E-Paper
Advertisement

Ram pothineni: భాగ్యశ్రీ తో లవ్ రూమర్స్.. ట్రోలింగ్స్ పై ఓపెన్ అయిన రామ్..ఏమన్నారంటే?

Ram pothineni: భాగ్యశ్రీ తో లవ్ రూమర్స్.. ట్రోలింగ్స్ పై ఓపెన్ అయిన రామ్..ఏమన్నారంటే?
Advertisement

Ram pothineni: రామ్ పోతినేని ప్రస్తుతం ఆంధ్ర కింగ్ తాలూకా(Andhra King Taluka) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా నవంబర్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. మహేష్ బాబు పి దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) భాగ్యశ్రీ (Bhagya Shri)హీరో హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ పాటలు టీజర్ ట్రైలర్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి. మరొక రెండు రోజులలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

లవ్ రూమర్లను ఖండించిన రామ్..

ఇదిలా ఉండదా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా రామ్ కు సోషల్ మీడియా వేదికగా వచ్చే ట్రోల్స్ గురించి అలాగే భాగ్యశ్రీ తో రిలేషన్ గురించి వస్తున్న వార్తలపై స్పందించారు. ఎప్పుడు లేని విధంగా రామ్ ఈ సినిమాలో ఏకంగా ఒక పాటను కూడా రాసిన సంగతి తెలిసిందే. నువ్వుంటే చాలే అంటూ రాసిన ఈ పాట భారీగా ట్రెండ్ అయింది. అయితే భాగ్యశ్రీని ఊహించుకొని ఈ పాట రాశారని, వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై కూడా రామ్ స్పందిస్తూ అలాంటిదేమీ లేదని.. ఈ పాట రాయటం వల్ల అలాంటి రూమర్స్ బయటకు వచ్చాయని తెలిపారు. ఇక ఈ పాట రాసే సమయానికి ఈ సినిమాలో హీరోయిన్ గా భాగ్యశ్రీని ఎంపిక చేయలేదు అంటూ లవ్ రూమర్లపై క్లారిటీ ఇచ్చారు..

ట్రోల్స్ వల్ల ఎఫెక్ట్ కాలేదు..

Advertisement

ఇక సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ గురించి అలాగే ఫాన్స్ నుంచి వచ్చే ఇబ్బందుల గురించి కూడా రామ్ ఈ సందర్భంగా స్పందించారు.. సోషల్ మీడియాలో తన గురించి ఎన్నో రకాల ట్రోల్స్ వచ్చినా వాటిని తాను పెద్దగా పట్టించుకోలేదని అందువల్లే తానేమి ఎఫెక్ట్ కాలేదని తెలిపారు. ఇక కొన్నిసార్లు ఫ్యాన్స్ నుంచి కూడా ఇబ్బందులు ఎదురవుతుంటాయి అయితే వారు మన పట్ల చూపించే ప్రేమే ఇబ్బందిగా మారుతుందని, అయినా ఆ ఇబ్బందులను ఎదుర్కోవాల్సిందేనని రామ్ తెలిపారు. ఇక ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ఒక అభిమాని నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చిత్ర బృందం రామ్ ఫ్యాన్స్ ని కూడా మీట్ అయ్యారు.

ఫ్యాన్స్ నుంచి ఇబ్బందులు తప్పవు..

Advertisement

ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయని, ఇటీవల ఈ ఈవెంట్లో ఒక అభిమాని చేతికి గాయమైనదని, ఇలా వారు చూపించే అభిమానం వల్లనే ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయని రామ్ క్లారిటీ ఇచ్చారు. స్కంద వంటి డిజాస్టర్ సినిమా తర్వాత ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈ సినిమా రామ్ కు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు ఈ సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా రామ్  పోతినేనికి ఇదొక కం బ్యాక్ సినిమా అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.

Also Read: Manchu Manoj : మంచు మనోజ్ కిడ్నాప్… వీడియో రిలీజ్ చేసిన హీరో ?

Related News

రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. రూ.5 వేల పెన్షన్.. నట్టి కుమార్ ఆఫర్ ఇదే!

సమ్మర్ హీట్‌లో ప్రగ్యా జైస్వాల్ స్పెషల్ ట్రీట్.. నెట్టింట వైరల్!

రైలులో శ్రేయా ఘోషల్‌కు పీరియడ్స్.. నాన్న చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు!

అల్లు అర్జున్ ‘రాకా’ విడుదల ఎప్పుడంటే… ఫ్యాన్స్ కు నిరీక్షణ తప్పదా?

ఇరుముడి తర్వాత ఇలాంటి స్టోరీనా.. రవితేజకి సెట్ అవుతుందా?

RC17 కోసం హాలీవుడ్ దిగ్గజం…సుకుమార్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!

చిరు ‘కాకా’ వాయిదా రూమర్లపై క్లారిటీ .. సంక్రాంతి పోటీకి సై అంటూ!

సౌందర్య మరణంపై స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×