Kakinada Sridevi:కాకినాడ శ్రీదేవి (Kakinada Sridevi).. ఒకప్పుడు ఇంస్టాగ్రామ్ వేదికగా పలు రీల్స్ చేస్తూ సోషల్ మీడియా అభిమానులను ఆకట్టుకుంది. ముఖ్యంగా సినిమా పాటలకు రీల్స్ చేస్తూ వెలుగులోకి వచ్చిన ఈమెకు..’కోర్ట్ : స్టేట్ వర్సెస్ ఏ నోబడీ’ మూవీలో అవకాశం లభించింది. అయితే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని.. ఓవర్ నైట్ కి స్టార్ అయిపోయింది శ్రీదేవి. కోర్ట్ డ్రామా మూవీగా వచ్చిన ఈ చిత్రానికి రామ్ జగదీష్ (Ram Jagadeesh)దర్శకత్వం వహించగా.. ప్రశాంతి తిపిర్నేని , నాచురల్ స్టార్ నాని (Nani ) వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నిర్మించారు. ఇందులో ప్రియదర్శి పులికొండ (Priyadarshi Pulikonda), సాయికుమార్ (Sai Kumar), శివాజీ(Sivaji ), రోహిణి(Rohini ), హర్షవర్ధన్ (Harshavardhan), శుభలేఖ సుధాకర్ (Subha lekha Sudhakar), హర్ష్ రోషన్ (Harsh Roshan) తదితరులు కీలకపాత్రలు పోషించారు. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం రూ.5కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.58.15 కోట్లు కలెక్షన్ వసూలు చేసి రికార్డు సృష్టించింది.
ఘనంగా రక్షా బంధన్ జరుపుకున్న శ్రీదేవి..
ఈ సినిమాతో ఊహించని విజయాన్ని అందుకున్న కాకినాడ శ్రీదేవి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా.. ఏం చేసినా తెగ వార్తల్లో నిలుస్తోంది అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఈమె కనిపించిన తీరు అందరిలో అనుమానాలు రేకెత్తిస్తోంది అని చెప్పవచ్చు. అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవల రక్షా బంధన్ పండుగను ప్రతి ఒక్కరూ చాలా ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే.. ముఖ్యంగా సెలబ్రిటీలు తమ తోబుట్టువులకు రాఖీ కట్టిన సందర్భాలను ఫోటోలు, వీడియోలను రూపంలో సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. అందరిలాగే శ్రీదేవి కూడా తన అన్నయ్యకు రాఖీ కడుతున్న ఒక వీడియోని తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది.
ఏంటీ.. శ్రీదేవికి పెళ్ళయిందా? మెడలో పసుపుతాడు?
ఇదంతా బాగానే ఉన్నా అక్కడ ఆమె కనిపించిన తీరు అనుమానాలకు దారితీసింది. అసలు విషయంలోకి వెళ్తే.. ఆమె మెడలో పసుపు తాడు కనిపించడంతో నెటిజన్స్ , అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏంటీ..? నీకు పెళ్లయిందా? మాకు చెప్పకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నావా? అంటూ కామెంట్లు పెడుతున్నారు.. మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు.. మీ భర్త ఎవరు? అంటూ ఇలా ఎవరికి తోచినట్టు వారు కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం.
అసలు విషయం ఏమిటంటే?
అయితే ఈ పోస్ట్ కాస్తా వైరల్ అవడంతో.. ఇది చూసిన చాలామంది ఆమె మెడలో ఉన్నది పసుపు తాడు కాదు గోల్డ్ చైన్.. బ్లర్ గా కనిపించడం వల్ల అది పసుపు తాడులా కనిపిస్తోంది అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే పసుపు తాడు అనుకొని అభిమానులు ఖంగారు పడిపోయారు. అసలే కుర్రకారు క్రష్ గా మారిన శ్రీదేవి.. ఇప్పుడు సడన్ గా పసుపు తాడుతో కనిపించడం ఏంటి? అని నిరాశ వ్యక్తం చేయగా.. అసలు విషయం తెలిసి ఊపిరి పీల్చుకుంటున్నారు.
శ్రీ దేవి కెరియర్..
శ్రీదేవి విషయానికి వస్తే.. ప్రస్తుతం దేవాలయాలను సందర్శిస్తూ బిజీగా మారింది. అందులో భాగంగానే ఇటీవల తిరుమలలో శ్రీ వారిని దర్శించుకున్న ఈమె.. అక్కడ ఫ్రీ బస్సు సదుపాయం పై కూడా భక్తులలో అవగాహన కల్పిస్తూ ప్రయాణం సులభతరం చేసే ప్రయత్నం చేసింది. ఇక ఇప్పుడు కథలు వింటోందని , త్వరలోనే మరో మంచి కథతో మన ముందుకు రాబోతుందని సమాచారం.
ALSO READ:RGV: నేడు విచారణకు ఆర్జీవీ.. సర్వత్రా ఉత్కంఠ!
?utm_source=ig_web_copy_link