Desert Warrior: ఎంత పెద్ద డిజాస్టర్ సినిమా అయినా పెట్టిన బడ్జెట్ లో కనీసం ఐదో, పదో పర్సెంట్ రాకుండా పోదు.కానీ 1400 కోట్ల బడ్జెట్ కుమ్మరిస్తే కనీసం పది కోట్ల రూపాయల వసూల్లని కూడా రాబట్టలేని సినిమా ఉందన్న సంగతి మీకు తెలుసా..యస్ .. సౌదీ అరేబియా సినిమా ఇండస్ట్రీని వరల్డ్ మ్యాప్ లో పెట్టేస్తామంటూ సౌదీ అరేబియాకు చెందిన ఎంబీసీ (MBC) గ్రూప్ ప్రెస్టేజియస్ గా దాదాపు 1400 కోట్ల భారీ బడ్జెట్ తో తీసిన ‘డెజర్ట్ వారియర్’ అనే సినిమాకి వచ్చిన కలెక్షన్స్ కేవలం అక్షరాల 6 కోట్ల చిల్లర మరి.
ఏప్రిల్ 24, 2026న వరల్డ్ వైడ్ రిలీజ్
నిజానికి 2021 సెప్టెంబర్‌లో నియోమ్ (NEOM) మరియు తబుక్ నగరాల్లోని ఎడారి ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పుడే ఇదొక ఆడియన్స్ కొక విజువల్ ఫీస్ట్ అవుతుందని అనుకున్నారంతా.కథ విషయానికి వస్తే 7వ శతాబ్దంలో అరేబియా నేపథ్యంలో, ఒక యువరాణి తన తండ్రి రాజ్యాన్ని కాపాడుకోవడానికి చేసే పోరాటమే ఈ సినిమా కథ. దాదాపు ఐదేళ్ల పాటు ప్రొడక్షన్లో ఉన్న ఈ సినిమా ఎన్నో సార్లు పోస్ట్ పోన్ అవుతూ అనేక వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఏప్రిల్ 24, 2026న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది.హాలీవుడ్ స్టార్ హీరో,మార్వెల్ కెప్టెన్ అమెరికా ఆంథోనీ మాకీ ఇందులో ప్రధాన పాత్ర పోషించగా, ఆస్కార్ అవార్డు గ్రహీత బెన్ కింగ్స్లీ, షార్ల్టో కోప్లీ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో కనిపించారు.ఇక ‘రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ డైరెక్టర్ రూపెర్ట్ వ్యాట్ డైరెక్షన్ చేయడంతో సినిమాలు అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయ్.
ALSO READ :నితిన్ మార్కెట్ అవుట్? భారీ బడ్జెట్‌తో రిస్క్ చేయలేక దర్శకుడికి షాక్!
అక్షరాల 6 కోట్లు
ఇక భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది.ఉత్తర అమెరికా వ్యాప్తంగా వెయ్యికి పైగా థియేటర్లలో విడుదలైనప్పటికీ, కేవలం 5 లక్షల డాలర్లు (సుమారు 4 కోట్లు) మాత్రమే వసూలు చేయడం గమనార్హం.ఇక టోటల్ గా వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకి వచ్చిన కాసులు అన్నీ కలిపినా ఆరు కోట్లు దాటలేదంటే సినిమా ఏ స్థాయిలో డిసప్పాయింట్ చేసిందో అర్థమవుతుంది.
విచ్చల విడిగా డబ్బులు కుమ్మరించినా
అయితే సినిమా ఐదేళ్ళుగా నిర్మాణం జరుపుకోవడం ఈ సినిమా డిజాస్టర్ కి మెయిన్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవాలి. 2021లో మొదలైన ఈ ప్రాజెక్ట్,ప్రొడక్షన్ లో మరియు పోస్ట్ ప్రొడక్షన్ డిలే అవడం వల్ల 2026 వరకు పోస్ట్ పోన్ అయిన పరిస్థితి. ఆలోపు సినిమాపై ఉన్న క్రేజ్ పూర్తిగా ఆవిరైపోయింది. ఇక సినిమాకి హాలీవుడ్ డైరెక్టర్ రూపెర్ట్ వ్యాట్ తన ఎఫర్ట్ అంతా పెట్టినప్పటికీ కథలో అక్కడి అరేబియన్ పద్ధతులకి,మూలాలకి, ఇంటర్నేషనల్ ఆడియన్స్ కి ఉన్న టేస్ట్ కి సింక్ అవకపోవడం, వార్ సీక్వెన్స్ కోసం కొన్ని వందల మందిని, వేల సంఖ్యలో జంతువులను వాడకం కోసం విచ్చల విడిగా డబ్బులు కుమ్మరించినా, సినిమాలో ఎమోషన్ పండకపోవడంతో ఆడియన్స్ ఫస్ట్ షో కే బాక్సులు తిప్పి పంపేశారు.
ALSO READ :కర్ణాటకలో ఓకే.. మరి తమిళనాడులో ఎందుకు కాదు? గవర్నర్‌ను నిలదీసిన హీరో విశాల్!
200 మిలియన్ డాలర్ల నష్టాన్ని మిగిల్చిన ‘జాన్ కార్టర్’
మాములుగా హాలీవుడ్ చరిత్రలో భారీ డిజాస్టర్స్ ఏవని చూస్తే 200 మిలియన్ డాలర్ల నష్టాన్ని మిగిల్చిన ‘జాన్ కార్టర్’ (Disney),175 మిలియన్ డాలర్ల నష్టాన్ని మిగిల్చిన ‘మోర్టల్ ఇంజిన్స్’ (2018),అలాగే ’47 రోనిన్’, ‘ది లోన్ రేంజర్’ వంటి సినిమాలు కనిపిస్తాయి.అయితే ఇవి కనీసం పెట్టిన బడ్జెట్ లో 30 నుంచి 40 శాతం వసూళ్లను రాబట్టడం విశేషం. కానీ వీటన్నింటిని తలదన్నుతూ ‘డెజర్ట్ వారియర్’ పెట్టిన పెట్టుబడిలో ఒక శాతం (1%) కూడా రాబట్టలేక వాటిని వెనక్కి నెట్టేసి మొదటి స్థానాన్ని కొట్టేయడం గమనార్హం.దీన్ని బట్టి మన మేకర్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాసులు కుమ్మరిస్తే సరిపోదు …కథలో కంటెంట్ కూడా ఉండాలని.