E-Paper
Advertisement

MAA Diary: ‘మా డైరీ’ని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం.. లక్ష్యమిదే!

MAA Diary: ‘మా డైరీ’ని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం.. లక్ష్యమిదే!
Advertisement

MAA Diary: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Telangana Deputy Chief Minister Mallu Bhatti Vikramarka) చేతుల మీదుగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) నూతన డైరీని ఘనంగా ఆవిష్కరించారు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu). అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ‘మా’ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, కళాకారుల సంక్షేమం కోసం అసోసియేషన్ తీసుకుంటున్న చొరవను అభినందిస్తూ.. ప్రభుత్వం తరపున ఎటువంటి సహాయమైనా అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మా సభ్యుల కోసం చేపడుతున్న ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, హెల్త్ చెకప్‌లు, సభ్యుల సంక్షేమం కోసం మా కార్యవర్గం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాటలతో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ టీమ్ అంతా సంతోషం వ్యక్తం చేస్తూ.. ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.

Also Read- Samanth -Raj Nidimoru:తన భర్త రాజ్‌పై సమంత కామెంట్స్.. మొన్నే కదా పెళ్లయ్యింది, అప్పుడే?

ఆ ప్రగతికి చిహ్నంగా..

Advertisement

మంచు విష్ణు సారథ్యంలో ‘మా’ (MAA) సభ్యుల సంక్షేమం, ఆరోగ్య భద్రత, సంస్థాగత వృద్ధే లక్ష్యంగా వేగంగా అడుగులు వేస్తోన్నామని ఈ సందర్భంగా ‘మా’ టీమ్ డిప్యూటీ సీఎంకు తెలిపారు. అనంతరం అధ్యక్షుడు మంచు విష్ణు మాట్లాడుతూ.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఉన్న సభ్యుల అవసరాలను గుర్తించి, వారి అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నామని, ఈ కొత్త డైరీ ఆ ప్రగతికి ఒక చిహ్నమని తెలిపారు. ముందు ముందు మరిన్ని మంచి కార్యక్రమాలతో అసోసియేషన్ సభ్యుల అవసరాలన్నీ తీరుస్తామని అన్నారు. సోమవారం ఉదయం ప్రజాభవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ‘మా’ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి, ట్రెజరర్ శివ బాలాజీతో పాటుగా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ జయవాణి, మలక్ పేట్ శైలజ, శివ నారాయణ, శశాంక్, హరనాథ్ బాబు, మానిక్, సంపూర్ణేశ్ బాబు, ఎం.ఆర్.సి. వడ్లపట్ల తదితరులు పాల్గొన్నారు.

Also Read- Sreemukhi : శ్రీముఖి ఏముంది మావా.. లంగావోణీలో మనసు దోచుకుంటుంది..

మరోసారి అధ్యక్షుడిగా మంచు విష్ణు

Advertisement

తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ‘మా’ నూతన డైరీని ఆవిష్కరించి.. అధ్యక్షుడు మంచు విష్ణుతో పాటు కార్యవర్గ సభ్యులందరికీ డైరీని అందించి, అందరినీ అభినందించారు. ప్రస్తుతం ఈ డైరీ ఆవిష్కరణ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల మంచు విష్ణు పదవీ కాలం ముగిసినా, మరోసారి ఆయననే కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో ప్రకాశ్ రాజ్‌తో పోటీపడి, మంచు విష్ణు విజయం సాధించారు. ఆయన పదవీకాలం పూర్తై, మళ్లీ ఎన్నికల జరగాల్సి ఉండగా, మరోసారి మంచు విష్ణునే ఉంటే పనులన్నీ జరుగుతాయని ఆలోచించిన కమిటీ సభ్యులు, మంచు విష్ణునే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో వరుసగా రెండోసారి ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికయ్యారు. ఆయన నేతృత్వంలో సభ్యుల సంక్షేమం నిమిత్తం అనేక కార్యక్రమాలు జరుగుతున్న విషయం తెలిసిందే.

Also Read- Yash Toxic Movie: ‘టాక్సిక్’ నుండి యశ్ మేకోవర్ వీడియో.. AI ట్రోల్స్ పై హెయిర్ స్టైలిస్ట్ క్లారిటీ!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×