E-Paper
Advertisement

Bigg Boss Suman Shetty : 7/G బృందావన కాలనీ సీక్వెల్ అప్డేట్.. రిలీజ్ డేట్ చెప్పేసిన సుమన్ శెట్టి..

Bigg Boss Suman Shetty : 7/G బృందావన కాలనీ సీక్వెల్ అప్డేట్.. రిలీజ్ డేట్ చెప్పేసిన సుమన్ శెట్టి..
Advertisement

Bigg Boss Suman Shetty : తెలుగు టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ కొత్తగా ఉంది.. 8వ సీజన్ వరకే హౌస్ లోకి కామనర్స్ ని కేవలం ఒక్కరిని మాత్రమే తీసుకున్నారు.. కానీ ఈ సీజన్ మాత్రం ఆరుగురు కామనర్స్ తో మొదలైంది.. మొదటి నుంచి ఇప్పటివరకు అన్ని భిన్నంగా సాగాయి. మరో రెండు రోజుల్లో ఫైనల్ ఎపిసోడ్ జరగనుంది. ఇక ఈ సీజన్ లో సినీ నటుడు సుమన్ శెట్టి కూడా పాల్గొన్నాడు. దాదాపు 13 వారాలు ఆయన హౌస్ లో కొనసాగారు.. 14వ వారం తక్కువ ఓటింగ్ తో అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసారు. సుమన్ శెట్టి బయటికి వచ్చిన తర్వాత నుంచి పలు యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ లిస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో 7/G బృందావన కాలనీ మూవీ సీక్వెల్ గురించి అప్డేట్ ఇచ్చారు.. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. ఆ మూవీ గురించి సుమన్ శెట్టి ఏం చెప్పారో ఒకసారి వివరంగా తెలుస్తుంది..

7/G బృందావన కాలనీ సీక్వెల్ అప్డేట్ ఇచ్చిన సుమన్ శెట్టి.. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న సినీ నటుడు సుమన్ శెట్టి 14 వ వారం ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. తాజాగా ఆయన ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బిగ్ బాస్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. హౌస్ లో ఎలా ఉంటుంది? ఎవరు విన్నర్ అయ్యే అవకాశం ఉంది అని సుమన్ శెట్టి వివరించారు.. అనంతరం ఆయన చేస్తున్న సినిమా గురించి చెప్పారు. ఆ ఇంటర్వ్యూలో 7/G బృందావన కాలనీ గురించి అడగ్గా సుమన్ శెట్టి అవునండి సీక్వెల్ రాబోతుంది అని అన్నారు. నేను మూడు నెలలు లేను కదండీ. నేను ఉన్నింటే సినిమా పూర్తి అయ్యి సంక్రాంతికి రిలీజ్ అయ్యేది అని అన్నారు. అంతేకాదు దాదాపు 70% షూటింగ్ కూడా పూర్తవడంతో త్వరలోనే మిగతా షూటింగ్ని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ఆయన క్లారిటీ ఇచ్చారు.. అయితే ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలైంది అన్న విషయం గురించి ఇప్పటివరకు బయటకు రాలేదు. అంతా సైలెంట్ గానే జరిగిపోయింది. మరి ఇప్పటికైనా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి..

7/G బృందావన కాలనీ మూవీ.. 

Advertisement

7G బృందావన్ కాలనీ 2004 లో సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ మూవీ తమిళం, తెలుగులో రెండు భాషల్లో రిలీజ్ అయ్యింది.. బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లోకి వచ్చిన ఏ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఎ. ఎం. రత్నం తనయుడు రవి కృష్ణ, సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా స్వరపరచిన ఈ మూవీలోని ఈ పాట కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఎటువంటి పనిలేకుండా, చదువుల్లో రానివ్వకుండా ఎప్పుడు ఫెయిల్ అవుతున్న ఓ యువకుడు ఉంటాడు. అతనే హీరో.. హిందీ మాట్లాడే మార్వాడీ కుటుంబం రాకతో అతని జీవితం కొత్త మలుపు తిరుగుతుంది.. ఆ తర్వాత వారిద్దరి మధ్య ప్రేమ పుడుతుంది. ప్రేమ చివరి వరకు వెళ్తుందా లేదా అన్నది ఈ సినిమా స్టోరీ.. ఇప్పుడు సీక్వెల్ కి రాబోతున్న సినిమాలో హీరో హీరోయిన్లు ఎవరన్న విషయం కూడా తెలియలేదు.. అతి త్వరలోనే ఈ సినిమా గురించి పూర్తి వివరాలను వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం..

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×