E-Paper
Advertisement

బుల్లెట్ బండితో బాబుకు విడదీయని బంధం.. ఆ ర్యాలీనే చంద్రబాబును సీఎంను చేసిందా?

బుల్లెట్ బండితో బాబుకు విడదీయని బంధం.. ఆ ర్యాలీనే చంద్రబాబును సీఎంను చేసిందా?
Advertisement

Chandrababu Naidu Bullet Connection: రాయల్ సీమ గడ్డపై రాయల్ ఎన్‌ఫీల్డ్ అడుగుపెడుతున్న సంగ‌తి తెలిసిందే. బుల్లెట్ బండికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఉన్న సంబంధం చాలా మందికి తెలిసి ఉండ‌దు. ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందే బుల్లెట్ ర్యాలీతో కావడం విశేషం. ఇప్పుడు అదే రాయల్ ఎన్‌ఫీల్డ్ తయారీ యూనిట్ తిరుపతి సమీపంలోని ఏర్పేడు వద్ద కొలువుదీరనుంది. ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగం స్థల సేకరణ ప్రక్రియను వేగవంతం చేసింది. చంద్రబాబు దార్శనికతతో ప్రపంచ స్థాయి వాహన తయారీ సంస్థ చిత్తూరు జిల్లాకు రావడం పారిశ్రామిక రంగంలో సరికొత్త సంచలనంగా మారింది.

చంద్రబాబు రాజకీయ జీవితానికి బుల్లెట్ బైక్‌కు దశాబ్దాల కింద‌టి నుంచే ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. గతంలో దివంగత ప్రధాని ఇందిరా గాంధీ తిరుపతికి వచ్చినప్పుడు ఆమెకు వినూత్న రీతిలో స్వాగతం పలికారు చంద్ర‌బాబు. అప్పట్లో విద్యార్థి నాయకుడిగా ఉన్న బాబు వందలాది బుల్లెట్లతో భారీ ర్యాలీ నిర్వహించి ఇందిరా గాంధీ దృష్టిని ఆకర్షించారు. ఆ సాహసోపేతమైన ర్యాలీ ఆయనకు రాజకీయ గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇందిరా గాంధీ నేరుగా ఆయనను గుర్తించి విద్యార్థి నాయకుడి కోటాలో చంద్రగిరి అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. 1978లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి ఎమ్మెల్యేగా అడుగుపెట్టిన ఆయన అతి పిన్న వయసులోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

Advertisement

దశాబ్దాల కాలం గడిచినా చంద్రబాబుకు బుల్లెట్ బండిపై ఉన్న మక్కువ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఎక్కడైనా బుల్లెట్ కనిపిస్తే దాన్ని డ్రైవ్ చేయడానికి ఆయన ఉత్సాహం చూపిస్తారు. రాజకీయాల్లో ఎంతో ఎత్తుకు ఎదిగినా తన తొలి నాటి జ్ఞాపకాలను ఆయన గుర్తు చేసుకుంటూ ఉంటారు. తన రాజకీయ అరంగేట్రానికి వేదికైన ఆ బుల్లెట్ బ్రాండ్‌నే ఇప్పుడు తన సొంత జిల్లాకు తీసుకురావడంలో ఆయన విజయం సాధించారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ భారీ పెట్టుబడితో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయబోతోంది. దీనివల్ల స్థానిక యువతకు వేలాది సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

ఏర్పేడు ప్రాంతంలో ఈ పరిశ్రమ స్థాపన కోసం ప్రభుత్వం అవసరమైన భూములను కేటాయించే పనుల్లో నిమగ్నమైంది. చెన్నై – బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా ఈ యూనిట్ కీలకం కానుంది. రాయల్ సీమను ఆటోమొబైల్ హబ్‌గా మార్చాలన్న చంద్రబాబు ఆకాంక్షకు ఇది ఒక నిదర్శనం. గతంలో కియా మోటార్స్‌ను అనంతపురానికి తీసుకువచ్చిన ఆయన ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్‌ను తిరుపతి చెంతకు చేరుస్తున్నారు.

Advertisement

Read Also: విజయ్ సంచలన నిర్ణయం.. తాను రాజీనామా చేసిన స్థానం ఆ పార్టీకి!

Related News

విషం కక్కుతున్నారు.. వారిని అస్సలు వదిలిపెట్టం, జగన్‌కు లోకేష్ మాస్ వార్నింగ్

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ-తెలంగాణల్లో భారీ వర్షాలు, రాబోయే రెండురోజుల్లో..

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు, రికార్డు స్థాయిలో ఆదాయం

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద ప్రమాదం.. తెగిపోయిన గేటు ఇనుప రోప్

సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. అశోక్, వెంకటరాజు కస్టడీపై కోర్టు ఏం చెప్పిందంటే?

టీడీపీ పార్టీలో చేరాక తొలిసారి స్పందించిన చిన్న శ్రీను.. ఏమన్నారంటే?

బడికి పంపితే బానిస పనులా.. పిఠాపురం స్కూల్లో విద్యార్థులతో వెట్టిచాకిరీ కలకలం

బోరున ఏడ్చిన బొత్స సత్యనారాయణ.. ఈ సారి ఎందుకంటే?

Big Stories

Advertisement
×