Ram Charan: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న వారిలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. ఈయన డిస్ట్రిబ్యూటర్ గా తన ప్రయాణం మొదలుపెట్టి అనంతరం దిల్ అనే సినిమాతో నిర్మాతగా మారారు. ఇక ఈ సినిమా నిర్మాతగా ఆయనకు మొదటి సక్సెస్ అందించడమే కాకుండా తన సినిమా పేరు ఇంటి పేరుగా పెట్టుకొని దిల్ రాజుగా మారిపోయారు. ఇలా దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్స్ గా కొనసాగుతున్న హీరోలు అందరికీ కూడా తన నిర్మాణ సంస్థలో సూపర్ హిట్ సినిమాలను అందించిన ఘనత దిల్ రాజుకు ఉందని చెప్పాలి.
ద్విపాత్రాభినయం…
ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా మంచి సక్సెస్ అందుకున్న దిల్ రాజు రామ్ చరణ్(Ram Charan) తో మొట్టమొదటిసారి అత్యంత భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా చేశారు. రామ్ చరణ్ RRR సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత ఈయన దిల్ రాజు నిర్మాణంలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) దర్శకత్వంలో గేమ్ చేంజర్(Game Changer) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయంలో నటించారు. ఇలా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది .
నిరాశకు గురి చేసిన గేమ్ చేంజర్…
ఇక ఈ సినిమా చరణ్ అభిమానులను తీవ్ర స్థాయిలో నిరాశ పరిచింది. తాజాగా ఈ సినిమా అందుకున్న ఫలితం గురించి నిర్మాత దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్(Venu Sriram) దర్శకత్వంలో నితిన్ (Nithin)నటించిన తమ్ముడు(Thammudu) సినిమా జులై 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా దిల్ రాజు ఒక ఇంటర్వ్యూకి హాజరయ్యారు.
నా చేతుల్లో ఏం లేదు…
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా రిజల్ట్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ విషయంలో మీరు రిగ్రేట్ గా ఫీల్ అవుతున్నారా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు దిల్ రాజు సమాధానం చెబుతూ.. నేను ఈ విషయంలో చాలా ఎమోషనల్ గా,రిగ్రేట్ గా కూడా ఫీల్ అవుతున్నానని తెలిపారు.. గేమ్ చేంజర్
సినిమా విషయంలో నేను ఏం చేయలేని పరిస్థితులలో ఉండిపోయానని, అప్పటికే పరిస్థితులన్నీ నా చేతుల నుంచి జారిపోయాయి అంటూ ఈ సందర్భంగా దిల్ రాజు ఈ సినిమా విషయంలో ఇప్పటికి బాధపడుతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా దిల్ రాజుకు భారీగా నష్టాలు కూడా వచ్చాయని చెప్పాలి. ఏది ఏమైనా మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా ఎంతో ప్రతిష్టాత్మకంగా దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాతో ఆయనకు నష్టాలు మాత్రమే కాకుండా తీవ్ర నిరాశ కూడా ఎదురైన చెప్పాలి.
Also Read: Abhisekh Bachchan: సందీప్ శిష్యుడుతో అభిషేక్ బచ్చన్.. మరో యానిమల్ రాబోతోందా?