అడవిలో ఒంటరిగా కట్టెలు నరుకుతున్నాడు. అకస్మాత్తుగా తన చేతికి ఏమో కరిచినట్టు అనిపించింది. కాసేపట్లోనే తీవ్రమైన నొప్పి ఏర్పడింది. అటు ఇటు చూసే సరికి ఓ పాము అక్కడి నుంచి వెళ్లిపోతున్నట్లు కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసి భయంతో వణికిపోయాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. పాము విషం శరీరంలోకి పాకకూడదనుకున్నాడు. ఒకవేళ అలా పాకితే చనిపోతానని భయపడ్డాడు. వెంటనే తన కత్తితో.. పాము కాటు వేసిన వేలును కట్ చేస్తాడు. వెంటనే చేయి అంతా రక్తంతో నిండిపోయి ఉంటుంది. వెంటనే తన తగ్గర ఉన్న రుమాలును చేతికు చుట్టుకుని, మోటార్ సైకిల్ ఎక్కి సుమారు 80 కిలో మీటర్ల దూరం ఉన్న హాస్పిటల్ కు వెళ్తాడు. అక్కడి సిబ్బందికి జరిగిన విషయం చెప్తాడు.

డాక్టర్లు అతడిని పరిశీలించి ఏం చెప్పారంటే? 

అతడిని పరీక్షించిన డాక్టర్లు ఒకటే మాట చెప్పారు. “మీరు వేలిని నరకాల్సిన అవసరం లేదు. పాము కాటు వేసిన వెంటనే హాస్పిటల్ కు వస్తే సరిపోతుంది. ఇలా వేలిని నరికి రక్తాన్ని బయటకు తీసి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు” అని వివరించారు. “పాము విషం ప్రమాదకరమైనది. విషపూరితం కూడా. కానీ, మనిషి చనిపోవడానికి 5 దశలు ఉన్నాయి.  పాము కాటు వేసిన తర్వాత 6 గంటలల లోపు హాస్పిటల్ కు చేరకుని యాంటీ వీనమ్ తీసుకుంటే దాదాపు ఎవరూ చనిపోరు” అని చెప్పారు. డాక్టర్లు చెప్పినట్లుగానే జాంగ్ కు ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ప్రస్తుతం హ్యాపీగా జీవించే ఉన్నాడు.

పాము కాటుకు సంబంధించి అపోహలు

Advertisement

⦿ పాము కాటు వేసినప్పుడు చాలా మంది కాటు వేసిన ప్రాంతంలో కత్తితో కోసి రక్తం బయటకు తీసే ప్రయత్నం చేస్తారు. కానీ, అలా చేయడం వల్ల పెద్ద ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది.

⦿ పాము కాటు వేసిన వెంటనే చేయి, కాలు చుట్టూ గట్టిగా గుడ్డ కడుతారు. అలా చేయడం వల్ల అవయవం నల్లగా అదనపు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

Advertisement

⦿ ప్రజలు నోటితో విషాన్ని పీల్చడానికి ప్రయత్నిస్తారు. అలా చేయడం వల్ల చర్మం దెబ్బతింటుంది.

⦿ కొందరు కాటును నిప్పుతో కాల్చుతారు. అలా చేయడం వల్ల జీవితాంతం మచ్చలు ఉండిపోతాయి.

ఇలాంటి పనులు చేయకూడదంటున్నారు డాక్టర్లు.

పాము కాటేస్తే ఏం చేయాలంటే?  

⦿ వీలైనంత ప్రశాంతంగా ఉండండి. భయాందోళన కారణంగా గుండె వేగంగా కొట్టుకుంటుంది. విషాన్ని వేగంగా వ్యాప్తి చెందేలా చేస్తుంది.

⦿ కాటుకు గురైన చేయి, కాలును గుండె కంటే తక్కువ ఎత్తులో ఉంచాలి.

⦿ ఉంగరాలు, గడియారాలను త్వరగా తీసివేయాలి.

⦿ పాము కాటు వేసి ప్రదేశాన్ని ఎప్పుడూ కత్తితో కోయకూడదు. నోటితో రక్తాన్ని పీల్చకూడదు. గట్టిగా కట్టవద్దు.

⦿ వీలైనంత త్వరగా ఆసుపత్రికి వెళ్లండి. కరిచింది ఏపామో చెప్తే చికిత్స ఈజీగా ఉంటుంది.

Read Also:  ‘అక్కడ’ చింతపండు పెట్టి.. భార్యను చంపేసిన భర్త, ఎక్కడో కాదు మన రాష్ట్రంలోనే!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×