Devi Sri Prasad: ఇటీవల టాలీవుడ్‌లో ఒక్కరి గురించి తెగ వినిపిస్తోంది..ఆది మరెవరో కాదు ..ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (డీఎస్పీ). ఒకప్పుడు ఆయన పేరు వినిపిస్తే చాలు సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారినట్టు కనిపిస్తోంది.
2000 నుంచి 2019 వరకు డీఎస్పీ టాలీవుడ్‌ను ఏలాడని చెప్పొచ్చు. టాప్ హీరోలు, పెద్ద నిర్మాతలు ఆయన డేట్స్ కోసం ఎదురు చూసేవారు. ఎంత రెమ్యునరేషన్ అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉండేవారు. పాటలు మాత్రమే కాదు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకు పెద్ద ప్లస్ అయ్యేది. డీఎస్పీ మ్యూజిక్ అంటే యూత్‌కి పండుగే.
కానీ 2019 తర్వాత ఆయన కెరీర్‌లో మార్పులు మొదలయ్యాయి. కొత్త సినిమాల సంఖ్య క్రమంగా తగ్గింది. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసే డీఎస్పీకి ఇప్పుడు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ప్రాజెక్టులు కూడా చాలా కొద్దే.
ఇప్పటికే తెలిసిన సమాచారం ప్రకారం, డీఎస్పీ వద్ద ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్, ఎల్లమ్మ, అలాగే ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుతో ఒక సినిమా మాత్రమే ఉన్నాయి. వీటిని తప్ప మరో కొత్త సినిమా ఆయన ఖాతాలోకి రాలేదు. ఇది అభిమానులను కొంచెం ఆందోళనకు గురి చేస్తోంది.
ఇప్పుడంతా ఉస్తాద్ భగత్ సింగ్ ఆల్బమ్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. ఆ సినిమా పాటలు, మ్యూజిక్ పెద్ద హిట్ అయితే డీఎస్పీకి మళ్లీ మంచి రోజులు మొదలయ్యే అవకాశం ఉంది. పరిశ్రమలో మరోసారి బిజీగా మారవచ్చని చాలామంది భావిస్తున్నారు.
అయితే, ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోతే మాత్రం డీఎస్పీ పరిస్థితి మరింత కష్టంగా మారే ఛాన్స్ ఉంది. గతంలో ఒకప్పుడు టాప్‌లో ఉన్న మణిశర్మలా ఆయన కూడా క్రమంగా అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.
మొత్తానికి.. డీఎస్పీకి ఇది నిజంగా కఠినమైన సమయమే. కానీ టాలెంట్ ఉన్న వ్యక్తికి ఒక్క మంచి హిట్ చాలు. రాబోయే రోజుల్లో డీఎస్పీ మళ్లీ తన మ్యాజిక్ చూపిస్తాడా? లేక ఈ దశను దాటలేకపోతాడా? అన్నది కాలమే చెప్పాలి.
ALSO READ: Akira Nandan: అకీరా నందన్ ఎంట్రీ ఆ దర్శకుడితోనా? ఫ్యాన్స్ ఏమంటున్నారంటే?