E-Paper
Advertisement

డ్రై ఫ్రూట్ నట్స్ ఎలా తింటే ఆరోగ్యకరం.. పచ్చిగా తినాలా? లేక వేయించి తినాలా?

డ్రై ఫ్రూట్ నట్స్ ఎలా తింటే ఆరోగ్యకరం.. పచ్చిగా తినాలా? లేక వేయించి తినాలా?
Advertisement

Dry fruits Raw Roasted| శాఖాహారంలో అత్యంత పవర్‌ఫుల్ ఆహారం డ్రై ఫ్రూట్స్. అంటే బాదం పప్పు, జీడి పప్పు (కాజు), వాల్‌నట్, పిస్తా పప్పు, ఖర్జూరాలు, అంజీర్ లాంటివి. అయితే వీటిలో ఖర్జూరాలు, అంజీర్ తప్ప మిగిలినవి అన్నీ నట్స్. మంచి పోషకాహారంలో ఇచ్చే ఫుడ్స్‌లో ఈ నట్స్  టాప్. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే ఈ నట్స్‌ని రెండు రకాలుగా తినొచ్చు. పచ్చిగా, రోస్టెడ్ (వేయించి).

ఈ రెండు విధానాల్లో బాదం, పిస్తా పప్పుని ఎలా తింటే ఆరోగ్యానికి ఏది మంచిదో చాలా మంది గందరగోళంలో ఉంటారు. రెండింటి గురించి సరైన అవగాహన ఉంటే ఏది తినాలో నిర్ణయించుకోవడం ఈజీ అవుతోంది.

పచ్చి నట్స్ అంటే ఏమిటి?

Advertisement

పచ్చి నట్స్ అంటే సహజ రూపంలో లభించేవి. వీటిలో ఇతర ఏ పదార్థాలు కలిపి ఉండవు. ఎలాంటి ప్రాసెసింగ్ జరగదు. వాటి సహజ రుచి, పోషకాలు అలాగే ఉంటాయి. బాదం, వాల్‌నట్, కాజు వంటివి పచ్చిగా తినొచ్చు. వీటిలో అదనపు ఉప్పు లేదా నూనె ఉండదు.

పచ్చి నట్స్ తినడం వల్ల లాభాలు

పచ్చి నట్స్‌లో ‘విటమిన్ E’ వంటి సహజ విటమిన్లు ఉంటాయి. ఇవి శరీర కణాలను రక్షించే యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి. అదనపు ఉప్పు లేదా కొవ్వులు లేకపోవడం వల్ల గుండె ఆరోగ్యానికి మంచివి. క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరంలో బలం పెరుగుతుంది.

పచ్చిగా తినడం వల్ల నష్టాలు

Advertisement

బాదం, కాజు, వాల్‌నట్, పిస్తా పప్పు పచ్చిగా తింటే అందులో ఫైటేట్స్ వంటి కాంపౌండ్స్ ఉంటాయి. వీటి వల్ల పోషకాలు శరీరం పూర్తిగా గ్రహించడానికి కష్టమవుతుంది. అంటే నట్స్‌లో ఫుల్ పవర్ శరీరానికి దక్కదు. కొన్ని పచ్చి నట్స్‌లో తేమ వల్ల బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంది. సరిగా నిల్వ చేయకపోతే సమస్యలు రావచ్చు. అందుకే జాగ్రత్తగా నిల్వ చేయడం చాలా ముఖ్యం.

రోస్టెడ్ నట్స్ అంటే ఏమిటి?

రోస్టెడ్ నట్స్‌ అంటే వేయించిన నట్స్. వాటిని వేయించి తింటే రుచి మరింత పెరుగుతుంది. ఆకారం కూడా అందంగా ఉంటుంది. పచ్చి నట్స్ కంటే వేయించిన నట్స్‌లో రుచి ఎక్కువగా ఉంటుంది. పైగా వీటిని నమలడం సులభం. చాలా మంది స్నాక్స్‌ రూపంలో రోస్టెడ్ నట్స్‌ తినడం ఇష్టపడతారు. రెండు రకాలుగా వేయించడం బాగుంటుంది. నూనె లేకుండా లేదా నూనె వేసి కూడా వేయించవచ్చు.

రోస్టెడ్ నట్స్ లాభాలు

వేయించడం వల్ల రుచి బాగుంటుంది. జీర్ణం కావడం సులభం అవుతుంది. వేయించే సమయంలో వీటిలోని ఫైటేట్స్ వంటి యాంటీ-న్యూట్రియెంట్స్ తగ్గుతాయి. దీని వల్ల నట్స్‌లో ఉండే మినరల్స్ శరీరం బాగా గ్రహిస్తుంది.

రోస్టెడ్ నట్స్ నష్టాలు

నట్స్ వేయించే సమయంలో ఎక్కువగా వేయించేస్తే వీటిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు దెబ్బతినవచ్చు. కొన్ని పోషకాలు తగ్గిపోవచ్చు. మార్కెట్ లో లభించే ప్యాకెట్ రోస్టెడ్ నట్స్‌లో ఎక్కువ ఉప్పు, నూనె ఉండవచ్చు. అందుకే వాటి లేబుల్ జాగ్రత్తగా చదవాలి

Also Read:  వ్యాయామం వద్దు ఇంజెక్షన్లు ముద్దు.. బరువు తగ్గే ఇంజెక్షన్లు ఇష్టపడుతున్న యువత

ఏవి ఆరోగ్యకరం?

సాధారణంగా పచ్చి నట్స్ ఆరోగ్యానికి మంచివి. ఎందుకంటే వాటిలో సహజ పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అయితే నట్స్‌ రాత్రి నానబెట్టి తినడం ఉత్తమ విధానం. అలాగే ఇంట్లోనే తక్కువ వేడితో రోస్ట్ చేసి కూడా తినవచ్చు. మార్కెట్ లో లభించే ఎక్కువ ఉప్పు, నూనె ఉన్న ప్యాకెట్ నట్స్ తినడం మానేస్తే బెటర్.

నట్స్ పచ్చిగా తిన్నా, లేక రోస్టెడ్ నట్స్ తిన్నా.. రెండూ ఆరోగ్యానికి మంచివే. అయితే పచ్చి నట్స్‌లో సహజ పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పచ్చి నట్స్ నానబెట్టి, రోస్టెడ్ నట్స్ తక్కువ వేడితో వేయిస్తే ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ మితంగా నట్స్ తినడం దీర్ఘకాలిక ఆరోగ్యానికి మంచిది.

Related News

పాలు తాగడం ఇష్టం లేదా? కాల్షియం కోసం ఈ 8 ఆరోగ్యకరమైన ఆహారాలు తినండి

ఖరీదైన ఫేస్‌వాష్ అవసరం లేదు.. కిచెన్‌లో లభించే ఈ ఐటెమ్స్‌తో మీ ఫేస్ డీప్ క్లీన్

పుట్టబోయేది మగబిడ్డ లేదా ఆడబిడ్డ.. హార్ట్‌బీట్‌తో తెలుసుకోవచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

Big Stories

Advertisement
×