E-Paper
Advertisement

దీపికా పదుకొనే ప్రెగ్నెన్సీ…కీలక నిర్ణయం తీసుకున్న రాకా టీమ్..

దీపికా పదుకొనే ప్రెగ్నెన్సీ…కీలక నిర్ణయం తీసుకున్న రాకా టీమ్..
Advertisement

Deepika Padukone: ఇటీవల కాలంలో సెలెబ్రిటీలందరూ పెద్ద ఎత్తున శుభవార్తలను తెలియజేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీలు అమ్మలుగా ప్రమోట్ అవ్వగా మరి కొంతమంది ప్రెగ్నెన్సీ విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే(Deepika Padukone) సైతం తన రెండో ప్రెగ్నెన్సీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపిక ఇటీవల తన రెండో ప్రెగ్నెన్సీ గురించి సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.

దీపికా ప్రెగ్నెన్సీ..రాకా ఆలస్యమవుతుందా?

పాప పుట్టిన రెండు సంవత్సరాలకి ఈమె గుడ్ న్యూస్ చెప్పడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇలా దీపికా తన ప్రెగ్నెన్సీ ప్రకటించడంతో అల్లు అర్జున్ అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం రాకా. ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఈమె తన ప్రెగ్నెన్సీను ప్రకటించడంతో ప్రెగ్నెన్సీతో దీపిక షూటింగ్లో పాల్గొనడానికి వీలు ఉండదు తద్వారా సినిమా ఆలస్యం అవుతుందా? అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

దీపికా పాత్ర పై షూటింగ్..

Advertisement

ఇలా ఈ సినిమా గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో రాకా చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీపికా పదుకొనే ఇప్పుడే తన ప్రెగ్నెన్సీ ప్రకటించడంతో ఈమెకు బేబీ బంప్ కనిపించేలోగా తన పాత్రకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి చేయాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మొదట దీపికా పదుకొనే పాత్రపై షూటింగ్ జరుపుతున్నట్టు సమాచారం. ఇలా చేయటం వల్ల ఈ సినిమా యధావిధిగా అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు వస్తుంది లేదంటే దీపిక డెలివరీ అయ్యే వరకు ఎదురు చూడటం అంటే సినిమా విడుదల కూడా ఆలస్యం అవుతుందని చెప్పాలి.

2027 డిసెంబర్ లో రాకా..

Advertisement

ఇక ఈ సినిమా మరి కొద్ది నెలలలో షూటింగ్ పూర్తికాబోతుందని సమాచారం. ఇలా షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఎక్కువ సమయం పోస్ట్ ప్రొడక్షన్ పనులకే కేటాయించబోతున్నారని తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నింటిని పూర్తిచేసుకుని ఈ చిత్రాన్ని 2027 డిసెంబర్ లో విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా విడుదలకు సంబంధించిన విషయాన్ని అధికారకంగా ప్రకటించనున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో అల్లు అర్జున్ విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నారని స్పష్టమవుతుంది.ఇక ఈ సినిమాలో దీపికా పదుకొనేతో పాటు, రష్మిక మందన్న కూడా నటించబోతున్నారు. ఈమె నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది.ఈమెతో పాటు మరో నటి మృణాళ్ ఠాకూర్ కూడా ఈ సినిమాలో భాగమవుతున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.

Also Read: విజయ్ విడాకుల కేసు వాయిదా…భారీ భరణం డిమాండ్ చేస్తున్న సంగీత!

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×