E-Paper
Advertisement

Sharwanand: బైకర్ కోసం శర్వానంద్ అన్ని కేజీల బరువు తగ్గారా? అసలు విషయం చెప్పిన డైరెక్టర్!

Sharwanand: బైకర్ కోసం శర్వానంద్ అన్ని కేజీల బరువు తగ్గారా? అసలు విషయం చెప్పిన డైరెక్టర్!
Advertisement

Sharwanand:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ దక్కించుకున్న ప్రముఖ హీరో శర్వానంద్ (Sharwanand ) హీరోగా, మాళవిక నాయర్ (Malavika Nair) హీరోయిన్గా అభిలాష్ రెడ్డి (Abhilash Reddy) దర్శకత్వంలో స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం బైకర్ . ఏప్రిల్ మూడవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు చిత్ర బృందం. అందులో భాగంగానే దర్శకుడు అభిలాష్ రెడ్డి తాజాగా ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా గురించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. అంతేకాదు బైకర్ సినిమా కోసం శర్వానంద్ పడ్డ కష్టం గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.

శర్వానంద్ ఈ సినిమా కోసం 23 కేజీలు బరువు తగ్గారు..

అభిలాష్ రెడ్డి తాజా ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ..” బైకర్ సినిమా కోసం శర్వానంద్ చాలా కష్టపడ్డారు. ఆరు నెలల పాటు బ్రేక్ తీసుకొని అటు ఫిజికల్ గా ఇటు మెంటల్ గా ప్రిపేర్ అయ్యారు. ప్రొఫెషనల్ బైకర్ లాగా కనిపించడానికి సుమారుగా 23 కేజీల వరకూ శర్వానంద్ బరువు తగ్గారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఎన్నో ప్రమాదాలు జరిగాయి. వాటన్నింటినీ తట్టుకొని శర్వానంద్ నేడు మీ ముందుకు వస్తున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాలో ఆయన తన పాత్ర కోసం పడ్డ కష్టం వర్ణనాతీతం. ఆయన డెడికేషన్ కి ఎవరైనా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఖచ్చితంగా ఆయన ఎంత ఎఫర్ట్ పెట్టారు అనే విషయం మీకు థియేటర్లో స్పష్టం అవుతుంది.* అంటూ బైకర్ కోసం శర్వానంద్ పడ్డ కష్టాన్ని డైరెక్టర్ అభిలాష్ రెడ్డి తెలిపారు. ఇకపోతే తండ్రిగా, కోచ్ గా రాజశేఖర్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది అని తెలిపారు అభిలాష్ రెడ్డి. ప్రస్తుతం డైరెక్టర్ అభిలాష్ రెడ్డి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Advertisement

ALSO READ:Dhurandhar 2: ధురంధర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్.. ఎప్పుడు? ఎక్కడంటే?

సినిమాపై అంచనాలు పెంచేసిన డైరెక్టర్..

ఈ సినిమా గురించి అభిలాష్ రెడ్డి మాట్లాడుతూ..” బైక్ అనేది ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్. ఈ సినిమాలో రేసర్ తో పాటు అటు ఫ్యామిలీ ఎమోషన్స్, తండ్రి కొడుకుల అనుబంధం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలో కేవలం యాక్షన్ ఎపిసోడ్స్ కి 60 రోజుల సమయం పట్టింది. రియల్ రేసర్స్ తో మేము రేసింగ్ సీక్వెన్స్ తీసాము. ముఖ్యంగా ఈ సినిమా కోసం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా నుంచి గొప్ప గొప్ప రేసర్స్ ని తీసుకొచ్చాము. ఇండోనేషియాలో రేసింగ్ సీక్వెన్స్ షూటింగు చేసాము. ఇకపోతే రేసింగ్ స్పోర్ట్స్ మన ఇండియాలో ఎప్పటినుంచో ఉంది. పైగా శ్యామ్ కొఠారి అనే ఒక రేసర్ కూడా ఉన్నారు. కానీ ఆయనకి క్రికెట్లో కపిల్ దేవ్ కి వచ్చినంత గుర్తింపు రాలేదు. అందుకే రేసింగ్ కి కూడా క్రికెట్ స్థాయి గుర్తింపు రావాలనేదే నా కోరిక. ఆ కోరికను ఈ సినిమా ద్వారా మీ ముందు ఉంచాను. ఫిక్షనల్ స్టోరీ అయినప్పటికీ రేసింగ్ లో జరిగిన కొన్ని నిజమైన సంఘటనలను మేము స్పూర్తిగా తీసుకున్నాము” అంటూ సినిమాపై అంచనాలు పెంచేశారు డైరెక్టర్ అభిలాష్ రెడ్డి. మొత్తానికి అయితే భారీ అంచనాల మధ్య అటు రెబెల్ స్టార్ ప్రభాస్ మెచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Related News

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

Big Stories

Advertisement
×