E-Paper
Advertisement

Actor Nani: నాని సినిమా కోసం ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్..హింట్ ఇచ్చిన హీరో?

Actor Nani: నాని సినిమా కోసం ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్..హింట్ ఇచ్చిన హీరో?
Advertisement

Actor Nani: నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాని ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ హీరోగా సక్సెస్ అవ్వడమే కాకుండా నిర్మాతగా సక్సెస్ సాధించారు.. ఇక నిర్మాతగా మారి కొత్తవారికి అవకాశాలు ఇస్తూ ఎంతోమంది దర్శకులను యువ హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇలా వరుస హిట్ సినిమాలతో కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల(Sreekanth Odela) దర్శకత్వంలో ది ప్యారడైజ్ (The Paradise)అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా 2026 మేలో విడుదల కాబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత నాని తదుపరి సినిమాలకు కూడా కమిట్ అయిన సంగతి తెలిసిందే.

ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్..

నాని శ్రీకాంత్ ఓదెల సినిమా విడుదల అయిన అనంతరం ఈయన మరొక సెన్సేషనల్ డైరెక్టర్ సుజీత్(Sujeeth) డైరెక్షన్ లో బిజీ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాని అధికారికంగా ప్రకటించడమే కాకుండా పూజ కార్యక్రమాలను కూడా జరుపుకున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ పనులు ఈ ఏడాదిలోనే ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం డైరెక్టర్ సుజిత్ ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు ఈ సినిమా నటీనటుల ఎంపిక విషయంలో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది .అయితే తాజాగా ఈ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ ను కూడా ఫిక్స్ చేశారని తెలుస్తోంది. తాజాగా నాని (Nani)సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గురించి హింట్ ఇచ్చేశారు.

నాని కోసం శాశ్వత్ సచ్‌దేవ్ ..

Advertisement

నాని ఇంస్టాగ్రామ్ వేదికగా ది ప్యారడైజ్ సినిమాకు సంబంధించి కొన్ని స్టిల్స్ షేర్ చేశారు అయితే ఈ ఫోటోలకు ధురంధర్ సినిమా బిజిఎం యాడ్ చేయడంతో నాని తదుపరి సినిమా కోసం ధురంధర్ సినిమా సంగీత దర్శకుడు శాశ్వత్ సచ్‌దేవ్ (Shashwat Sachdev) రంగంలోకి దిగబోతున్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దాదాపు వీరి కాంబినేషన్ ఫిక్స్ అయిందని తెలుస్తోంది. మరి నాని సుజిత్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ శాశ్వత్ సచ్‌దేవ్ అంటూ వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలి అంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.

Advertisement

ఇక ఈ సినిమాకు డివీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అన్ని అనుకున్న విధంగా జరిగి ఉంటే ఈ ఏడాది జూన్ లేదా జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులు జరిగి ఉండేది కానీ నాని నటిస్తున్న ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా కూడా మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాని ది ప్యారడైజ్ సినిమా మార్చి 26వ తేదీ విడుదల చేసే విధంగా చిత్ర బృందం ప్రణాళికలు రచించారు కానీ షూటింగ్ ఆలస్యం అవడంతో విడుదల తేదీ నుంచి తప్పుకోబోతుందని, ఈ ఏడాది మే నెలలో విడుదల కాబోతుందంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

Also Read: Niharika: తెలియని బరువును మోస్తున్నా.. సంతోష  సమయంలో నిహారిక ఎమోషనల్ పోస్ట్!

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×