E-Paper
Advertisement

అవును నేను పెళ్లి చేసుకుంటున్నాను.. పెళ్లి వార్తలపై తేజ సజ్జ క్లారిటీ!

అవును నేను పెళ్లి చేసుకుంటున్నాను..  పెళ్లి వార్తలపై తేజ సజ్జ క్లారిటీ!
Advertisement

Teja Sajja Wedding: టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లి భాగాలు మోగబోతున్నాయి అంటూ గత కొద్ది రోజులుగా టాలీవుడ్ హీరోల పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్న వారిలో తేజ సజ్జ(Teja Sajja) ఒకరు. బాల నటుడుగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో స్టార్ హీరోల కొడుకు పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన తేజ సజ్జ అనంతరం హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో తేజ సజ్జ పెళ్లి..

ఇలా కెరియర్ పరంగా బిజీగా ఉన్న తేజ సజ్జ పెళ్లికి (Teja Sajja Wedding)సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి ఈయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని పెళ్లి చేసుకోబోతున్నారని నవంబర్లో నిశ్చితార్థం డిసెంబర్లో ఉదయపూర్ లో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఇలా తేజ సజ్జ పెళ్లికి సంబంధించి ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అంటూ అభిమానులు సందేహాలను వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఈ పెళ్లి వార్తలపై తేజ సజ్జ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.

రాజస్థాన్ లో తేజ సజ్జ వివాహం..

Advertisement

ఈ నేపథ్యంలోనే ఈయన తన పెళ్లి వార్తల పట్ల స్పందిస్తూ.. తాను పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ వస్తున్న వార్తలు నిజమేనని తాను పెళ్లి చేసుకోబోతున్నానని తెలిపారు. ఇక పెళ్లి చేసుకోబోయే అమ్మాయిది బిజినెస్ ఫ్యామిలీ.. సినిమా ఇండస్ట్రీకి వారి కుటుంబానికి ఏ మాత్రం సంబంధం లేదని తెలిపారు. ఆమె యుఎస్ లో పెరిగారు. ఈ వివాహాన్ని మా పెద్దలు కుదిర్చిన వివాహం అని తేజ క్లారిటీ ఇచ్చారు. ఇక పెళ్లికి సంబంధించిన వివరాలను కూడా ఈయన తెలియజేస్తూ..నవంబర్ నెలలో తన ఎంగేజ్మెంట్ జరగబోతుందని, డిసెంబర్ నెలలో పెళ్లి రాజస్థాన్లో జరగబోతుందని తెలియజేశారు.

వ్యక్తిగత విషయాలు గోప్యంగా..

ఇక ఈ పెళ్లి వేడుకలలో భాగంగా అతి కొద్ది మంది సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో జరగబోతుందని అందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. అయితే తేజ చేసుకోబోయే అమ్మాయి పేరు ఏంటి? తన ఫ్యామిలీకి సంబంధించిన వివరాలను మాత్రం ఎక్కడ వెల్లడించలేదు.దీంతో తేజ సజ్జ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు అంటూ అభిమానులు ఆత్రుత కనబరుస్తున్నారు. ఇక ఈయన మాత్రం తన వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవడానికి ఇష్టం ఉండదని అందుకే తన విషయాలను చాలా గోప్యంగా ఉంచబోతున్నానని, పెళ్లి విషయంలో కూడా ఇదే జరుగుతుందని తెలిపారు. ఇక తేజ సజ్జ ప్రస్తుతం ది ట్రైటర్స్ రియాలిటీ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రియాలిటీ షో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతుంది.

Advertisement

Also Read: ఆదర్శ కుటుంబం ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్… స్పెషల్ పోస్టర్ రిలీజ్!

Related News

పెద్ద సినిమాలదే పెత్తనమా? చిన్న సినిమాల గోడు పట్టదా?

గురూజీ మార్క్ కనిపించడం లేదే.. ఆదర్శ కుటుంబం విషయంలో ఏమైంది?

ఆదర్శ కుటుంబం ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్… స్పెషల్ పోస్టర్ రిలీజ్!

ఆరు ముఖాలు కలిగిన బొమ్మ..గాడ్ ఆఫ్ వార్ పై త్రివిక్రమ్ అప్డేట్!

చొక్కా నలగకుండా 500 కోట్లు.. జైలర్ 2 పై అల్లు అర్జున్ పోస్ట్!

బిజినెస్ లో సమంత దూకుడు.. 8 నెలల్లోనే రూ. 120 కోట్ల లాభాలు..పోస్ట్ వైరల్!

ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండను ఇష్టపడే హీరో అతనేనా? అర్ధరాత్రి ఫోన్ చేసి మరీ!

Big Stories

Advertisement
×