BigTV English

Deepika Padukone : దీపికా ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. మరో మూవీ అవుట్..

Deepika Padukone : దీపికా ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. మరో మూవీ అవుట్..

Deepika Padukone : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పడుకునే గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. తెలుగు ప్రేక్షకులకు ఈమె సుపరిచితమే.. గత ఏడాది రిలీజ్ అయిన ప్రభాస్ కల్కి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ప్రభాస్ తో స్పిరిట్ సినిమాలో నటించాల్సి ఉంది. అని కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. అయితే ఆమె ఈ సినిమా నుంచి ఎందుకు తప్పుకుందో ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలింది. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో సినిమా నుంచి కూడా దీపిక తప్పుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఇలాంటి వార్తలు విన్నా ఆమె అభిమానులు ఏది నిజమో.. ఏది అబద్దమో తేల్చుకోలేకపోతున్నారు. అసలు నిజం ఏంటో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం..


మరో మూవీ నుంచి దీపికా అవుట్..

సందీప్ రెడ్డి వంగ, పాన్ ఇండియా హీరో ప్రభాస్ కాంబినేషన్లో రాబోతున్న స్పిరిట్ మూవీలో మొదట దీపిక పడుకునే నటిస్తుందని వార్తలు వినిపించాయి.. కానీ ఆమె ఆ సినిమా నుంచి అనూహ్యంగా తప్పుకుంది.. తాజాగా మరో సినిమా నుంచి తప్పుకుంది. అమితాబచ్చన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘The Intern’ సినిమాలో దీపికా పదుకొనే ఓ కీలక పాత్రలో నటించాల్సి ఉంది. అయితే ఈ మూవీలో నటించకూడదని నిర్ణయం తీసుకుందట. హాలీవుడ్ మూవీ ‘The Intern’కి ఇది హిందీ రీమేక్.. ఈ మూవీని స్వయంగా దీపికా పదుకొనే నిర్మిస్తోంది.. ప్రొడక్షన్ మొదలైన తర్వాత కొన్ని క్రియేటివ్ కారణాలతో ఈ మూవీలో నటించకూడదని నిర్ణయం తీసుకుందని టాక్.. కేవలం నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తుందట.


Also Read : హమ్మయ్య శ్రీవల్లి సేఫ్.. నర్మద మాటతో మైండ్ బ్లాక్.. ప్రేమ ధీరజ్ ఫైట్..

స్పిరిట్ కోసం దీపికా కండీషన్లు.. 

గత ఏడాది బాలీవుడ్ ఇండస్ట్రీలో యానిమల్ సినిమాతో సంచలనం క్రియేట్ చేశాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఆ తర్వాత స్పిరిట్ చేస్తున్నాడు. రోజుకి 8 గంటలే షూటింగ్ చేస్తానని, రూ.28 కోట్ల రెమ్యూనరేషన్‌తో పాటు లాభాల్ల 15 శాతం వాటా ఇవ్వాలని కోరిన దీపికా పదుకొనే, 150 రోజుల కంటే ఎక్కువ రోజులు షూటింగ్ చేయాల్సి వస్తే రోజుకు కోటి చొప్పున ఇవ్వాల్సిందే అని కండీషన్లు పెట్టిందని టాక్. 8 గంటల పని సమయం వర్కవుట్ కాకపోవడం వల్లే సినిమా నుంచి తప్పుకున్నానని హైలైట్ చేయడంలో దీపికా పదుకొనే టీమ్ సక్సెస్ అయ్యింది.. ఏది ఏమైనా కూడా కొత్త సినిమాల నుంచి దీపికా తప్పుకోవడం అనేక అనుమానాలకు దారి తీస్తుంది. ఇకముందు దీపిక సినిమాలు చేస్తుందా లేక నిర్మాతగా పలు సినిమాలను నిర్మిస్తుందా చూడాలి.. ఇలాంటి వార్తలు విన్నా దీపిక అభిమానులు నిరాశ ఉన్నారు. ఆమె నుంచి మరో సినిమా వస్తే బాగుంటుందని ఆశపడుతున్నారు. మరి దీపిక ఫ్యాన్స్ కోరికను నెరవేరుస్తుందో లేదో చూడాలి..

ఈ మధ్యే ఈమె ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.. ప్రస్తుతం ఆ బిడ్డ అలనా, పాలనా కూడా తానే చూసుకుంటుంది. అందుకే నిర్మాతగా సినిమాలు చేస్తుందని ఇండస్ట్రీలో టాక్..

Related News

Raghava Lawrence : డౌన్ సిండ్రోమ్ పీపుల్ కు రాఘవ లారెన్స్ సేవ, వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు

Pawan Kalyan: హృతిక్ అయినా.. ఖాన్స్ అయినా.. పవన్ ముందు దిగదుడుపే

Dharma Mahesh: పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. నా ముందే మరో వ్యక్తితో కార్లో.. భార్య గౌతమిపై సంచలన కామెంట్స్

Kantara Chapter1: బుధవారమే కాంతార చాప్టర్ 1 ప్రీమియర్.. ఆ బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్ అవ్వదుగా!

RamCharan 18Yrs Legacy : రామ్ చరణ్ కామన్ డిపి లో అన్ని పాత్రల అరాచకాన్ని చూపించారు

Jr.Ntr: 500 కోట్లు కొల్లగొట్టిన ఎన్టీఆర్ సినిమా.. కట్ చేస్తే ఇప్పటివరకు సాటిలైట్స్ రైట్స్ అమ్ముడు పోలేదు?

Suriya Jyothika : ఆస్కార్ బరిలో లీడింగ్ లైట్స్, దర్శకురాలుగా ఎంట్రీ ఇచ్చిన సూర్య కూతురు

Kantara Chapter1 : కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ గెస్ట్ గా టాలీవుడ్ స్టార్!

Big Stories

×