E-Paper
Advertisement

పాపం చియాన్.. విక్రమ్ రీల్‌ను వాడేసుకుంటున్న జనం, చివరికి కేరళా పోలీసులు కూడా!

పాపం చియాన్.. విక్రమ్ రీల్‌ను వాడేసుకుంటున్న జనం, చివరికి కేరళా పోలీసులు కూడా!

Actor Vikram: నటుడు విక్రమ్ పరిచయం అవసరం లేని పేరు. సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో విభిన్నమైనటువంటి పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. హీరో విక్రమ్ (Vikram)పేరు వినగానే ప్రయోగాత్మక సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారని చెప్పాలి. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న విక్రమ్ తాజాగా తన అకౌంట్ లో ఫోటోషూట్ కి సంబంధించిన వీడియోని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 60 సంవత్సరాల వయసులో ఉన్న విక్రమ్ పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఈ వీడియో కాస్త వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోని సోషల్ మీడియాలో విపరీతంగా వాడుతూ రీల్స్ చేస్తున్నారు.

డ్రగ్స్ వాడకంపై అవగాహన..

ఇలా విక్రమ్ వీడియోకి సంబంధించిన కొన్ని ఫన్నీ రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏకంగా ఈయన రియల్ వీడియోని కేరళ పోలీసులు (Kerala Police)కూడా ఉపయోగించడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. కేరళ పోలీసులు విక్రమ్ వీడియో ద్వారా డ్రగ్స్ గురించి అవగాహన చేపట్టారు. మీరు ఎక్కడ డ్రగ్స్ తీసుకున్న మా నుంచి తప్పించుకోలేరు అని ధోరణిలో కేరళ పోలీసులు ఈ రీల్ వీడియోని షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.

?igsh=eGVkcm1mMDI1ZHdk

ఇలా కేవలం కేరళ పోలీసులు మాత్రమే కాకుండా డాక్టర్స్ సైతం ఈ రీల్ వీడియోని బీభత్సంగా ఉపయోగిస్తున్నారు. ఎందుకు ఇటువైపు వచ్చారు అంటూ డాక్టర్ అడగగా తిన్నది అరగలేదు అంటూ విక్రమ్ చెప్పినట్టు అయితే ఇంజక్షన్ వేస్తానని డాక్టర్ పిలవగా రానంటూ పేషెంట్ చెప్పినట్టు విక్రమ్ వీడియోని డాక్టర్లు కూడా విపరీతంగా వాడేస్తూ రీల్స్ చేస్తున్నారు.

?igsh=OHNuaHB3cHA5NHZz

ఇక రెస్టారెంట్ లో కూడా విక్రమ్ కస్టమర్ గా రావడంతో బేరర్ ఫుడ్ ఆర్డర్ తీసుకోవడం గురించి, రెస్టారెంట్లో విక్రమ్ భోంచేస్తున్నటువంటి విధంగా క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. చాలా స్టైలిష్ గా విక్రమ్ ఫోటోషూట్ చేసుకొని ఆ ఫోటోలను వీడియోగా షేర్ చేయడంతో జనాలు మాత్రం ఆ రీల్ వీడియోని వారికి నచ్చిన విధంగా ఉపయోగించుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడంతో విక్రమ్ పై ఫన్నీ ట్రోల్స్ వస్తున్నాయి. అయితే ఈ వీడియోలన్నీ చాలా సరదాగా ఉండటం విశేషం.

?igsh=YWYzZG9yY2dhOXV5

ఇకపోతే విక్రమ్ కెరియర్ విషయానికి.. ఇటీవల ఈయన వీర ధీర శూరన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో ఎస్ జె సూర్య కీలక పాత్రలో కనిపించారు. ఇక ఈయన నటించిన ధృవ నచ్చతిరం సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న విక్రమ్ మరోవైపు సోషల్ మీడియా వేదికగా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

Also Read: గూస్ బంప్స్ తెప్పిస్తున్న కల్కి2 టైటిల్.. ప్రభాస్ విశ్వరూపం చూడాల్సిందే?

Related News

హీరో అర్జున్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు.. అల్లుడు ఎవరంటే..?

రామ్ చరణ్ ‘పెద్ది’ చూసిన తర్వాత సెలబ్రిటీల రియాక్షన్ ఇదే!..

ప్రకాష్ రాజ్‌కి బండ్ల గణేష్ ఇచ్చిపడేశాడుగా!.. ఏంటి బాసూ అలా అనేశావ్..

బాబాయ్ రికార్డులకు ఎసరు పెట్టిన అబ్బాయ్.. ప్రీమియర్ ‘షో’ చూపించేశాడు!

మెగాస్టార్‌ను మించిపోయిన రామ్ చరణ్.. అంతగా ‘పెద్ది’తో ఏం చేశాడంటే?

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

Big Stories

×