E-Paper
Advertisement

రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ మానియా.. 50 డేస్.. అన్‌స్టాపబుల్ రికార్డ్స్!

రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ మానియా.. 50 డేస్.. అన్‌స్టాపబుల్ రికార్డ్స్!
Advertisement

Dhurandhar Records : పట్టుమని పది రోజులు కూడా సినిమాలు థియేటర్లలో ఉండని ఈరోజుల్లో ఒక సినిమా యాభై రోజులు పూర్తి చేసుకోవడం గొప్ప విశేషమే. ఇదిగో అలాంటి విశేషాన్ని చాలా ఈజీగా సాధించేసింది ‘ధురంధర్ 2’. రణ్‌వీర్ సింగ్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్, ఆదిత్య ధర్ స్టైలిష్ టేకింగ్‌తో వచ్చిన ‘ధురంధర్ 2: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది.ఇక మార్చి 19న రిలీజ్ అయిన ఈ స్పై థ్రిల్లర్, ఈరోజుతో సక్సెస్‌ఫుల్‌గా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఏడు వారాలు గడిచినా ఇంకా థియేటర్ల వద్ద వసూళ్ల వర్షం ఆగట్లేదంటే సినిమా ఆడియన్స్‌కి ఎంతలా కనెక్ట్ అయిందో అర్థమవుతుంది. మరి పూర్తి చేసుకున్న ఈ యాభై రోజుల్లో ఏఏ రికార్డులను మడతెట్టేసిందో చూద్దాం.

బాహుబలి 2ను దాటేసిన ధురంధర్

Advertisement

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఇప్పటివరకు ఈ సినిమా రూ.1791 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. దీంతో జక్కన్న సెట్ చేసిన ‘బాహుబలి 2’ (రూ.1788 కోట్లు) రికార్డును ఈ సినిమా బ్రేక్ చేసింది. దీంతో ఇండియన్ సినిమాల్లో ‘దంగల్’ తర్వాత వరల్డ్ వైడ్‌గా హయ్యెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన రెండో సినిమాగా ‘ధురంధర్ 2’ హిస్టరీ క్రియేట్ చేసింది.

ALSO READ: గ్రాండ్‌గా డైరెక్టర్ మెహర్ రమేష్ కుమార్తె నిశ్చితార్థం.. అల్లుడు ఎవరంటే?వైరల్ వీడియో !

Advertisement

రికార్డుల వేటలో నయా చరిత్ర

ఇక ఈ సినిమా కేవలం కలెక్షన్లలోనే కాదండోయ్… ఇండియాలో రూ.1000 కోట్ల నెట్ కలెక్షన్ సాధించిన తొలి హిందీ సినిమాగా నిలిచింది. అలాగే రిలీజ్ అయిన 6 రోజుల్లోనే రూ.500 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా, మొదటి వారంలోనే రూ.1000 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్‌ను అందుకుంది.ఇక బాలీవుడ్ స్పై థ్రిల్లర్ల విభాగంలో అత్యధిక వసూళ్లు సాధించిన నంబర్ 1 సినిమాగా నిలిచి, ఫాస్ట్‌గా కొత్త మైల్ స్టోన్స్‌ని అందుకోవడంలోనూ సరికొత్త రికార్డ్స్‌ని సెట్ చేసేసింది.

విజయానికి కారణాలు

అయితే ఈ రేంజ్‌లో రికార్డులు కొల్లగొట్టడానికి ప్రధాన కారణం దర్శకుడు ఆదిత్య ధర్ టేకింగ్ అనే చెప్పాలి. ‘ఉరి’ సినిమాతోనే తన సత్తా చాటిన ఆయన, ఇందులో యాక్షన్ సన్నివేశాలను హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించారు.ఇక రణ్‌వీర్ సింగ్ తన కెరీర్ బెస్ట్ యాక్షన్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయగా.. సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ వంటి స్టార్ కాస్ట్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్‌గా నిలిచారు. పక్కా స్క్రీన్‌ప్లే, ఊపిరి బిగబట్టే ట్విస్టులు ప్రేక్షకులను మళ్లీ మళ్లీ థియేటర్లకు వచ్చేలా చేశాయి.

50 రోజులు గడిచినా ‘ధురంధర్ 2’ జోరు చూస్తుంటే, త్వరలోనే ఇది రూ.2000 కోట్ల మార్కును కూడా టచ్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండిట్స్. మొత్తానికి ‘ధురంధర్’ సృష్టించిన ఈ రివెంజ్ బాక్సాఫీస్ వద్ద ఒక మెమరబుల్ హిట్‌గా నిలిచిపోయింది.

ALSO READ: ప్రకాష్ రాజ్‌కు టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఓపెన్ ఛాలెంజ్.. చర్చకు సిద్ధమా?

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×