E-Paper
Advertisement

ధనుష్ కర సినిమా సెన్సార్ పూర్తి… రన్ టైం ఎంతంటే?

ధనుష్ కర సినిమా సెన్సార్ పూర్తి… రన్ టైం ఎంతంటే?
Advertisement

Kara Film: ధనుష్ హీరోగా ఇటీవల కాలంలో వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈయన పేరుకే తమిళ హీరో అయినప్పటికీ అక్కడ ఏ స్థాయిలో ఆదరణ ఉందో తెలుగులో కూడా అదే స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో ధనుష్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసిన దర్శక నిర్మాతలు ఏకంగా ఈయనతో స్ట్రైట్ తెలుగు సినిమాలు చేయటానికి కూడా ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సర్, కుబేర వంటి తెలుగు సినిమాలతో మంచి ఆదరణను సొంతం చేసుకున్నారు. మరోవైపు ధనుష్ తమిళంలో నటించిన సినిమాలన్నీ కూడా తెలుగులో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ధనుష్ కర(Kara) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

అంచనాలు పెంచిన ట్రైలర్…

ఈ సినిమా ఏప్రిల్ 30వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేస్తుంది. ఇక తెలుగులో ఈ సినిమాకు భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఇటీవల హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఏప్రిల్ 30వ తేదీ ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నారు.

161నిమిషాల 13 సెకండ్ల నిడివి..

Advertisement

ఈ సినిమా వీక్షించిన సెన్సార్ సభ్యులు సినిమాకు U/A సర్టిఫికెట్ జారీ చేశారు. అదేవిధంగా ఈ సినిమా రన్ టైం కూడా లాక్ చేశారు. ఈ సినిమా మొత్తం 161నిమిషాల 13 సెకండ్ల నిడివితో ప్రసారం కానుంది. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి. ఇక ఈ సినిమాకు విగ్నేష్ రాజా దర్శకత్వం వహించగా వేల్స్ ఫిలిం ఇంట‌ర్నేష‌న‌ల్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇక ఈ సినిమా తెలుగు విడుదల హక్కులను స‌తీష్ సొంతం చేసుకున్నారు.

కారాసామి గా ధనుష్..

Advertisement

ఈ సినిమాలో ధనుష్ సరసన కథానాయికగా మ‌మిత భైజు (Mamitha Baiju)నటించగా కీలక పాత్రల్లో కేఎస్ ర‌వికుమార్ త‌దిత‌రులు న‌టించారు. మరి ఈ సినిమా ఏప్రిల్ 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు వస్తూ ఏ విధమైనటువంటి సక్సెస్ అందుకుంటుందనేది తెలియాల్సి ఉంది. ఇటీవల ధనుష్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన కుబేర సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా తర్వాత ఈయన కర అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రామనాథపురం నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ క్రైమ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇందులో ధనుష్ ‘కారాసామి’ అనే పాత్రలో కనిపించనున్నారు.

Also Read: పాపం చియాన్.. విక్రమ్ రీల్‌ను వాడేసుకుంటున్న జనం, చివరికి కేరళా పోలీసులు కూడా!

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×