Devil Collections : కన్నడ స్టార్ హీరో దర్శన్ ప్రస్తుతం జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అభిమాని హత్య కేసులో ఆయన జైలుకు వెళ్లారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ది డెవిల్. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీ.. దర్శన్ సినిమా అంటే కన్నడ ఇండస్ట్రీలో క్రేజ్ మాములుగా ఉండదు.. కానీ ఈ సినిమాకు ఆ పరిస్థితి కనిపించలేదు.. డిసెంబర్ 11 న భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం యావరేజ్ టాక్ ను అందుకుంది. కలెక్షన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. రిలీజ్ అయిన కొన్ని రోజులకే ఈ సినిమాకు బిగ్ షాక్ ఎదురైంది. ఇక నాలుగు రోజులకు ఈ చిత్రం ఎన్ని కోట్ల వసూళ్లను రాబట్టిందో ఒకసారి తెలుసుకుందాం..
కన్నడ ఇండస్ట్రీలో హీరో దర్శన్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన హత్య కేసులో జైల్లో ఉన్న సరే అభిమానులు మాత్రం ఆయన విడుదల కావాలని కోరుకున్నారు. మొన్నటి వరకు తమ హీరో బయటకు రావాలని కోరుకున్న అభిమానులు ఇప్పుడు ఆయన సినిమాను చూసేందుకు కూడా ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తుంది. తాజాగా రిలీజ్ అయిన డెవిల్ మూవీ కలెక్షన్స్ కన్నడ ఇండస్ట్రీలో దారుణంగా పడిపోయాయి. ట్రైలర్, టీజర్స్ తో బాగా ఆకట్టుకుంది. కానీ రిలీజ్ అయ్యాక ఊహించని కలెక్షన్స్ ను అందుకుంది.. మొదటి రోజు నుంచి మిక్సీ్డ్ టాక్ ను అందుకున్న ఈ మూవీ కలెక్షన్స్ 4 రోజులకు కేవలం 21 కోట్ల వరకు వసూల్ అయ్యాయని తెలుస్తుంది. ఈ కలెక్షన్స్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.. గతంలో దర్శన్ నటించిన ఏ సినిమాకు రాని కలెక్షన్స్ ఈ సినిమాకు రావడంతో డిజాస్టర్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. మరి ఈ వారం కలెక్షన్స్ ఏ మాత్రం పెరుగుతాయో చూడాలి..
Also Read : ‘దురంధర్ ‘ బాక్సాఫీస్ వేట ఇప్పటిలో ఆగేలా లేదు.. ఎన్ని కోట్లంటే..?
అభిమాని రేణుకా స్వామిని అత్యంత దారుణంగా హత్య చేసిన కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ జైలుకు వెళ్లకముందు చేసిన చివరి సినిమా డెవిల్.. వైష్ణో స్టూడియోస్, జై మాతా కంబైన్స బ్యానర్‌లపై ప్రకాష్, జే జయమ్మలు సంయుక్తంగా ది డెవిల్ సినిమాను నిర్మించగా ప్రకాష్ దర్శకత్వం వహించారు. హీరోయిన్ గా రచన రాయ్ హీరోయిన్‌గా నటించారు. ఇందులో మహేశ్ మంజ్రేకర్, అచ్యుత్ కుమార్, షర్మిలా మండ్రే, రోజర్ నారాయణ్, శోభరాజ్, శ్రీనివాస్ ప్రభు, తులసి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.. ఈ సినిమాకు 65 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా శాండల్‌వుడ్ వర్గాలు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు కళ్లు చెదిరే స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు.. తొలి రోజు దర్శన్ మూవీకి వరల్డ్ వైడ్‌గా 20 నుంచి 25 కోట్ల రూపాయల రేంజ్‌లో ఓపెనింగ్స్ వస్తాయని అనుకున్నారు కానీ అంత 4 రోజులకు కూడా వసూల్ అవ్వలేదు. ఇదే విధంగా కలెక్షన్స్ ఉంటే మాత్రం సినిమాకు భారీ నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.. ఎటు లేదనుకున్న కూడా ఒక నెల ఈ సినిమా రన్ ఇదే పరిస్థితిలో కలెక్షన్స్ వస్తే మాత్రం దాదాపు 20 కోట్ల వరకు నష్టం జరిగే అవకాశం ఉంది. హీరో జైలుకు వెళ్లడంతో పాటుగా సినిమాకు ప్రమోషన్స్ కూడా సరిగ్గా చెయ్యలేదు.. దానివల్లే డిజాస్టర్ టాక్ అందుకున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఫైనల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..