Vijay Deverakonda: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు ప్రకటిస్తూ దూసుకుపోతున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్ధన, రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రణబాలి సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాల షూటింగ్లు శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇంతలోనే మరో డైరెక్టర్ తో కొత్త సినిమా ప్రకటించేశారు ఈ హీరో.
నానితో హాయ్ నాన్న సినిమా చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డైరెక్టర్ శౌర్యువ్ తో తన కొత్త సినిమా చేస్తున్నట్లు రెండు రోజుల క్రితం విజయ్ దేవరకొండ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నేడు ఈ సినిమా పూజాకార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నేచురల్ స్టార్ హీరో నాని (Nani) ముఖ్యఅతిథిగా విచ్చేశారు. పూజా కార్యక్రమం అనంతరం విజయ్ దేవరకొండ వద్ద నాని క్లాప్ కొట్టి యాక్షన్ తో సినిమా స్టార్ట్ చేశారు. మొత్తానికైతే చాలా క్రేజీ కాంబో తెరపైకి రాబోతుండడంతో అభిమానులలో అంచనాలు పెరిగిపోయాయి. ఇకపోతే ఈ చిత్రాన్ని వైరా క్రియేషన్స్ నిర్మిస్తుండగా.. హాయ్ నాన్న చిత్రానికి సంగీతాన్ని అందించిన హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలను ఘనంగా పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.
ALSO READ:రెమ్యునరేషన్ విషయంలో అల్లు అర్జున్ కొత్త పద్ధతి.. ఏం టాలెంట్ గురూ!
విజయ్ దేవరకొండ తదుపరి సినిమాల విషయానికి వస్తే.. ముఖ్యంగా ఎనిమిదేళ్ల ప్రేమాయణం తర్వాత ఎట్టకేలకు ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్నతో ఏడడుగులు వేశారు విజయ్ దేవరకొండ. అందులో భాగంగానే ఆమెతో ముచ్చటగా మూడోసారి సినిమా చేస్తున్నారు. అదే రణబాలి. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్ర పోషిస్తున్నారు. బ్రిటిష్ కాలం నాటి కథ ఇది . రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో వలసలు ,ఆకలి చావులు ,వీరోచిత పోరాటాల ప్రధాన అంశాలుగా ఉంటాయని సమాచారం. ఇక విజయ్ రణబాలి అనే ఒక యోధుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, టి సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తూ ఉండగా.. అజయ్ – అతుల్ సంగీతాన్ని అందిస్తున్నారు. సెప్టెంబర్ 11 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది
ఈయన నటిస్తున్న మరో చిత్రం రౌడీ జనార్ధన..రవి కిరణ్ కోలా దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం కూడా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో రాబోతోంది. ఈ ఏడాది డిసెంబర్లో విడుదల కానున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==