Trivikram Srinivas: టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ యాక్టర్ ఆర్ నారాయణమూర్తి గురించి ప్రత్యేకంగా పరిచయాల అవసరం లేదు. గతంలో ఆయన నటించిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.. తెలంగాణ గొప్పతనాన్ని పెంపొందించేలా ఆయన చేసిన సినిమాలన్నీ కూడా ప్రేక్షకుల మనసుని కట్టిపడేసాయి.. ఈమధ్య దర్శకుడిగా నిర్మాతగా పలు సినిమాలకు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈయన యూనివర్సిటీ పేపర్ లీక్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ గురించి త్రివిక్రమ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
‘యూనివర్షిటి పేపర్ లీక్’ పై త్రివిక్రమ్ ప్రశంసలు..
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమా ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో నారాయణ మూర్తిది సుదీర్ఘ ప్రయాణం. ఆయన వన్‌మ్యాన్ ఆర్మీ. ఆయన చిత్రాల్లో రాజు ఆయనే, సైన్యాధిపతి ఆయనే. కథాలోచన నుంచి సినిమాని ప్రేక్షకుడి వద్దకు తీసుకెళ్లేవరకూ ఒక్కరే ప్రయత్నిస్తారు.. ఇప్పటివరకు ఆయన తీసిన సినిమాలలో ఏదో ఒక ప్రయోజనం ప్రజలకు చేరాలి అన్న ఉద్దేశంతోనే చేస్తున్నాడు అని త్రివిక్రమ్ అన్నారు.. అణిచివేతని ఎదిరించే ధైర్యం ఉన్న వ్యక్తి నారాయణమూర్తి అని ఆయనపై పొగడ్తల వర్షం కురింపించారు.. రెండు గంటల సినిమాని చూస్తూ ఉంటే ఏదో కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్లు ఉంది అని త్రివిక్రమ్ సినిమా యూనిట్ పై ప్రశంసలు కురిపించాడు.
నారాయణ మూర్తిని డబ్బుతో కొనలేం..
ఈ మూవీ కోసం నిజాయితీగా పనిచేశారు.. సక్సెస్ అవుతుందని త్రివిక్రమ్ అన్నారు. అనంతరం ఆయన.. రాజీపడకుండా బతకడం అందరికీ సాధ్యం కాదు. నేను చాలా సార్లు రాజీపడ్డా. ఓ సినిమాలోని పాత్రకు నారాయణ మూర్తిని అనుకున్నా.. ఈయనను రెమ్యూనరేషన్ తో కొనలేము ని త్రివిక్రమ్ అన్నారు. ఒక శక్తి అని త్రివిక్రమ్ అన్నారు. అనంతరం నారాయణ మూర్తి మాట్లాడుతూ…నాకు, త్రివిక్రమ్‌కు మధ్య ఎలాంటి ఆబ్లిగేషన్స్ లేవు. నా పట్ల, సినిమా పట్ల ఆయనకు అభిమానం ఉంది. ‘యూనివర్సిటీ పేపర్ లీక్’ సినిమాని చూసి, దాన్ని ప్రేక్షకులకు చేరువయ్యేలా చేయాలని కోరా. నా విజ్ఞప్తిని మన్నించి, సినిమాని చూసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.. అని పేర్కొన్నారు. ఇప్పటివరకు పాజిటివ్ టాక్ ని అందుకున్న ఈ మూవీ ఈ నెల 22న థియేటర్లలోకి రాబోతుంది.. త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్లు ఈ సినిమాకి రివ్యూ ఇవ్వడంతో సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరిగాయి. మరి థియేటర్ లోకి వచ్చిన తర్వాత ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి…
Also Read: దీపికా ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. మరో మూవీ అవుట్..
త్రివిక్రమ్ సినిమాలు..
టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గత ఏడాది మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమాని తెరకెక్కించారు. ఈ మూవీ యావరేజ్ గా అయినా కూడా కలెక్షన్ పరంగా బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ తో సినిమా చేయబోతున్నారు. ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ తోనూ, ఎన్టీఆర్ తోను సినిమాలు చేసే అవకాశం ఉంది..