E-Paper
Advertisement

పెద్ద సినిమాలదే పెత్తనమా? చిన్న సినిమాల గోడు పట్టదా?

పెద్ద సినిమాలదే పెత్తనమా? చిన్న సినిమాల గోడు పట్టదా?
Advertisement

Dheeraj Mogilineni:టాలీవుడ్‌లో చిన్న సినిమాల నిర్మాతల కష్టాలపై మరోసారి డిస్కషన్ మొదలైంది. పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ మారితే చిన్న సినిమాల పరిస్థితి ఏంటి? ముందే డేట్ ఫిక్స్ చేసుకుని, ప్రమోషన్ల కోసం లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత మళ్లీ డేట్ మార్చుకోవాల్సి వస్తే ఆ నష్టం ఎవరు భరించాలి? అంటూ నిర్మాత ధీరజ్ మొగిలినేని చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయాయి.ఇండస్ట్రీలో పెద్ద సినిమాల నిర్మాతలు తమ సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు కానీ, చిన్న సినిమాల సమస్యలను కూడా పట్టించుకోవాలంటూ తన మనసులోని మాటని ఇలా బయటపెట్టారు.

పెద్ద సినిమాల గురించే మాట్లాడుకుంటారా.. చిన్న సినిమాలు కనిపించవా?

Advertisement

టాలీవుడ్‌లో పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో నిర్మాతలు ఒకరితో ఒకరు మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకుంటుంటారని, కానీ అదే సమయంలో చిన్న సినిమాల పరిస్థితిని కూడా ఆలోచించాలని అన్నారు.పెద్ద సినిమా వాయిదా పడితే, ఆ డేట్ కోసం ఎదురుచూస్తున్న చిన్న సినిమాల ప్లానింగ్ మొత్తం మారిపోయి చిన్న నిర్మాతలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

డేట్ మారితే మా పరిస్థితి ఏంటి?

Advertisement

నిజానికి చిన్న సినిమాలకు రిలీజ్ డేట్ అంటే చాలా ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.చిన్న సినిమాలు కావడం వల్ల సినిమాని వీలైనంత త్వరగా ఆడియన్స్ లోకి తీసికెళ్లాలని ప్రమోషన్స్ ని చాలా ముందునుండే ప్లాన్ చేస్తారు మేకర్స్.కానీ ఊహించని విధంగా రిలీజ్ డేట్ ఏమైనా మారితే మాత్రం ఆ చిన్న సినిమాలు ఎంతగా ఇబ్బంది పడతాయో చెప్పక్కర్లేదు.ఇప్పటికే మెట్రో పిల్లర్లపై యాడ్స్, ఆటో యాడ్స్, టీవీ యాడ్స్ అంటూ ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఉంటారు. పొరబాటున డేట్ మారితే అంతే సంగతి ..మళ్ళీ మొదటి నుండి ఖర్చుపెట్టి ప్రమోషన్స్ చేయాల్సిందే.

పెద్ద సినిమాలకు ఒక లెక్క.. చిన్న సినిమాలకు మరో లెక్కా?

ఇదే విషయాన్ని చెబుతూ పెద్ద సినిమాల విడుదల తేదీల గురించి ప్రొడ్యూసర్స్ ముందే మాట్లాడుకుని ఒక అండర్ స్టాండింగ్ కి వస్తున్నారు కదా ,అదే విధంగా చిన్న సినిమాల గురించి కూడా ఆలోచించాలి కదా అంటూ క్వశ్చన్ రైజ్ చేశాడు దీరజ్ మొగిలినేని. ఒక సినిమా పోస్ట్ పోన్ అయితే దాని ఇంపాక్ట్ మరో సినిమాపై పడుతుందని,అందుకే రిలీజ్ డేట్ విషయంలో అంతా ఒక క్లారిటీకి రావాలని,ఈ క్రమంలో చిన్న సినిమాల గోడుని కూడా వినాలని చెప్పుకొచ్చారు.

నిర్మాతల ఐక్యత పెద్ద సినిమాలకేనా?

చిన్న సినిమాల నిర్మాతలు కూడా ఎంతో కష్టపడి సినిమాలు తీస్తారని, తమ దగ్గరున్న బడ్జెట్‌తోనే ప్రమోషన్లు చేసుకుంటారని,అలాంటప్పుడు రిలీజ్ డేట్స్ విషయంలో ఎదురయ్యే ప్రాబ్లంస్ కి పరిష్కారం చూపించడంలో ఇండస్ట్రీ పెద్దలు కూడా సహకరించాలన్నది దీరజ్ మొగిలినేని వాదన.

ఫిల్మ్ ఛాంబర్, గిల్డ్ ఏం చేస్తున్నాయి?

రిలీజ్ డేట్స్ విషయంలో సమస్యలు రాకుండా చూడటానికి నిర్మాతల గిల్డ్, ఫిల్మ్ ఛాంబర్ వంటి సంస్థలు మరింత కలుగాజేసుకోవాల్సిన అవసరం ఉందని ధీరజ్ తెలిపారు.చూడాలి మరి చిన్న సినిమా బతకాలని వాయిస్ రైజ్ చేస్తున్న ధీరజ్ మొగిలినేనికి పెద్దల నుండి ఎలాంటి సపోర్ట్ లభిస్తుందో !

ALSO READ :గురూజీ మార్క్ కనిపించడం లేదే.. ఆదర్శ కుటుంబం విషయంలో ఏమైంది?

Tags

Related News

అవును నేను పెళ్లి చేసుకుంటున్నాను.. పెళ్లి వార్తలపై తేజ సజ్జ క్లారిటీ!

గురూజీ మార్క్ కనిపించడం లేదే.. ఆదర్శ కుటుంబం విషయంలో ఏమైంది?

ఆదర్శ కుటుంబం ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్… స్పెషల్ పోస్టర్ రిలీజ్!

ఆరు ముఖాలు కలిగిన బొమ్మ..గాడ్ ఆఫ్ వార్ పై త్రివిక్రమ్ అప్డేట్!

చొక్కా నలగకుండా 500 కోట్లు.. జైలర్ 2 పై అల్లు అర్జున్ పోస్ట్!

బిజినెస్ లో సమంత దూకుడు.. 8 నెలల్లోనే రూ. 120 కోట్ల లాభాలు..పోస్ట్ వైరల్!

ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండను ఇష్టపడే హీరో అతనేనా? అర్ధరాత్రి ఫోన్ చేసి మరీ!

Big Stories

Advertisement
×