India’s Longest-Range Electric Car: భారతీయ ఆటో మార్కెట్ లోకి సరికొత్త ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఒకే ఛార్జ్ తో ఎక్కువ దూరం ప్రయాణించేలా ఆయా కంపెనీలు వీటిని రూపొందిస్తున్నాయి. అయితే, ప్రస్తుతం ఇండియాలో ఒకే ఛార్జ్ తో ప్రయాణించే ఎలక్ట్రిక్ కారు ఏది? ఎంత దూరం ప్రయాణిస్తుంది? ఫుల్ ఛార్జ్ కావడానికి ఎంత సమయం పడుతుంది? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం..
ప్రస్తుతం ఇండియాలో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే ఎలక్ట్రిక్ కారు మెర్సిడెస్ బెంజ్ EQS 580. ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ సెడాన్ ARAI క్లెయిమ్ ప్రకారం ఒకే ఛార్జ్ తో 850 కి.మీ. ప్రయాణిస్తుంది. అయితే, రియల్ వరల్డ్ ప్రయాణం సుమారు 600–650 కి.మీ ఉంటుందని భావిస్తున్నారు. టెస్టింట్ సమయంలో ఒకే ఛార్జ్ తో 700 కి.మీ వరకు ప్రయాణించినట్లు తేలింది. 200 kW DC ఫాస్ట్ ఛార్జర్ తో ఈ కారు బ్యాటరీ 30 నిమిషాల్లో 10% నుండి 80% వరకు ఛార్జ్ అవుతుంది.
EQS 580 ప్రీమియం లగ్జరీ కారుగా మార్కెట్ లోకి అడుగు పెట్టింది. దేశంలో ఈ కారు ధర దాదాపు రూ. 1.30 కోట్ల నుంచి ప్రారంభమవుతాయి. ఈ కారు 107.8 kWh బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటుంది. డ్యూయల్ మోటార్ సెటప్ ను ఉపయోగిస్తుంది. ఇది బలమైన పని తీరును కనబరుస్తుంది. దాదాపు 523 hp పవర్, 855 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.
మెర్సిడెస్ బెంజ్ EQS 580 చాలా అందంగా ఉంటుంది. ఫ్యూచరిస్టిక్ లుక్ ను కలిగి ఉంటుంది. ఇది డ్రాగ్‌ను తగ్గించడానికి, సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడే ఏరోడైనమిక్ డిజైన్ ను కలిగి ఉంటుంది. మృదువైన, వంపు తిరిగిన సిల్హౌట్ ను కలిగి ఉంటుంది. LED హెడ్ ల్యాంప్స్, పెద్ద అల్లాయ్ వీల్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్తో పాటు భారతీయ రోడ్లపై ప్రత్యేకంగా కనిపించే మోడ్రన్, ప్రీమియం రూపాన్ని ఇస్తాయి. ఇక లోపల లెదర్ అప్హోల్స్టరీ, రియల్ వుడ్ ట్రిమ్, యాంబియంట్ లైటింగ్ లాంటి హై ఎండ్ మెటీరియల్స్ తో కూడిన లగ్జరీ క్యాబిన్‌ను అందిస్తుంది. ఇది అధునాతన నావిగేషన్, వినోదం, కనెక్టివిటీ ఫీచర్లతో డాష్‌బోర్డ్ ను కలిగి ఉంటుంది. MBUX హైపర్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ తో వస్తుంది. ప్రయాణీకులు లాంగ్ డ్రైవ్‌లకు మంచి సౌకర్యంతో విశాలమైన సీటింగ్‌ను కూడా పొందుతారు.
EQS 580లో అత్యాధునిక భద్రతను కలిగి ఉంటుంది. మల్టీ ఎయిర్ బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, అధునాతన డ్రైవర్ అస్టిస్ట్ వ్యవస్థలు, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, లేన్ కీపింగ్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ సహా పలు సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంటుంది. EQS 580 రేంజ్ లో దేశంలో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇండియాలో మరికొన్ని ఇతర EVలు కూడా ఒకే ఛార్జ్ పై సుదూర ప్రయాణాలను అందిస్తాయి. టెస్లా మోడల్ Y దాదాపు 661 కి.మీ, కియా EV6 ఒకే ఛార్జ్ పై దాదాపు 663 కి.మీ రేంజ్ ను అందిస్తాయి.