Anasuya Emotional : అనసూయ భరద్వాజ్..జబర్దస్త్’ తో ప్రతి తెలుగింటికి దగ్గరైన ఈ వెటరన్ బ్యూటీ ఇండస్ట్రీలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో కళ్ళకి కట్టినట్టు చెప్పుకొచ్చింది. యస్ ..‘రంగమ్మత్త’గా ఇండస్ట్రీలో మాంచి క్రేజ్ తెచ్చుకున్నఅనసూయ భరద్వాజ్ తన కెరీర్ ఆరంభంలో ఎదురైన ఒక అత్యంత బాధాకరమైన, అవమానకరమైన సంఘటనను గుర్తుచేసుకుని లైవ్ లోనే కన్నీటిపర్యంతమైంది.
తెర వెనుక ఒక పెద్ద కుట్ర
టాలీవుడ్‌లో అనసూయ ప్రస్థానం ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది. 2016లో వచ్చిన ‘క్షణం’, అలాగే నాగార్జున సరసన నటించిన ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రాలు నటిగా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. ఇక 2018లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ఇండస్ట్రీ హిట్ ‘రంగస్థలం’ మూవీలో ఆమె పోషించిన రంగమ్మత్త క్యారెక్టర్ అనసూయ రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. ఆ క్రేజ్‌తో టాలీవుడ్‌లో మోస్ట్ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన తరుణంలోనే తెర వెనుక ఒక పెద్ద కుట్ర జరిగింది. ఒకానొక దశలో టాలీవుడ్‌కు చెందిన ముగ్గురు అగ్ర దర్శకులు, నిర్మాతలు తమ భారీ ప్రాజెక్టుల్లో లీడ్ రోల్స్ కోసం అనసూయను ఫైనలైజ్ చేశారు. అగ్రిమెంట్లు, డేట్ల సర్దుబాటు కూడా దాదాపు పూర్తయ్యాయి.
also read :చీర చొక్కా చిక్కెడిపోవాల్సిందే.. ‘పెద్ది’ నుంచి ఊర నాటు ఐటెం సాంగ్ ప్రోమో అవుట్!
భర్త శశాంక్ భరద్వాజ్ దగ్గర కూర్చొని చిన్నపిల్లలా
తీరా షూటింగ్స్ ప్రారంభం అవుతాయనగా, అనసూయకు ఎలాంటి ఫోన్ కాల్స్ కానీ, వివరణ కానీ ఇవ్వకుండా ఆ మూడు పెద్ద సినిమాల నుండి ఆమెను అర్ధాంతరంగా తొలగించారు. ఇండస్ట్రీలో నెపోటిజం లేదా ఇన్‌ఫ్లుయెన్స్ కారణంగా తనను పక్కన పెట్టారని తెలిసి ఆమె షాక్‌కు గురయింది. అసలు తనను ఎందుకు తొలగించాల్సి వచ్చిందనే కనీస కారణాన్ని కూడా సదరు మేకర్స్ చెప్పకపోవడం ఆమెను మానసికంగా కుంగదీసింది. ఆ చేదు జ్ఞాపకాన్ని గుర్తుచేసుకుంటూ, ఆ సినిమాల నుండి తనను తీసేశారని తెలిసిన రోజు రాత్రి తాను అస్సలు తట్టుకోలేకపోయానని, ఆ అన్యాయాన్ని జీర్ణించుకోవడం తన వల్ల కాలేదని అనసూయ కళ్లనీళ్లు పెట్టుకుంది. అర్థరాత్రి రెండు గంటల సమయంలో తన భర్త శశాంక్ భరద్వాజ్ దగ్గర కూర్చొని ఒక చిన్నపిల్లలా వెక్కి వెక్కి ఏడ్చేశానని, ఆ క్లిష్ట సమయంలో భర్త ఇచ్చిన మానసిక ధైర్యం, సపోర్ట్ వల్లే తాను మళ్లీ కోలుకుని నిలబడగలిగానని ఎమోషనల్ అయింది.
ట్రోలింగ్ అనసూయ కెరీర్‌లో రొటీన్
విజయాలతో పాటు వివాదాలు, సోషల్ మీడియా ట్రోలింగ్ కూడా అనసూయ కెరీర్‌లో రొటీన్ గా మారిపోయాయి. ముఖ్యంగా విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ సినిమా సమయం నుండి నేటి వరకు ఏదో ఒక ఇష్యూలో ఆమె ట్రోలర్స్‌కు టార్గెట్ అవుతూనే ఉన్నారు. తన వ్యక్తిగత అలవాట్లపై నెటిజన్లు చేసే అసభ్యకర విమర్శలపై కూడా ఆమె ఈ ఇంటర్వ్యూలో చాలా ఓపెన్‌గా, స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా రియాక్ట్ అయ్యారు. తాను అప్పుడప్పుడు పబ్లిక్ పార్టీల్లో లేదా పర్సనల్ స్పేస్‌లో లిమిటెడ్‌గా డ్రింక్ (మద్యం) చేస్తానని, అయితే అది పూర్తిగా తన వ్యక్తిగత విషయమని స్పష్టం చేశారు. ఆ విషయాన్ని కూడా కొందరు సంస్కృతి, సాంప్రదాయాల పేరుతో పెద్ద వివాదంగా మార్చి సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారని ఆమె అసహనం వ్యక్తం చేశారు.
also read :పెద్ది’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ గా బాలయ్య ?
ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్
ఒక వైపు పుష్ప, పుష్ప 2 వంటి పాన్ ఇండియా సినిమాలతో గ్లోబల్ రేంజ్‌లో దూసుకుపోతున్నా, మరోవైపు ఇలాంటి బాడీ షేమింగ్, పర్సనల్ లైఫ్ ట్రోలింగ్స్ రావడం బాధాకరమని వాపోయింది. అయితే ఇప్పుడు ఇలాంటి నెగెటివిటీని తాను అస్సలు పట్టించుకోవడం లేదని, కాలక్రమంలో ఈ ఇండస్ట్రీలో ఎలా బతకాలో, ఇలాంటి వారిని ఎలా ఎదుర్కొని ముక్కుసూటిగా సమాధానం చెప్పాలో నేర్చుకున్నానని ఆమె తేల్చి చెప్పింది. తన చుట్టూ ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, జీవితంలో మరింత ఎత్తుకు ఎదుగుతానని అనసూయ భరద్వాజ్ ఎంతో ధైర్యంగా వెల్లడించింది . భర్త, పిల్లల సపోర్ట్‌తో తన కెరీర్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న అనసూయ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.