Kerala Crime: కేరళలో మతమార్పిడి పేరుతో జరుగుతున్న వేధింపులు మళ్లీ ఒక ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. కోతమంగళం ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల సోనా అనే యువతి, ప్రేమ పేరుతో దగ్గరైన రామీజ్ అనే యువకుడు మతమార్పిడికి ఒత్తిడి చేయడంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన లవ్ జిహాద్ ఆరోపణలను మరోసారి తెరపైకి తెచ్చింది. ఎక్కడ చూసినా మతమార్పిడి బలవంతం వల్ల యువతులు తీవ్ర మనోవేదనకు గురై, చివరికి ప్రాణాలు తీసుకుంటున్న పరిస్థితి సమాజాన్ని ఆలోచింపజేస్తోంది. ఇలాంటి విషాదాలు మళ్లీ జరగకుండా సమాజం ఎలా జాగ్రత్త పడాలో ఈ కథనం మనకు సూచన ఇస్తోంది.
సోనా టీచర్ ట్రైనింగ్ కోర్సు చదువుకుంటుండగా రామీజ్‌తో ప్రేమలో పడింది. రామీజ్ గత నెలలో మత మార్పిడి లేకుండా వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చాడు. సోనాను తన ఇంటికి తీసుకుని వెళ్లాడు. అయితే ఆ హామీని పాటించకుండా, మత మార్పిడికి ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. ఆ బాధలో సోనా ఆగస్టు 9న తన ఇంట్లో ఆత్మహత్యకు యత్నించి, ఆసుపత్రిలో మరణించింది.
సోనా మరణంతో ఈ స్టోరీలోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. సోనా రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నారు. రామీజ్, అతని కుటుంబ సభ్యులు సోనాను మత మార్పిడికి ఒత్తిడి చేశారని, ఆమెను శారీరకంగా వేధించినట్లు వివరాలు ఉన్నాయని తెలిపారు. సోనా సోదరుడు బాసిల్ చెప్పినట్లుగా, “రామీజ్ తన కుటుంబంతో మా ఇంటికి వచ్చి వివాహం కోసం మా అంగీకారం కోరారు. మేము మత మార్పిడికి అంగీకరించాము. కానీ సోనా ఆ షరతును తిరస్కరించింది. తర్వాత రామీజ్ మత మార్పిడి లేకుండా వివాహం చేయడానికి ఒప్పుకున్నాడు. కానీ ఆమె రామీజ్ ఇంటికి వెళ్లిన తర్వాత మళ్లీ మత మార్పిడికి ఒత్తిడి చేసి, దారుణంగా వేధించాడు. మా కుటుంబానికి ఈ విషయం తెలియదని సోనా సోదరుడు పోలీసులకు తెలిపారు.
కోతమంగళం పోలీసులు ప్రారంభంలో ఈ కేసును సహజ మరణంగా FIR నమోదు చేశారు. కానీ మరింత విచారణ జరుపగా అసలు విషయం బయటకు వచ్చింది. కేసులో రామీజ్ పై చార్జీ సీట్ నమోదు చేసి చర్యలకు తీసుకుంటామని పోలీసులు. పోలీస్ ఇన్‌స్పెక్టర్ బిజోయ్ పిటి చెప్పారు. FIRలో మార్పులు చేసిన తర్వాత రామీజ్ అరెస్టును రికార్డ్ చేస్తామని స్పష్టం చేశారు.
ఈ కథనం మనందరికి ఒక పాఠాన్ని ఇస్తుంది. ప్రేమలో, సంబంధాల్లో పరస్పర గౌరవం, మనస్పూర్తి అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వ్యక్తిని ఒత్తిడి చేసి బలవంతం చేయడం, శారీరక వేధింపులు చేయడం కేవలం బాధలను మాత్రమే సృష్టిస్తాయి, తీరని నష్టం చేస్తాయి. ఈ బాధాకర ఘటన ఇప్పటి యువతకు ఒక మేలుకొలుపని చెప్పవచ్చు.