E-Paper
Advertisement

ధనుష్ యాక్షన్ థ్రిల్లర్ ‘కర’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఆ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

ధనుష్ యాక్షన్ థ్రిల్లర్ ‘కర’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఆ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Advertisement

Kara OTT : కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ ధనుష్ హీరోగా, మలయాళ సెన్సేషన్ మమితా బైజు హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘కర’. భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈ సాలిడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ఆడియన్స్ తో పాటు విమర్శకుల నుండి ప్రశంసలు అందుకున్న సంగతి తెల్సిందే.ఇక థియేటర్ రన్ ని క్లోజ్ చేసుకున్న ఈ సినిమా ఎట్టకేలకి డిజిటల్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపొయింది.

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. రాబోయే మే 28 నుండి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ లోకి రాబోతున్నట్లు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు మేకర్స్. థియేటర్లలో మిస్ అయిన వారికి మరియు మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఒకరకంగా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

Advertisement

 మలుపులతో తెరకెక్కించిన  విఘ్నేష్

సినిమా విషయానికి వస్తే గతంలో ‘పోరుతొజిల్’ లాంటి ఇంటెన్స్ సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ను అందించి కోలీవుడ్ తో పాటు టాలీవుడ్‌లోనూ క్రేజీ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న విఘ్నేష్ రాజా ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.తన మొదటి సినిమా లాగే ఈ ‘కర’ చిత్రాన్ని కూడా ఎక్కడా ల్యాగ్ లేకుండా, ఊహించని ట్విస్ట్ లతో , అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించాడు విఘ్నేష్.

Advertisement

also read :ఇండియన్ సినీ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఈవెంట్.. నేడే భోపాల్‌లో ‘పెద్ది’ హంగామా.. రెహమాన్ టీం లైవ్ పెర్ఫార్మెన్స్!

కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా ఎమోషన్స్, లవ్ మరియు బ్యాంక్ రాబరీ బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకుని ఆడియన్స్‌కు ఒక సీట్ ఎడ్జ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించడంలో విఘ్నేష్ రాజా సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఈ సినిమాలో సీనియర్ డైరెక్టర్ కే.ఎస్. రవికుమార్, పృథ్వీరాజన్ మరియు ‘పోరుతొజిల్’ ఫేమ్ జయరామ్ కీలక పాత్రల్లో నటించి సినిమాని మరో లెవల్ కి తీసికెళ్లారు.

కథ విషయానికి వస్తే

కర కథ విషయానికి వస్తే కరస్వామి అలియాస్ కర (ధనుష్) ఒక ప్రొఫెషనల్ దొంగ. ఎన్నో నేరాలు చేసినప్పటికీ, తాను ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న మల్లి (మమితా బైజు) కోసం ఆ నేర జీవితాన్ని పూర్తిగా వదిలేయాలని నిర్ణయించుకుంటాడు. భార్యతో కలిసి ఒక కొత్త హోటల్ పెట్టి, బుద్ధిగా కష్టపడి బతకాలని కలలు కంటాడు. ఆ హోటల్ బిజినెస్ పెట్టుబడి కోసం తన ఊరిలో ఉన్న పొలం కాగితాలను బ్యాంకులో తాకట్టు పెట్టాలని ప్లాన్ చేస్తాడు. ఆ పట్టా కాగితాల కోసమే ఎన్నో ఏళ్లుగా దూరంగా ఉంటున్న తన తండ్రి (కేఎస్ రవికుమార్) దగ్గరకు వెళ్తాడు. కానీ, అక్కడే సీన్ పూర్తిగా రివర్స్ అవుతుంది. ఊహించని కొన్ని ఘోర పరిణామాల వల్ల కర తన కళ్ల ముందే తండ్రిని కోల్పోవాల్సి వస్తుంది.

also read :‘ఫోన్ చేసి కనీసం కారణం కూడా చెప్పలేదు’.. టాలీవుడ్ తెరవెనుక రాజకీయాలను నడిరోడ్డుపై పెట్టిన అనసూయ!

అసలు కర తన తండ్రికి ఎందుకు అన్ని ఏళ్లు దూరంగా ఉన్నాడు? ముత్తు సెల్వన్ అనే వ్యక్తి నడుపుతున్న బ్యాంకులను మాత్రమే అతను ఎందుకు టార్గెట్ చేశాడు? తండ్రి మరణానికి వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? చివరికి తన భార్య మల్లికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుని హోటల్ పెట్టగలిగాడా లేదా? అనే ఇంటరెస్టింగ్ క్వశ్చన్స్ కి సమాధానమే ఈ సినిమా.

డిజిటల్ లో ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో 

ధనుష్ తన మార్క్ యాక్టింగ్ మరియు యాక్షన్ సీక్వెన్స్‌లతో వన్ మ్యాన్ షో చేయగా, ‘ప్రేమలు’ సినిమాతో సౌత్ ఇండియాలోనే క్రేజీ లవర్ గర్ల్‌గా మారిన మమితా బైజు ఈ చిత్రంలో మల్లి పాత్రలో ఒదిగిపోయిందనే చెప్పాలి. వీరిద్దరి మధ్య వచ్చే లవ్ అండ్ ఎమోషనల్ సీన్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.

ఇక ధనుష్ కెరీర్‌లో ‘అసురన్’, ‘రాయన్’ వంటి పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాల తర్వాత, మళ్లీ ఆ స్థాయి ఇంటెన్సిటీ ఉన్న పాత్రలో కరస్వామిగా కనిపించి మెప్పించాడు . జివి ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరియు సాంగ్స్ ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాయి.మరి థియేటర్ లో పర్లేదనిపించిన ఈ సినిమా డిజిటల్ లో ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×