E-Paper
Advertisement

Allu Arjun: పుష్ప తరువాత నిజంగానే అల్లు అర్జున్ వ్యవహార తీరు మారిందా.. గతంలో కూడా ఇంతే.. ఇదే క్లారిటీ..!

Allu Arjun: పుష్ప తరువాత నిజంగానే అల్లు అర్జున్ వ్యవహార తీరు మారిందా.. గతంలో కూడా ఇంతే.. ఇదే క్లారిటీ..!
Advertisement

Allu Arjun: ఇటీవల సోషల్ మీడియాలో అల్లు అర్జున్ గురించి కొన్ని ఆరోపణలు వైరల్ అవుతున్నాయి. ఒక పోడ్కాస్ట్ వీడియోను ఆయన పీఆర్ టీమ్ ఒత్తిడి చేసి తొలగించిందని కొందరు ఆరోపిస్తున్నారు. ఆ వీడియోలో అల్లు అర్జున్ కలవాలంటే కొన్ని నియమాలు పాటించాలి.. ఆయన కళ్ళల్లోకి కూడా కళ్ళు పెద్ద చూడకూడదు అని ఆయన టీం చెబుతారు అని ఒక జర్నలిస్ట్ చెప్పుకొచ్చింది. స్వీకృతి అనే పోడ్కాస్టర్ చేసిన ఈ వీడియో సర్కులేట్ అయిన కొద్దిసేపటికి యూట్యూబ్ నుంచి తీసివేయబడిందని వార్తలు వచ్చాయి.

ఇదే సమయంలో అభిషేక్ కార్ పేరుతో అస్సాంలో తీసినట్టు కనిపించే ఒక క్షమాపణ వీడియో కూడా సోషల్ మీడియాలో తిరిగింది. ఆ వీడియో నకిలీదని కొందరు చెబుతున్నారు. అల్లు అర్జున్‌ పై పాజిటివ్ ఇంప్రెషన్ కోసమే ఆ వీడియోను ప్రచారం చేశారని ఆరోపణలు వినిపించాయి.

గతంలో కూడా ఇంతే..!

Advertisement

ఈ సందర్భంలో జర్నలిస్ట్ మూర్తి గతంలో చేసిన వ్యాఖ్యలు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. ఆయన ఒక సంవత్సరం క్రితం విడుదల చేసిన వీడియోలో అల్లు అర్జున్ వ్యవహార శైలి గురించి మాట్లాడారు. సోషల్ మీడియాలో ఒక హీరోపై నెగిటివ్ కామెంట్లు రావడానికి చాలా కారణాలు ఉంటాయని ఆయన అన్నారు. పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ ప్రవర్తనలో మార్పు కనిపించిందని చెప్పారు.

ఆ తరువాత ఎంతో మార్పు..

Advertisement

పుష్ప వన్ భారీ విజయాన్ని సాధించిన తర్వాత ఆయన ప్రవర్తనలో చాలా తేడ కనిపించిందని.. పుష్ప రెండో భాగం బ్లాక్ బస్టర్ అయ్యాక మరింత మారారు అని మూర్తి తెలిపారు. ముఖ్యంగా పుష్ప ప్రమోషన్ ఈవెంట్లలో అల్లు అర్జున్ మాత్రమే స్టేజిపై ఎక్కువగా హైలైట్ అయ్యేలా ప్లాన్ చేసినట్టు కనిపించిందని అన్నారు. ఆ ఈవెంట్ల వీడియోలు చూస్తే కూడా ఆయనకే ప్రధాన ప్రాధాన్యం ఇచ్చినట్టు మనం గమనించవచ్చని చెప్పారు.

అలాగే అల్లు అర్జున్ నడక తీరు, ప్రవర్తనలో కూడా మార్పు కనిపించిందని వ్యాఖ్యానించారు. ఐకాన్ స్టార్ అనే ట్యాగ్ ఆయనకు వచ్చినా, ఎవరైనా హీరో అలా ప్రవర్తించకూడదని అన్నారు. మన ఇండస్ట్రీలో మెగాస్టార్, మెగా పవర్ స్టార్, యంగ్ టైగర్, మాస్ మహారాజా వంటి ఎన్నో బిరుదులు ఉన్నా, వాళ్లు వాటిని బయట ప్రదర్శించరని తెలిపారు.

ఇప్పుడు చాలా మంది ఒకేసారి మాట్లాడటం యాదృచ్ఛికం కాదని కొందరు అంటున్నారు. నిజం బయటకు వస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఆరోపణలపై స్పష్టమైన ఆధారాలు లేకపోవడంతో అధికారిక సమాచారం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ అంటే పడని వాళ్ళు ఇలాంటివి చేస్తూ ఉండొచ్చు అని కూడా ఆయన అభిమానులు వాదిస్తున్నారు.

ALSO READ: Swayambhu Teaser Review: నిఖిల్ ‘స్వయంభు’ సినిమా టీజర్ ఎలా ఉందంటే?.. అది ఓకే కానీ..

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×