E-Paper
Advertisement

Biker Movie: దిల్ రాజు చేతికి శర్వానంద్ ‘బైకర్ ‘ తెలుగు రాష్ట్రాల రిలీజ్ హక్కులు..

Biker Movie: దిల్ రాజు చేతికి శర్వానంద్ ‘బైకర్ ‘ తెలుగు రాష్ట్రాల రిలీజ్ హక్కులు..
Advertisement

Biker Movie:  టాలీవుడ్ హీరో శర్వానంద్ ఇటీవల బ్యాక్ టు బ్యాక్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 2026 సంక్రాంతి పండుగ సందర్భంగా శర్వానంద్ (Sharwanand )హీరోగా నటించిన నారీ నారీ నడుమ మురారి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే . ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో తదుపరి సినిమాలపై కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక శర్వానంద్ తన తదుపరి సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు ప్రస్తుతం ఈయన శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

దిల్ రాజుకే బైక థియేట్రికల్ రైట్స్ ..

ఇక శర్వానంద్ హీరోగా నటించిన బైకర్(Biker) సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ఏప్రిల్ మూడో తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరుగుతోందని సమాచారం అయితే తాజాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) బైకర్ సినిమా చూశారని తెలుస్తోంది. ఈ సినిమా చూసి ఇంప్రెస్ అయిన దిల్ రాజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల రిలీజ్ హక్కులను కైవసం చేసుకున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా భారీ ధరలకే దిల్ రాజు దక్కించుకున్నట్టు ఇండస్ట్రీ సమాచారం. ఇక ఇటీవల శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి రెండు తెలుగు రాష్ట్రాల రిలీజ్ హక్కులను కూడా దిల్ రాజు సొంతం చేసుకున్నారు. ఈ సినిమా ద్వారా దిల్ రాజుకు భారీగా లాభాలు వచ్చాయని చెప్పాలి.

బైక్ రేసర్ గా శర్వానంద్..

Advertisement

ఇలా ఈ సినిమాతో మంచి లాభాలను అందుకున్న దిల్ రాజు శర్వానంద్ తదుపరి సినిమా బైకర్ రిలీజ్ హక్కులను కూడా కైవసం చేసుకున్నారు. ఇక బైకర్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ జోడిగా మాళవిక నాయర్ హీరోయిన్ గా కనిపించబోతున్నారు ఇక శర్వానంద్ ఈ సినిమాలో బైక్ రేసర్ గా కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాలో మరొక స్టార్ హీరో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. సీనియర్ నటుడు రాజు శేఖర్ (Rajasekhar)సునీల్ అనే పాత్రలో కనిపించబోతున్నారు.

శర్వానంద్ తండ్రి పాత్రలో రాజశేఖర్..

Advertisement

రాజశేఖర్ శర్వానంద్ కు తండ్రి పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు అప్డేట్స్ విడుదల చేయగా సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేశాయి. ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలా రేసింగ్ నేపథ్యంలో సినిమాలు తక్కువగానే వచ్చాయని చెప్పాలి. మరి విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శర్వానంద్ ఈ సినిమా ద్వారా ఎలాంటి సక్సెస్ అందుకుంటారు అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా యువి క్రియేషన్ బ్యానర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

Also Read: Peddi Movie: మెగాఫాన్స్ కి ఊహించని షాక్.. పెద్ది ఇప్పట్లో లేనట్టే?  మళ్లీ వాయిదా..

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×