E-Paper
Advertisement

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!
Advertisement

Smartphone Market Drop: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు, అలాగే కొత్త ఫోన్ కొందామనుకునే వారికి ఒక చేదు వార్త. ప్రస్తుతం గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ మునుపెన్నడూ లేనంత తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మెమరీ చిప్‌ల తీవ్రమైన కొరత కారణంగా ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల తయారీ తగ్గిపోవడంతో పాటు.. ఫోన్ల ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో చాలామంది ప్రజలు కొత్త ఫోన్లు కొనడం వాయిదా వేసుకుంటున్నారు. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్లు ఏకంగా 20 శాతం పడిపోయాయి. గత పదిహేనేళ్లలో స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు ఈ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి.

పెరిగిన ఫోన్ల ధరలు..

మెమరీ చిప్‌ల కొరత వల్ల స్మార్ట్‌ఫోన్ల తయారీ వ్యయం విపరీతంగా పెరిగింది. దాంతో కంపెనీలు తమ లాభాలను కాపాడుకోవడానికి ఫోన్ల ధరలను పెంచక తప్పలేదు. ఈ ప్రభావం సామాన్య, మధ్యతరగతి వినియోగదారులపై ఎక్కువగా పడింది. తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఉండే బడ్జెట్ ఫోన్లు ఇప్పుడు ప్రియంగా మారాయి. అందుకే చాలామంది కొత్త ఫోన్ కొనే బదులు, ఉన్న ఫోన్‌నే మరికొంత కాలం వాడుకోవాలని డిసైడ్ అవుతున్నారు. మరికొందరు సెకండ్ హ్యాండ్ లేదా రిఫర్బిష్డ్ ఫోన్ల వైపు మొగ్గు చూపుతున్నారు.

Advertisement

Also Read: iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్, శాంసంగ్ టాప్..

ఇంతటి కష్టకాలంలో కూడా దిగ్గజ కంపెనీలు శాంసంగ్, యాపిల్ తమ హవాను కొనసాగించాయి. సేల్స్ కాస్త తగ్గినా.. 23 శాతంతో శాంసంగ్ తొలి స్థానంలో నిలిచింది. కంపెనీ కొత్తగా తెచ్చిన ఫోల్డబుల్ ఫోన్లకు మంచి డిమాండ్ లభించింది. ఇక యాపిల్ విషయానికొస్తే.. మూడో త్రైమాసికంలో ఎప్పుడూ లేనంతగా 22 శాతం మార్కెట్ షేర్‌ సాధించింది. మార్కెట్లో బేసిక్ ఐఫోన్ మోడల్స్ కొరత ఉన్నప్పటికీ.. ప్రీమియం ప్రో మోడల్స్‌ను జనాలు బాగా కొనుగోలు చేశారు.

చైనా బ్రాండ్లకు దెబ్బ..

Advertisement

మరోవైపు షావోమి, ఒప్పో, వివో వంటి చైనా బ్రాండ్లకు ఈ చిప్‌ల సంక్షోభం గట్టి దెబ్బే కొట్టింది. విక్రయాలు పడిపోవడంతో ఈ కంపెనీల మార్కెట్ షేర్ గణనీయంగా తగ్గింది. షావోమి 12 శాతానికి, ఒప్పో 9 శాతానికి, వివో 8 శాతానికి పడిపోయాయి. బడ్జెట్ విభాగంపై ఎక్కువగా ఆధారపడే ఈ బ్రాండ్లు, విడిభాగాల ధరల పెంపును తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నాయి.

పరిస్థితి మారేనా?

ఈ పరిస్థితి వెంటనే మారే సూచనలు కనిపంచడం లేదు. ఈ ఏడాది చివరి వరకు ఇదే ధోరణి కొనసాగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కూడా తమ ఉత్పత్తిని తగ్గించుకుంటూ.. కేవలం లాభాలు తెచ్చే ప్రీమియం ఫోన్లపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. మెమరీ చిప్‌ల సరఫరా సాధారణ స్థితికి వచ్చి, తయారీ ఖర్చులు తగ్గేవరకూ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ మళ్లీ పుంజుకోవడం కష్టమే అని చెప్పాలి.

Also Read: యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

Tags

Related News

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

ఆకట్టుకునే లుక్, అడ్వాన్స్‌డ్ ఏఐ ఫీచర్స్‌తో Samsung Galaxy F70 5G వచ్చేస్తోంది!

ఒకే ఒక్క రీఛార్జ్.. ఏడాది పొడవునా ఫ్రీ కాల్స్, డేటా.. Airtel చౌకైన వార్షిక ప్లాన్స్ ఇవే!

ఆఫీస్,స్టడీస్ కోసం బెస్ట్ డెల్ ల్యాప్‌టాప్..120Hz డిస్‌ప్లేతో అదుర్స్!

రూ.937లకే పోర్టబుల్ స్పీకర్! డిస్కౌంట్‌లో కొనేయండి

Big Stories

Advertisement
×