Nita Ambani New Audi Car: భారతీయ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. వాళ్లు తినే తిండి, ఉండే ఇళ్లు, ప్రయాణించే వాహనాలు అన్నీ లగ్జరీగానే ఉంటాయి. ఇండియాలోనే అత్యంత విలాసవంతమైన అంటిలియా భవంతిలో నివాసం ఉంటారు. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన కార్లలో ప్రయాణం చేస్తుంటారు. ఇప్పటికే వారి గ్యారేజీలో ఎన్నో ప్రత్యేకమైన కార్లు ఉన్నాయి. తాజాగా వాటికి తోడు మరో లగ్జరీ కారు వచ్చి చేరింది. ఈ కారు ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే! దీని ధర అక్షరారా రూ. 100 కోట్లు.
ఇష్టపడి కొనుగోలు చేసిన నీతా అంబానీ
అత్యంత విలాసవంతమైన, అరుదైన ఈ కారును నీతా అంబానీ ఎంతో ఇష్టపడి కొనుగోలు చేసింది. ఆడి కంపెనీకి చెందిన A9 క్యామెలియాన్ కారును సొంతం చేసుకుంది. పలు వార్తా పత్రికలు ఈ విషయాన్ని వెల్లడించాయి. అటు ఆడి కంపెనీ గానీ, ఇటు అంబానీ ఫ్యామిలీ గానీ, ఈ కారు కొనుగోలుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం నీతా అంబానీ ఈ కారు కొనుగోలు చేసిందంటూ వార్తలు వెల్లువెత్తుతున్నాయి.
ఏంటీ ఆడి ఏ9 క్యామెలియాన్ ప్రత్యేకతలు?
ఆడి ఏ9 క్యామెలియాన్ కారు ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంది. ఈ కారు రంగులు మార్చే టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఏ కలర్ కావాలంటే ఆ రంగులోకి మార్చుకునే అవకాశం ఉంటుంది. అంటే, అకేషన్ కు తగినట్లుగా రంగులు మార్చుకునే అవకాశం ఉందన్నమాట. ఈ మోడల్ కార్లు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 11 మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. అంటే, ప్రపంచ ప్రఖ్యాత కుటుంబాల దగ్గర మాత్రమే ఈ కారు ఉందన్నమాట.
3.5 సెకెన్లలో 100 కిలో మీటర్ల వేగం
ఇక ఆడి ఏ9 క్యామెలియాన్ కారు సింగిల్ పీస్ విండ్ స్క్రీన్, రూఫ్ కలిగి ఉంటుంది. అంతేకాదు, కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఐదు మీటర్ల పొడవున్న ఈ కారు రెండు డోర్స్ మాత్రమే కలిగి ఉంటుంది. ఇది 4.0 లీటర్ వీ8 ఇంజిన్ ద్వారా 600 హార్స్ పవర్ శక్తిని పొందుతుంది. జస్ట్ 3.5 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగాన్ని అందుకుంది. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 250 కిలో మీటర్లు.
ఇప్పటికే పలు విలాసవంతమైన కార్లు
ఇక ముఖేష్ సతీమణి నీతా అంబానీ ఇప్పటికే పలు లగ్జరీ కార్డు వాడుతున్నారు. రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII ఈడబ్ల్యుబీ, మెర్సిడెస్ మేబాచ్ ఎస్600 గార్డ్, ఫెరారీ 812 సూపర్ ఫాస్ట్, బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్, రోల్స్ రాయిస్ కల్లినన్, బీఎండబ్ల్యు 7 సిరీస్ 760ఎల్ఐ లాంటి కార్లను కలిగి ఉంది. ఇప్పుడు వాటితో పాటు ఆడి ఏ9 క్యామెలియాన్ జత కూడింది.
Read Also: గూగుల్ స్ట్రీట్ వ్యూలో వృద్థ జంట.. పదేళ్ల జీవితం కళ్ల ముందు.. గుండె బరువెక్కడం ఖాయం!