Illu Illalu Pillalu ToIlluday Episode August 12th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఉదయం లేవగానే రామరాజు ఇంట్లోకి సేన భద్ర వాళ్ళ కుటుంబం వస్తారు.. ఏమైంది ఎందుకు ఇలా వచ్చారు అని అడుగుతారు.. మీ వియ్యంకుడు మా ఇంట్లో దొంగతనానికి వచ్చారు అంటూ సేన రామరాజు పై రెచ్చిపోయి మాట్లాడుతాడు. ఎందుకు ఆయనను ఇలా కట్టేశారు దొంగతనం కొచ్చారని మీకు ఎవరు చెప్పారు అని రామరాజు అరుస్తాడు.. అసలు ఆయనకు దొంగతనం చేయాల్సిన అవసరం ఏంటి? ఆయనే ఫైనాన్స్ బిజినెస్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు అని అంటాడు. అప్పుడే భాగ్యం ఎంట్రీ ఇస్తుంది. దొంగతనం బయటపడుతుంది. పుట్టినరోజు నాటకాన్ని ఆడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఆనంద్ రావుని భాగ్యం ఎలాగోలాగా కాపాడి బయటపడేస్తుంది. రామరాజు కూడా అది నిజమే అని కొన్ని నమ్మి శ్రీవల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతాడు. లోపలికి వెళ్ళిన రామరాజు కుటుంబం ఆనందరావు పరిస్థితిని చూసి జాలి పడతారు. తిరుపతి ఆనంద్ రావు మీద ఇడ్లీలో పంచులను వేసి విసిగిస్తాడు. ఆనందరావు కూడా ఏమాత్రం తగ్గకుండా ఇడ్లీ చట్నీ మధ్య ఉన్న సంబంధం గురించి పంచులు వేస్తాడు.
శ్రీవల్లి వాళ్ళ నాన్నని ఎంతగా మాట్లాడదని చెప్పినా కూడా ఆనందరావు మౌనంగా ఉండకుండా మాట్లాడుతూనే ఉంటాడు. మా నర్మద మాత్రం ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి ఆనందరావుతో ఎలాగైనా నిజం చెప్పించాలని అనుకుంటారు. ముందుగానే ఆ విషయం ఊహించిన భాగ్యం వీళ్ళ ప్రశ్నల నుంచి బయటపడేయాలి లేకపోతే ఈయన గారు నోరు జారీ అసలు నిజం చెప్పేసిన చెప్పేస్తాడు అని అనుకుంటుంది. అయినా బాబాయ్ గారు శ్రీవల్లి అక్క పుట్టినరోజు అంటే కేకు గాని పువ్వులు గాని ఏమి తీసుకురాకుండా ఎలా వచ్చారు అని నర్మదా అడుగుతుంది.
ఆనందరావు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాడు. వైపు భాగ్యం ఎంత చెప్పినా సరే నర్మద మాత్రం ప్రశ్నలు అడగడం మానదు. ఈ విషయంలో ఎలాగైనా నాన్నని బయటకు తీసుకురావాలి లేదంటే వీళ్ళిద్దరూ ప్రశ్నలు వేసే చంపేసేలా ఉన్నారని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. శ్రీవల్లికి శుభాకాంక్షలు చెప్పిన నర్మదా మీ నాన్నని దొంగతనానికి తీసుకొచ్చావని నాకు అర్థమైంది అక్క. ఈరోజు నీ పుట్టిన రోజు కాదని కూడా నాకు తెలిసిపోయింది. అసలు సంగతి ఏంటో నేను తేలుస్తానని చాలెంజ్ చేస్తుంది.
ప్రేమ మీద కోపంతో ధీరజ్ ప్రేమని మీ వాళ్లంతా ఇంతేనా అని అడుగుతాడు. మా వాళ్ళు ఏం చేశారు అర్ధరాత్రి ఎవరైనా వెళ్తే దొంగ అని అనుకుంటారని ప్రేమ వాళ్ళ మీద మాట పడనివ్వకుండా మాట్లాడుతుంది. ఈ విషయంలో ఇద్దరూ ఘోరంగా గొడవ పడతారు. చివరికి ఇద్దరూ కలిసిపోతారు. వీరిద్దరు గొడవ ఎపిసోడ్కి హైలెట్ గా నిలుస్తుంది. చూస్తుంటే మరికొద్ది రోజుల్లోనే వీరిద్దరూ ప్రేమలో పడేలా కనిపిస్తున్నారు. ఇక ఆనంద్ రావు భాగ్యం ఇక్కడే ఉంటే అల్లుడుగారు 10 లక్షలు అడుగుతారేమో అని అక్కడినుంచి మెల్లగా జారుకునే ప్రయత్నం చేస్తారు.
అయితే ఇద్దరు దొంగతనానికి వచ్చినప్పుడు ఎలా గోడ దూకావు అని ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. రాత్రి ఈ గోడని ఇలా దూకానని ఆనందరావు ప్రాక్టీస్ చేసి చూపిస్తూ ఉంటాడు వీళ్లిద్దరిని చూసినా ప్రేమ ఏంటి ఎవ్వారం మీద తేడాగా ఉందని ఆలోచిస్తుంది.. అది గమనించిన భాగ్యం ఇగో మన మీద ప్రేమకు అనుమానం వచ్చింది. దీని నుంచి బయటపడి మెల్లగా ఇంటికి వెళ్ళిపోవాలి అని అనుకుంటారు. రామ రాజు బావ గారు ఇలాంటి గోడ కట్టిస్తే ఎవరైనా దూకేస్తారు. దొంగలు పడిపోరు అని ప్రాక్టీస్ చేస్తున్నాను ఇలాంటి గోడలు ఇంకాస్త హైట్లో కడితే దొంగలు రారు కదా అంటాడు ఆనందరావు.
Also Read:అక్షయ్ కు క్లాస్ పీకిన అవని.. ప్రణతికి పెళ్లి చెయ్యబోతున్న పార్వతి.. దిమ్మతిరిగే ట్విస్ట్..
ప్రేమకు మాత్రం వీళ్ళిద్దరి మీద అనుమానం ఎంతో కొంత ఉండనే ఉంటుంది. అటు నర్మద కూడా వీళ్ళిద్దరిని అనుమానిస్తూనే ఉంటుంది. మొత్తానికి ఇద్దరు రామరాజు ఇంటి నుంచి బయట పడతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో శ్రీవల్లి గురించి నర్మదా అసలు సంగతి తెలుసుకుంటుందేమో చూడాలి…