E-Paper
Advertisement

జైలర్ 2లో హృతిక్ రోషన్.. 5 నిమిషాలకే అన్ని కోట్లా?

జైలర్ 2లో హృతిక్ రోషన్.. 5 నిమిషాలకే అన్ని కోట్లా?
Advertisement

Jailer 2 Hrithik Roshan:బాలీవుడ్ గ్రీకు వీరుడిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న హృతిక్ రోషన్ గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. ఈయన పేరుకే బాలీవుడ్ హీరో అయినా.. టాలీవుడ్ అమ్మాయిల కలల రాకుమారుడు అనడంలో సందేహం లేదు.. అలా తన నటనతో, లుక్స్ మేనరిజంతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. అలాంటి ఈయన తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ 2 చిత్రంలో కీలక పాత్ర పోషించి, అభిమానులను సర్ప్రైజ్ చేశారు. ఇకపోతే ఈయన తన నటనతోనే కాదు తన రెమ్యూనరేషన్ తో కూడా అందరి దృష్టిని ఆకర్షించారు.

జైలర్ 2లో హృతిక్ రోషన్ క్యామియో రోల్..

అసలు విషయంలోకి వెళ్తే.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా , జైలర్ సినిమాకి కొనసాగింపుగా అక్టోబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం జైలర్ 2. జైలర్ చిత్రం లాగే జైలర్ 2 లో కూడా ప్రముఖ స్టార్ హీరోలు కీలకపాత్రలు పోషించారు. ముఖ్యంగా ఒక సినిమాలో క్యామియో రోల్స్ ని ఎలా ఉపయోగించుకోవాలో చూపెట్టిన చిత్రం కూడా బహుశా ఇదే కావచ్చు. జైలర్ సినిమాలో ఉన్న శివ రాజ్ కుమార్, మోహన్ లాల్ జైలర్ 2 లో కూడా ఉన్నారు. అయితే చివరిలో వచ్చే విజయ్ సేతుపతి రోల్ కి కూడా అదిరిపోయే రేంజ్ ఆదరణ లభించింది. జైలర్ 3 లో కూడా ఈయన పాత్ర ఉండబోతోంది అంటూ హింట్ కూడా ఇచ్చారు డైరెక్టర్ నెల్సన్.

Advertisement

also read:‘రణబాలి’ మూవీ రివ్యూ.. విరోష్ జంట హ్యాట్రిక్ కొట్టిందా?

జైలర్ 2 కి హృతిక్ రోషన్ రెమ్యూనరేషన్..

ఇదిలా ఉండగా జైలర్ 2 లో ప్రీ క్లైమాక్స్ లో బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ క్యామియోకి థియేటర్స్ లో పగిలిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది. ఆయన స్క్రీన్ ప్రజెంట్స్ , స్టైల్ అన్నీ ఆకట్టుకున్నాయి. ఓకే స్క్రీన్ లో రజనీకాంత్, హృతిక్ రోషన్లను చూసిన అభిమానులు సంతోషంతో పిచ్చెక్కిపోయారు. తన అద్భుతమైన స్క్రీన్ స్పేస్ తో అందరినీ ఆకట్టుకున్నారు. ఇకపోతే ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరుస్తున్న మరో అంశం ఏమిటంటే.. ఆయన రెమ్యూనరేషన్. ఈ సినిమాలో క్యామియో రోల్ పోషించినందుకు సుమారుగా 12 కోట్ల రూపాయల వరకూ రెమ్యూనరేషన్ అందుకున్నారని కోలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న రూమర్. అయితే మరి కొంతమంది రజినీకాంత్ మీద అభిమానంతో హృతిక్ రోషన్ ఒక రూపాయి కూడా తీసుకోలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.. మరి ఇందులో ఏది నిజమో తెలియదు కానీ హృతిక్ రోషన్ ఈ రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకున్నారు అంటూ వస్తున్న వార్తలు మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

ఆ ఇద్దరూ రిజెక్ట్ చేయడం వల్లే ఈయన వద్దకు..

Advertisement

ఇకపోతే హృతిక్ రోషన్ పాత్రలో మొదట బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ను ఈ పాత్ర కోసం సంప్రదించారు. అయితే ఆయన సినిమా షెడ్యూల్ కారణంగా ఆయన తప్పుకున్నారు.. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ని సంప్రదించారు. కానీ ఆయన ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉండడం వల్ల చేయలేకపోయారు. దీంతో చివరికి ఈ పాత్ర హృతిక్ రోషన్ ను వరించింది.

Related News

రామాయణ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్..ఎప్పుడు? ఎక్కడంటే?

నా కోరిక నెరవేరలేదు.. ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్ పై విద్యాబాలన్ కామెంట్స్!

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

డైరెక్టర్ పై విద్యాబాలన్ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు!

ఇండస్ట్రీని వదిలేద్దామనుకున్న అనుపమ.. అంతలా వేధించారా?

ట్రెడిషనల్ లుక్‌లో మిస్ వరల్డ్ బ్యూటీ.. ఎంత అందంగా ఉందో!

అసలు ‘ఎంద చేట’ ఎలా పుట్టిందో తెలుసా? కృష్ణారెడ్డి చెప్పిన అసలు కథ!

Big Stories

Advertisement
×