E-Paper
Advertisement

Dil Raju: ‘దేత్తడి’ కథ పుట్టడానికి కారణం ఎవరంటే?

Dil Raju: ‘దేత్తడి’ కథ పుట్టడానికి కారణం ఎవరంటే?
Advertisement

Dil Raju: ‘‘రౌడీ బాయ్స్, లవ్ మీ’’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆశిష్ (Ashish) హీరోగా, సక్సెస్‌ఫుల్ నిర్మాతలు దిల్ రాజు (Dil Raju), శిరీష్ తమ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం ‘దేత్తడి’ (Dethadi). ఈ ప్రాజెక్ట్‌‌తో ఆదిత్య రావు గంగసాని (Aditya Rao Gangasani) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హైదరాబాద్ కల్చర్ బ్యాక్‌డ్రాప్‌లో సరికొత్తగా ముస్తాబవుతున్న ఈ చిత్రం నుంచి తాజాగా మేకర్స్ గ్లింప్స్ వదిలారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు విడుదలైన గ్లింప్స్ కూడా మంచి ఆదరణను రాబట్టుకుంటోంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ గ్లింప్స్ (Dethadi Glimpse) లాంచ్ కార్యక్రమానికి హాజరైన దిల్ రాజు.. సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

Also Read- Director Maruthi: ది రాజా సాబ్ తరువాత మళ్లీ సంక్రాంతికి మారుతి కొత్త సినిమా..హీరో ఎవరంటే..!

ఆరు వందల మంది.. ఫ్రీగా!

Advertisement

‘‘హైదరాబాదులో ఉండే కల్చర్ ఫెస్టివల్స్ గురించి చెప్పేలా ఈ సినిమా ఉంటుంది. ‘దేత్తడి’ కథ పుట్టడానికి కారణం ఆదిత్య రావు. ఒక బ్యాండ్ కొట్టుకునే కుర్రాడు గురించి తన లైఫ్‌లో చూసిన ఇన్సిడెంట్స్ అన్నింటిని ఘన్ను అనే క్యారెక్టర్‌తో కథగా రాసుకున్నాడు. హైదరాబాదులో ఉండే ఎల్లమ్మ లగ్గం దగ్గర నుంచి బోనాలు, వినాయక చవితి, సదర్.. ఇలా హైదరాబాద్ కల్చర్ గురించి ఈ సినిమా తీయబోతున్నాడు. దాదాపు ఏడాదిగా ఆదిత్య, ఆశిష్ బ్యాండ్ వాయించే వాళ్ళ చుట్టూ తిరుగుతూ.. వాళ్ల గురించి తెలుసుకుంటూ వాళ్ళ లైఫ్‌లో ఉండే ఇన్సిడెంట్స్ అన్ని పోగుచేసుకొని ‘దేత్తడి’ కథని పూర్తి చేశారు. ఈ ఈవెంట్‌కి హైదరాబాద్‌లో ఉండే బ్యాండ్ కంపెనీస్ అందరి దగ్గరికి వెళ్లి కలిశారు. తమ గురించి సినిమా తీస్తున్నారనే ఆనందంతో ఫ్రీగా దాదాపు ఆరు వందల మంది వచ్చి ఈ వేడుకలో పాల్గొన్నారు. నిజంగా నాకే ఆశ్చర్యమనిపించింది.

Also Read- Venky Atluri: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సెట్లోకి చిరుతపులి.. షాకింగ్ విషయం చెప్పిన డైరెక్టర్

హైదరాబాద్ కల్చర్‌ చాటే సినిమా..

Advertisement

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఉన్న బ్యాండ్ పీపుల్ అందరికీ కూడా మా టీమ్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత ఏడాదిగా ఆశిష్ ఈ సినిమా కోసం ప్రతి బ్యాండ్ వాళ్ళ దగ్గరికి వెళ్లి.. ‘బ్యాండ్ ఎలా కొట్టాలి, ఎన్ని బ్యాండ్స్ ఉంటాయి..?’ ఇలా నేర్చుకుని ఈ సినిమా కోసం రెడీ అయ్యాడు. ఆశిష్, ఆదిత్య వాళ్ళ టీమ్ చేస్తున్న ప్రయత్నానికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. ఆదిత్య కథ అద్భుతంగా రాసుకున్నాడు. ఆదిత్యతో పాటు ప్రసన్న ఈ స్క్రిప్ట్‌ని ఫుల్ పూర్తిస్థాయిలో రాసుకున్నారు. హైదరాబాద్ కల్చర్‌ని ప్రపంచానికి గొప్పగా చూపించబోయే సినిమాతో వస్తున్న టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాజులేషన్స్..’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ చిత్ర గ్లింప్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Also Read- Director Saailu: నక్క తోక తొక్కిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ డైరెక్టర్.. నెక్ట్స్ సినిమా ఏ బ్యానర్‌లో అంటే?

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×