E-Paper
Advertisement

‘ధురంధర్’ ఫుల్ మూవీ రన్ టైమ్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.. రిలీజ్ ఎప్పుడంటే?

‘ధురంధర్’ ఫుల్ మూవీ రన్ టైమ్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.. రిలీజ్ ఎప్పుడంటే?
Advertisement

Dhurandhar Extended Cut: భారతీయ సినిమా చరిత్రలో ఇది ఒక అరుదైన విప్లవాత్మకమైన మార్పుగా నిలవనుంది. ‘ధురంధర్’, దాని సీక్వెల్ ‘ధురంధర్: ది రివెంజ్’ చిత్రాలను కలిపి, దర్శకుడు అనుకున్న పూర్తి స్థాయి విజన్‌ను “ఎక్స్టెండెడ్ డైరెక్టర్స్ కట్” రూపంలో విడుదల చేసేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు మూవీ టీం. దాదాపు 7 గంటల 30 నిమిషాల నిడివితో కూడిన ఈ వెర్షన్, కేవలం అంకితభావం ఉన్న సినీ ప్రేమికుల కోసం ప్రత్యేకంగా సిద్ధం చేయబడింది.

Read also-క్యాన్సర్ రహిత సమాజం దిశగా ‘అల్లు అర్జున్’ ఫ్యాన్స్ ముందడుగు.. HPV వ్యాక్సిన్ డ్రైవ్..

సెన్సార్ బోర్డు అప్రూవల్

Advertisement

సాధారణంగా సినిమాల నిడివి విషయంలో నిబంధనలు కఠినంగా ఉండే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC), ఈ భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు నేడు కొత్త సర్టిఫికేట్ జారీ అయింది. ఎటువంటి కత్తెర్లు లేని ‘అన్‌సెన్సార్డ్’ వెర్షన్ కావడంతో, దర్శకుడు చెప్పాలనుకున్న కథలోని లోతును, తీవ్రతను ప్రేక్షకులు నేరుగా వెండితెరపై అనుభవించే అవకాశం లభిస్తుంది.

ప్రీమియం స్క్రీన్లలో మాత్రమే..

ఈ చిత్రం సాధారణ థియేటర్లలో కాకుండా, కేవలం అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు కలిగిన ప్రీమియం స్క్రీన్లలో మాత్రమే విడుదల కానుంది. IMAX, EPIQ, DC, HDR స్క్రీన్లలో మాత్రమే ఈ ప్రదర్శనలు ఉంటాయి. ఏప్రిల్ 5వ తేదీ నుండి ఈ ప్రత్యేక షోలు ప్రారంభం కానున్నాయి. విడుదల విధానంలో మేకర్స్ ‘హాంగ్‌కాంగ్ మోడల్’ను అనుసరిస్తున్నారు. అంటే, వారానికి కేవలం రెండు షోలు మాత్రమే (వీకెండ్స్‌లో) ప్రదర్శించబడతాయి. సినిమా నిడివి ఎక్కువగా ఉండటంతో దీనిని ఒక ‘మూవీ మారథాన్’గా నిర్వహించనున్నారు.

Advertisement

Read also-ప్రముఖ మలయాళ దర్శకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఏం జరిగిందంటే?

సాంకేతిక మెరుగులు

ఈ వెర్షన్ కేవలం అదనపు సన్నివేశాలకే పరిమితం కాలేదు. సాంకేతికంగా కూడా ఈ చిత్రాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దారు. సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి సరికొత్త సౌండ్ మిక్సింగ్ చేశారు. పాటల్లోని గాత్రం గతంలో కంటే చాలా స్పష్టంగా వినబడేలా మార్పులు చేశారు. అయితే, పాటలను ప్రత్యేకంగా కాకుండా, కథా గమనంలో భాగంగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ తరహాలో పొందుపరిచారు. ఇది సినిమా ఫ్లోను దెబ్బతీయకుండా కథతో పాటు ప్రేక్షకుడిని తీసుకెళ్తుంది. ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్ వచ్చిన తర్వాత సుదీర్ఘమైన కథలను వెబ్ సిరీస్‌ల రూపంలో చూస్తున్నాం. కానీ, ఒక భారీ యాక్షన్ డ్రామాను 7.5 గంటల పాటు థియేటర్లో కూర్చుని చూడటం అనేది ప్రేక్షకుడి సహనానికి సినిమా పట్ల ఉన్న ప్రేమకు ఒక పరీక్ష వంటిది. ఏప్రిల్ 5న ‘ధురంధర్’ సృష్టించబోయే ఈ ప్రభంజనం కోసం సినీ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ మొత్తం సినిమా చూడాలి అంటే అయిదు వరకూ ఆగాల్సిందే.

Related News

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

Big Stories

Advertisement
×