E-Paper
Advertisement

Accused OTT release date : కొంకణా సేన్ శర్మ సైకలాజికల్ థ్రిల్లర్ ఓటీటీ రిలీజ్ డేట్… ఎప్పుడంటే ?

Accused OTT release date : కొంకణా సేన్ శర్మ సైకలాజికల్ థ్రిల్లర్ ఓటీటీ రిలీజ్ డేట్… ఎప్పుడంటే ?
Advertisement

Accused OTT release date : అప్ కమింగ్ సినిమాల లిస్ట్ ను ముందుగానే అనౌన్స్ చేస్తూ, ఆడియన్స్ ను అలర్ట్ చేస్తున్నాయి ఓటీటీలు. ఇలాంటి అప్డేట్స్ ఇవ్వడంలో దిగ్గజ ఓటీటీ సంస్థలు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్ వంటి సంస్థలు ముందు ఉంటాయి. తాజాగా నెట్ ఫ్లిక్స్ ఓ ఇంట్రెస్టింగ్ సైకలాజికల్ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది. మరి ఆ మూవీ ఏంటి ? ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

నెట్‌ఫ్లిక్స్ ఇండియా 2026లో తన లైనప్‌లో ఒక శక్తివంతమైన సైకలాజికల్ డ్రామా-థ్రిల్లర్‌ను తీసుకొస్తోంది. ఆ సినిమా పేరు ‘అక్యూస్డ్’. ఈ చిత్రం ఫిబ్రవరి 27న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ అవుతుంది. కరణ్ జోహార్ ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో నిర్మించిన ఈ సినిమా ఆధునిక సమాజంలో అధికారం, పక్షపాతం, గుర్తింపు కోసం పడే ఆవేదన వంటి అంశాల ఆధారంగా తెరకెక్కింది. ఫిబ్రవరి 9న ఈ చిత్రం నుంచి విడుదలైన అధికారిక పోస్టర్, టీజర్ భారీ ఆసక్తిని రేకెత్తించింది. అనుభూతి కశ్యప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సిమా అగర్వాల్, యష్ కేస్వానీ రచయితలు కాగా, ప్రతిభా రంతా గీతిక భార్య పాత్రలో నటిస్తోంది. ఆదిత్య నందా, సుకాంత్ గోయెల్, ఇతర నటీనటులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. కొంకణ సేన్ శర్మ, ప్రతిభా రంతా మధ్య ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ టీజర్‌లోనే బాగా కనిపించింది. సినీ విశ్లేషకులు ఈ చిత్రాన్ని 2026 నెట్‌ఫ్లిక్స్ లైనప్‌లో అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా చెబుతున్నారు. ఫిబ్రవరి 27న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ అవుతున్న ఈ సినిమా ఆలోచనాత్మకమైన, ఎమోషనల్ థ్రిల్లర్‌గా మారనుంది.

Advertisement

Also Read : ఒకరితో ఒకరికి సంబంధం లేని ఏడుగురు ఒకే హోటల్లో… నరాలు కట్టయ్యే సస్పెన్స్ ఉన్న సినిమా

కథలోకి వెళ్తే…

కొంకణా సేన్ శర్మ ఇందులో డాక్టర్ గీతిక అనే ప్రముఖ LGBTQ గైనకాలజిస్ట్‌గా కనిపిస్తారు. ఆమె ఒక ప్రతిష్టాత్మక ఆసుపత్రిలో అతి పిన్న వయస్కురాలైన డిపార్ట్మెంట్ హెడ్ గా మంచి పేరు తెచ్చుకుంటుంది. ఆమె లక్ష్యం డీన్ పదవి పొందడం. కానీ అంతలోనే ఆమెపై తీవ్రమైన లైం*గిక దుష్ప్రవర్తన ఆరోపణలు వస్తాయి. ఆ ఆరోపణలు, ప్రజాభిప్రాయంలో మార్పు, సమాజం, అధికారుల అనుమానాలు ఆమె జీవితాన్ని, కెరీర్‌ను కుప్పకూల్చేస్తాయి. ఆమె వివాహ బంధంపై కూడా ఆ ఎఫెక్ట్ పడుతుంది. బయటి ఒత్తిడికి లొంగిపోవాలా ? లేక తన భార్యతో నిలబడాలా ? అనే అయోమయ పరిస్థితి ఎదురవుతుంది ఆమెకు. టీజర్‌లో కనిపించినట్టు ప్రజాభిప్రాయం చాలా త్వరగా మారిపోతుంది. గీతిక “స్టెల్లార్ రికార్డ్” ఉన్నప్పటికీ… కోలీగ్స్, మెడికల్ బోర్డు, సమాజం ఆమెను “ప్రిడేటర్”గా ముద్ర వేస్తారు. కథ ప్రధానంగా ఆమె సంబంధాలపై, భావోద్వేగ అంశాల చుట్టూ సాగుతూ ఆలోచింపజేసేలా ఉంటుంది.

Advertisement

 

Tags

Related News

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

Big Stories

Advertisement
×