E-Paper
Advertisement

Coolie vs War 2 : కూలీ, వార్ 2 సినిమాలను గజగజ వణికిస్తున్న చిన్న సినిమా… అవేం బుకింగ్స్ రా అయ్యా..

Coolie vs War 2 : కూలీ, వార్ 2 సినిమాలను గజగజ వణికిస్తున్న చిన్న సినిమా… అవేం బుకింగ్స్ రా అయ్యా..
Advertisement

Coolie vs War 2 : ప్రస్తుతం సినీ ప్రేమికుల ఎదురుచూపులు కూలీ, అలాగే బాలీవుడ్ లో ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2 సినిమాలు కోసమే.. భారీ బడ్జెట్ తో తెరకెక్కడంతో పాటుగా స్టార్ హీరోలు నటించడంతో ఈ సినిమాల పై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. ఈ సినిమాలను ఎప్పుడెప్పుడు థియేటర్లో చూస్తామని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.. రజినీకాంత్, ఎన్టీఆర్ సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అభిమానులు సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ రెండు సినిమాల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుందని అందరు అనుకున్నారు. కానీ ఈ రెండు సినిమాలను భయపెట్టి మరో సినిమా ఉంది.. ఆ సినిమా బుకింగ్స్ ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతుంది..

Also Read : ఆర్. నారాయణమూర్తిని ఎంత పెట్టినా కొనలేం.. త్రివిక్రమ్ మాటకు అంతా షాక్..

Advertisement

కూలీ, వార్ 2 సినిమాలను భయపెడుతున్న సినిమా.. 

కూలీ, వార్ 2 సినిమాలు భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్నాయి.. వీటిని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. నిన్నటివరకు ఈ సినిమాల మధ్య గట్టిగానే ఉందని అనుకున్నారు. కానీ ఇప్పుడు రెండు మరో సినిమా భయపెడుతుంది. అయితే ఇదేమి స్టార్ హీరోల సినిమా అయితే కాదు. అందులోనూ కొత్తగా తెరకెక్కిన సినిమా అంతకన్నా కాదు. బెంగాల్‌లో ఈ రెండు సినిమాలకు అంతంత మాత్రమే క్రేజ్ ఉంది. కానీ, అక్కడ రిలీజ్ అవుతున్న ఓ చిన్న సినిమా ధూమ్ కేతు టికెట్ బుకింగ్స్‌లో దూసుకుపోతుంది. రెండు పెద్ద సినిమాలను పక్కకు నెట్టి ఈ మూవీ బుకింగ్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నాయి. పదేళ్ల తర్వాత థియేటర్లలోకి రాబోతుంది. 2017లో పూర్తి చేసుకుంది. అయితే, కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ కాలేదు. ఇక ఇప్పటికి ఈ సినిమానున రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ రెండు సినిమాలకు ఈ బెంగాలీ సినిమా ఎలాంటి పోటీని ఇస్తుందో చూడాలి..

Advertisement

కూలీ vs వార్ 2.. 

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, తెలుగు స్టార్ హీరో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న కూలీ సినిమాకు లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ మూవీలో ఇండస్ట్రీలోని స్టార్ నటులు నటిస్తుండడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అందులోనూ ఇప్పటివరకు రిలీజ్ అయిన అప్డేట్స్ కూడా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. మరి ఆగస్టు 14న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తుంది..

వార్ 2..

గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో నటించిన మొదటి సినిమా ఈ వార్ 2.. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ ని ఎప్పుడెప్పుడు చూస్తామని అటు నందమూరి అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎన్టీఆర్ నటన ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తి కనబరిస్తున్నారు.. మొత్తానికి ఈ రెండు సినిమా ల మధ్య టఫ్ వార్ నడుస్తుంది. ఫైనల్ విన్నర్ ఎవరో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాలి.

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×