E-Paper
Advertisement

Dhurandhar Impact: ధురంధర్‌కి అంత సీన్ ఉందా?.. పాన్ వరల్డ్ సినిమాని పరుగెట్టించిందిగా!

Dhurandhar Impact: ధురంధర్‌కి అంత సీన్ ఉందా?.. పాన్ వరల్డ్ సినిమాని పరుగెట్టించిందిగా!
Advertisement

Dhurandhar Impact: రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సృష్టించిన సంచలనం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు హాట్ టాపిక్ అయింది. అసలు అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా 1300 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టి ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసింది. ఈ భారీ విజయం ఇప్పుడు ఇతర అగ్ర హీరోల సినిమాల విడుదల తేదీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తాజాగా కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదల విషయంలో జరుగుతున్న పరిణామాలు దీనికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి.

Read also-Vijay Rashmika: పెళ్లి కానుకగా భార్యకు విజయ్ స్పెషల్ గిఫ్ట్..ఫిదా అయిన రష్మిక?

బాక్సాఫీస్ ‘ధురంధర్’ ప్రభంజనం

Advertisement

రణ్‌వీర్ సింగ్ తన కెరీర్‌లో ఎన్నడూ చూడని రీతిలో ‘ధురంధర్’ చిత్రంతో మాస్ క్రేజ్ సంపాదించుకున్నారు. సినిమా కథనం, మేకింగ్ వాల్యూస్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో, ఈ చిత్రం సైలెంట్‌గా వచ్చి వందల కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. ముఖ్యంగా మల్టీప్లెక్స్ ఆడియన్స్‌తో పాటు మాస్ సెంటర్లలోనూ ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. మొదటగా రణ్‌వీర్ ‘ధురంధర్ 2’, యష్ ‘టాక్సిక్’ ఒకే రోజున విడుదల కావాల్సి ఉంది. కానీ, ‘ధురంధర్’ మొదటి భాగం సాధించిన 1300 కోట్ల వసూళ్లు చూశాక, ‘టాక్సిక్’ టీమ్ పునరాలోచనలో పడినట్లు ఇండస్ట్రీ టాక్. ‘ధురంధర్ 2’పై ప్రస్తుతం ఉన్న అంచనాలు స్కై హైలో ఉన్నాయి. సీక్వెల్ కావడం, మొదటి భాగం బ్లాక్ బస్టర్ అవ్వడంతో ట్రేడ్ వర్గాల్లో దీనికి భారీ డిమాండ్ ఉంది. రెండు భారీ చిత్రాలు ఒకే రోజు వస్తే థియేటర్ల పంపకంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇది వసూళ్లపై ప్రభావం చూపుతుంది. యష్‌కి ‘కేజీఎఫ్’ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ‘టాక్సిక్’పై భారీ బాధ్యత ఉంది. అనవసరమైన పోటీకి వెళ్లి ఓపెనింగ్స్ తగ్గించుకోవడం ఇష్టం లేకనే చిత్ర యూనిట్ వెనక్కి తగ్గినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

Read also-Ustaad BGM: దేవీశ్రీ ప్రసాద్‌కు షాక్ ఇచ్చిన థమన్.. హరీష్ శంకర్‌కు ఆ బీజీఎమ్ నచ్చలేదా?

ధురంధర్ 2 పై అంచనాలు

Advertisement

తొలి భాగం అందించిన ఉత్సాహంతో దర్శకుడు ఆదిత్య ధర్ ‘ధురంధర్ 2’ను మరింత భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ హైప్ చూసే, యష్ తన ‘టాక్సిక్’ సినిమా విడుదల తేదీని మార్చుకుని, సోలో రిలీజ్ ద్వారా గరిష్ట వసూళ్లు సాధించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి, రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్’ మేనియా సౌత్ సినిమాల ప్లానింగ్‌ను కూడా మార్చేలా చేసిందనడంలో అతిశయోక్తి లేదు.

Related News

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఆ రూమర్స్ కు చెక్..

మమిత బైజుకు ఏమైంది..? సినిమాలకు గుడ్ బై..?

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

Big Stories

Advertisement
×