E-Paper
Advertisement

CPI vs Congress: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌, సీపీఐ తెగిన మిత్రబంధం.. స్థానిక నేతల్లో గందరగోళం!

CPI vs Congress: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌, సీపీఐ తెగిన మిత్రబంధం.. స్థానిక నేతల్లో గందరగోళం!
Advertisement

CPI vs Congress:  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్, సీపీఐకి పొత్తు కుదరలేదు. కొత్తగూడెంలో సీపీఐ డిమాండ్లకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించలేదు. ఉపసంహరణ గడువు ముగియకుండానే (2వ తేది) పొత్తు పటాపంచలైంది. కొత్తగూడెం మున్సిపాలిటీలో మొత్తం 60 డివిజన్లు ఉండగా అన్నింటిలో సీపీఐ పోటీ చేస్తోంది. ఈ సందర్భంగా అన్నీ డివిజన్‌లలో సీపీఐ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. కానీ సోమవారం నాడు ఉపసంహరించు కోవాలని సిపిఐ ఎవరినీ కోరడంలేదని సమాచారం. కొత్తగూడెం మున్సిపాలిటీలో సీపీఐ చెరి సగం డిమాండ్‌ చేయగా.. కాంగ్రెస్‌ 20 మాత్రమే ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో సీపీఐ కొత్తగూడెంలోని మొత్తం 60 డివిజన్లలోనూ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎఫెక్ట్

త్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎఫెక్ట్ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూపింది. ఇల్లందులో కూడా కాంగ్రెస్, సీపీఐ మధ్య దోస్తీ కుదరకపోవడంతో 6 వార్డుల్లో సీపీఐ నామినేషన్లు వేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలోని ఏదులాపురం మునిసిపాలిటీలో సీపీఐ ఒంటరిగా పోటీ చేస్తోంది. ఏదులాపురం మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులుండగా 15 వార్డుల్లో సీపీఐ నామినేషన్లు వేసింది. అయితే కాంగ్రెస్‌ సీపీఐ వేసిన డివిజన్లతోపాటు మొత్తం 32 వార్డుల్లో నామినేషన్లు వేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్‌, సీపీఐ వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. ఇక్కడ మొత్తం 22 వార్డులు ఉండగా పొత్తు కుదరకపోవడంతో సీపీఐ ఐదు చోట్ల నామినేషన్ వేసింది.కాంగ్రెస్‌ పార్టీ ఆ స్థానాలతోపాటు మొత్తం అన్ని చోట్ల నామినేషన్లు వేసింది. ఇన్నాళ్లు కలిసి ఉన్న సీపీఐ, కాంగ్రెస్‌ పార్టీలు మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా చెరో దారి చూసుకోవడం రాజకీయంగా సంచలనం రేపుతోంది.

Advertisement

Also Read: Smartphone Price: తగ్గనున్న స్మార్ట్‌ఫోన్ ధరలు.. బడ్జెట్ 2026లో మొబైల్స్, ఈవీ, ఎలెక్ట్రానిక్స్ కొనేవారికి గుడ్ న్యూస్

మున్సిపల్ ఎన్నికల్లో సిపిఐ సంచలన నిర్ణయం

మునిసిపల్ ఎన్నికల్లో సీపీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి, భట్టి విక్రమార్కకు వ్యతిరేకంగా.. వారి తీరుపై మండిపడుతూ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగింది. కొన్ని మున్సిపాలిటీల్లో అన్నీ స్థానాల్లో పోటీ చేస్తూ నామినేషన్లు వేసింది. సీపీఐ, కాంగ్రెస్‌ పార్టీలు మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా ఎవరిదారి వారు చూసుకోవడం రాజకీయంగా సంచలనం రేపుతోంది. కొత్తగూడెంలో సీపీఐ డిమాండ్లకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించలేదు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పుర పోరులో కాంగ్రెస్, సీపీఐకి పొత్తు కుదరలేదు. క్షేత్రస్థాయిలో సీపీఐ కి ఉన్న బలాన్ని గుర్తించకపోవడంతో మున్సిపల్‌ ఎన్నికల్లోకాంగ్రెస్ పార్టీ కి షాక్‌ ఇచ్చింది. రానున్న ఎంపిటిసి , జడ్పీటీసీ ఎన్ని కల్లో కూడా మిత్రులు గా ఉంటారా? లేదా? అనే ప్రశ్న తలెత్తుతున్నది. ఇన్నాళ్లూ మిత్రపక్షం గా ఉన్న సీపీఐ, కాంగ్రెస్ పార్టీ తో బంధాన్ని తెంచేసుకోవడం వల్ల ఈ మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీకి ఎంతోకొంత ఎదురుదెబ్బ తగులనుందా? అనే టాక్ మెదలైంది. సిపిఐ ఒంటరిగా బరిలోకి దిగింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భట్టి విక్రమార్కకు సీపీఐ ఝలక్‌ ఇచ్చినట్లయింది.

Advertisement

Also ReadMahesh Kumar Goud: బీఆర్ఎస్ అంటే బ్లాక్ మెయిల్ రాష్ట్ర సమితి.. ఫోన్ ట్యాపింగ్ ఘోరమైన నేరం.. పీసీసీ చీఫ్​ మహేష్​ కుమార్ గౌడ్ !

Related News

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

సీఎం ఛాన్స్ వస్తే.. ఆ దేవుడు కూడా ఆపలేడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ముందు.. సీఎంపై చర్యలు తీసుకోవాలి.. కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్

సెక్రటేరియట్ భద్రత అధికారులకు మంత్రి మాస్ వార్నింగ్.. మళ్లీ రిపీట్ కావొద్దంటూ ఫైర్!

ప్రత్యామ్నాయ పంటలు వేసిన రైతులకు.. తెలంగాణ సర్కార్ షాకింగ్ న్యూస్..!

కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనపై కేటీఆర్ విసుర్లు, జెన్ జీ పేరు ప్రస్తావిస్తూ..

తెలంగాణలో 1000 రోజుల పాలన.. సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ పోస్ట్, ప్రయాణంలో తోడుగా నిలిచిన..

Big Stories

Advertisement
×