Vishwambhara : టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది మనశంకర వరప్రసాద్ గారు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. సంక్రాంతి బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఇప్పుడు మరో మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంభరా మూవీలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్నాడు.. భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా కన్న ముందు ఈ సినిమా థియేటర్లలోకి రావాల్సింది.. షూటింగ్ పెండింగ్ ఉండడంతో ఈ సినిమా ఆలస్యమైంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసే పనిలో చిత్ర యూనిట్ ఉన్నారు.. దాదాపు ఈ మూవీ షూటింగ్ పూర్తి అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ మూవీ నుంచి మెగా ఫ్యాన్స్ కి డబల్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఆ అప్డేట్స్ ఏంటో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..
చిరంజీవి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విశ్వంభర మూవీ భారీ అంచనాలతో తెరకెక్కుతుంది. యువీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అందాల భామ త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.. ఈ మూవీ షూటింగ్ పూర్తికా వస్తున్న నేపథ్యంలో మూవీపై హైట్ ని పెంచేందుకు చిత్ర యూనిట్ అప్డేట్స్ని బదులు ఎందుకు రెడీ అవుతున్నారు. ముందుగా మూవీ నుంచి ఒక ట్రైలర్ అని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పవర్‌ఫుల్ ట్రైలర్‌ను విడుదల చేసి దానితో పాటే కొత్త రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించాలని ప్లాన్ చేస్తోంది.. శ్రీరామనవమి సందర్భంగా ఈ మూవీ నుంచి అప్డేట్ వస్తుందని అందరూ అనుకున్నారు కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల అప్డేట్ రాలేదు. కానీ అతి త్వరలో మూవీ నుంచి ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నట్లు టాక్.. ఈ ట్రైలర్ గనక ప్రేక్షకులను ఆకట్టుకుంటే సినిమా సూపర్ హిట్ అవుతుందని మెగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు..
Also Read :ఎన్టీఆర్ – నీల్ ‘డ్రాగన్’ మూవీ అప్డేట్.. అప్పుడే ఏడాది అయిపోయిందా..!
ఈ మూవీ నుంచి రిలీజ్ అయినా పోస్టర్స్ పై మంచి బజ్ ఏర్పడింది.. ఆ తర్వాత రిలీజ్ అయిన టీజర్ పై విమర్శలు వినిపించాయి.. టీజర్ లోని కొన్ని గ్రాఫిక్స్ సన్నివేశాల పై ట్రోల్స్ గట్టిగానే వినిపించిన విషయం వాస్తవం.. అయితే గ్రాఫిక్స్ క్వాలిటీని చూసి సోషల్ మీడియా నుంచి వచ్చిన ట్రోల్స్ ను చిత్ర బృందం సీరియస్గా తీసుకుంది. అప్పటినుంచి గ్రాఫిక్స్ టీం మొత్తాన్ని మార్చేసి కొత్త గ్రాఫిక్స్ కంపెనీకి షిఫ్ట్ అయ్యారు.. విఎఫ్ఎక్స్ షార్ట్స్ మొత్తం రీ వర్క్ చేశారు.. దీనివల్ల నిర్మాతకు రెట్టింపు ఖర్చులు అని మీడియాలో వార్తలు వినిపించాయి. ఈ చిత్రానికి దాదాపు 250 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ అయితే అందులో కేవలం గ్రాఫిక్స్ కోసమే 130 కోట్లు కేటాయించినట్లు సమాచారం.. అందులో చిరంజీవి రెమ్యూనరేషన్ కూడా 75 కోట్లు ఉండడం విశేషం.. ఈ సినిమా పూర్తిగా లోగా దగ్గర దగ్గర 400 కోట్లు అయినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు.. మరి సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.